Agastya Maharshi
-
అగస్త్యుడి చేతిలో రావణుడి ఓటమి
మేరు పర్వతంతో స్పర్థకు పోయిన వింధ్య పర్వతం ఆకాశాన్ని కమ్మేస్తూ పెరిగిపోవడంతో గ్రహగతులు తప్పి, ముల్లోకాల్లోనూ కల్లోలం ఏర్పడింది. దేవతలందరూ ప్రార్థించడంతో అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి వింధ్య పర్వతం వైపుగా దక్షిణదేశ యాత్రకు బయలుదేరాడు. అగస్త్యుడు భార్యా సమేతంగా తనవైపు వస్తుండటంతో వింధ్యుడు