breaking news
Against
-
మళ్లీ పాక్ వక్ర బుద్ధి: యుద్ధంలో ఓడినా.. పాఠ్య పుస్తకాల్లో గెలుపు పాఠాలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. 2025 మే నెలలో భారత్–పాక్ మధ్య చోటుచేసుకున్న నాలుగు రోజుల సైనిక ఘర్షణల దరిమిలా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే పాక్ ప్రభుత్వం దీనికి భిన్నంగా, తమ దేశ పాఠశాల పాఠ్యపుస్తకాలలో ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఘనవిజయం సాధించిందని చెబుతూ, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసింది.పాకిస్తాన్ కొత్తగా రూపొందించిన పాఠ్యపుస్తకాల్లో ‘భారత్ 2025 మే 6న పాకిస్తాన్‌పై అనూహ్యంగా యుద్ధం ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ సైన్యం తెలివిగా స్పందించి, భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపై భారత్ శాంతికి మొగ్గుచూపుతూ యుద్ధాన్ని ఆపేలా చేసుకుంది” అని పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో ‘ఆపరేషన్ బునియాన్ ఉల్ మర్సూస్’ అనే పేరుతో, పాకిస్తాన్ 26 భారత ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అంతేకాకుండా, పాకిస్తాన్ సైన్యం నేతృత్వం వహించిన ఆపరేషన్ విజయం సాధించడంతో, ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ బిరుదు అందించినట్లు కూడా దానిలో రాశారు.కాగా పాక్ విషప్రచారంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వతంత్ర మీడియా, విశ్లేషకులు, భారత ప్రభుత్వ వర్గాలు దీనిని చరిత్రను వక్రీకరించే ప్రయత్నంగా తప్పుబడుతున్నాయి. ‘వాస్తవాలను వక్రీకరిస్తూ, జాతీయ గౌరవం పేరుతో పిల్లలకు తప్పుడు చరిత్రను నేర్పడం ప్రమాదకరం’ అని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వం, భద్రతా సంస్థలు ఈ యుద్ధంలో పాక్ సైనిక స్థావరాలపై విస్తృతమైన దాడులు చేపట్టినట్లు ప్రకటించాయి. ఉపగ్రహ చిత్రాలు, స్వతంత్ర మీడియా రిపోర్టుల ప్రకారం పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు తీవ్రంగా నష్టపోయినట్లు స్పష్టమయ్యింది. పాకిస్తాన్ విద్యా వ్యవస్థలో ఈ విధంగా వక్రీకరించిన చరిత్ర.. విద్యార్థుల మనోభావాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
Bihar: ప్రధాని మోదీ దివంగత తల్లికి మళ్లీ అవమానం.. వీడియోను షేర్ చేసిన ఉపముఖ్యమంత్రి
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కుతోంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన బీహార్ అధికార్ యాత్ర లో ప్రధాని మోదీ దివంగత తల్లిని మళ్లీ అవమానించారని బీజేపీ ఆరోపించింది. ఈ సంఘటనను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది బీహార్ సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్నారు. కాగా దీనిపై ఆర్జేడీ ఇంకా అధికారిక ప్రతిస్పందన వెల్లడించలేదు.తేజస్వి యాదవ్ పర్యటనలో ఆర్జేడీ కార్యకర్తలు దుర్భాషను ఉపయోగించారని బిజెపీ ఆరోపించింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ అరోపణలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. తేజస్వి యాదవ్ కార్యకర్తల వేధింపుల తీరును ప్రోత్సహిస్తున్నారని, ఈ తరహా ప్రవర్తన బీహార్ సంస్కృతిని నాశనం చేస్తున్నదని రాశారు. బీహార్‌లోని మహిళలు ఈ అవమానంపై ప్రజాస్వామ్య రీతిలో ప్రతిస్పందించాలని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు. तेजस्वी यादव ने फिर दिलवाई- मोदी जी की मृत माताजी को गाली। इन्होंने बिहार की संस्कृति को एक बार फिर तार-तार कर दिया।रैली में आरजेडी के कार्यकर्ता जितना ही गाली दे रहे, तेजस्वी उतना ही हौसला बढ़ा रहे थे। इस गुंडई की मानसिकता और गाली का हिसाब बिहार की माताएँ-बहनें जरूर करेंगी। pic.twitter.com/p4TNr4J20V— Samrat Choudhary (@samrat4bjp) September 20, 2025ఈ ఘటనను ప్రజాస్వామ్యానికి జరిగిన తీవ్ర అవమానంగా చౌదరి అభివర్ణించారు. మహిలలను అవమానించడం ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారిందా? అని ప్రశ్నించారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రతిస్పందన తెలియజేశారు. తేజస్వి యాదవ్ తన పర్యటనలో ప్రధాని మోదీ దివంగత తల్లిపై దుర్భాషలాడారని అన్నారు. ఈ రకమైన రాజకీయాలు ఆమోదయోగ్యం కాదని, దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కాగా బీజేపీ ఆరోపణలపై ఆర్జేడీ నుండి అధికారిక స్పందన రాలేదు. కాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సెప్టెంబర్ 16న జెహానాబాద్ నుండి తన బీహార్ అధికార్ యాత్రను ప్రారంభించారు. యాత్రలోని మొదటి దశ నలంద, బెగుసరాయ్ తదితర ప్రాంతాల గుండా సాగి, సెప్టెంబర్ 20న వైశాలిలో ముగిసింది. -
ప్రభుత్వ వ్యతిరేక ఉత్తర్వుల జారీపై వెనుకంజ
న్యూఢిల్లీ: వివిధ ట్రిబ్యునళ్లలోని నాన్ జ్యుడీషి యల్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయడానికి ఇష్టపడటం లే దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేందుకు కృషి చేయా లని వారిని కోరారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)–2025 ఆలిండియా కాన్ఫరెన్స్‌లో శనివారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రిబ్యునళ్లలోని పలు సమ స్యలు, దేశంలోని న్యాయవ్యవస్థ తీరు గురించి పలు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్, పీఎంవోలోని సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిపా లనా ట్రిబ్యునళ్లు న్యాయస్థానాలకు భిన్నంగా ఉంటాయని, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య వీటికి ఒక ప్రత్యేకత ఉందన్నా రు. ట్రిబ్యునళ్లలోని సభ్యులు కొందరు పరి పాలనా విభాగానికి చెందిన వారైతే మరికొందరు న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన వారని తెలిపారు. ‘ఒక న్యాయమూర్తిగా, నేను వ్యక్తి గతంగా గమనించిందేమంటే.. పరిపాలనా విభాగాల నుంచి వచ్చిన ట్రిబ్యునళ్ల సభ్యులు కొందరు తమ పూర్వ అనుభవాలను మర్చిపోవడం లేదు. వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఏదైనా ఉత్తర్వును జారీ చేయడానికి ఇష్టపడటం లేదు. వీరి ఈ విషయాన్ని ఆలోచించాలని కోరుతున్నా’అని సీజేఐ అన్నారు. వీరి కోసం న్యాయ విద్యావేత్తలతో వర్క్‌షాపులు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నానన్నారు. ట్రిబ్యునళ్లలో సభ్యుల నియామకం, సర్వీసు నిబంధనల విషయంలో ఏకీకృత ప్రక్రియను తీసుకువస్తే బాగుంటుందన్నారు. -
6ఏ నోటీసులపై భగ్గుమన్న రైతులు
నక్కపల్లి: రైతుల ఆమోదం లేకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం బల్‌్కడ్రగ్ పార్కుకు అదనపు భూ సేకరణ చేపట్టడంపై రైతులు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో జానకయ్యపేట, సీహెచ్‌ఎల్‌పురం గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్కు కోసం అదనంగా 197 ఎకరాల భూమిని సేకరించడానికి మేలో ప్రభుత్వం 6ఏ నోటీసు ప్రకటన విడుదలచేసి అభ్యంతరాలు తెలపాలని పేర్కొంది. అయితే, భూములిచ్చేది లేదంటూ రైతులు పలుమార్లు నిరసన తెలిపినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంపై వారంతా రగిలిపోతున్నారు.ఈ నేపథ్యంలో.. శనివారం వైఎస్సార్సీపీ, సీపీఎంల మద్దతుతో రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఇప్పటికే ప్రభుత్వం రెండు వేల ఎకరాలను బల్క్‌డ్రగ్ పార్కు కోసం కేటాయిస్తే మరో 700 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడం దుర్మార్గమన్నారు. ఇందులో 197 ఎకరాలు జానకయ్యపేట, సీహెచ్‌ఎల్‌పురం రెవెన్యూ పరిధిలో తీసుకోవడానికి పత్రికా ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ సందర్భంగా.. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ.. రైతులను బెదిరించి భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.జజిల్లాలో ఎక్కడాలేని విధంగా హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న నక్కపల్లి మండలంలోనే వేల ఎకరాల భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఎకరా, రెండెకరాల భూములు కలిగిన రైతులు కంపెనీలకు భూములిచ్చేస్తే వాటిపై వచ్చే తక్కువ పరిహారంతో ఎలా బతుకుతారని వారు ప్రశ్నించారు. రైతులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. వచ్చేనెల 6న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను సైతం అడ్డుకుని నిరసన తెలియజేస్తామని వారు స్పష్టంచేశారు. పలువురు టీడీపీ నేతలు కూడా భూములు ఇవ్వబోమంటూ తహశీల్దార్‌కు లిఖితపూర్వకంగా తెలిపారు. -
తిరగబడ్డ ఆడబిడ్డ.. కూటమి విఫల పాలనపై ఆగ్రహజ్వాలలు (చిత్రాలు)
-
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల భారంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు... దద్దరిల్లిన శాసన మండలి
-
ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు... ప్రభుత్వ అరాచకాలపై ప్రజల ఆగ్రహం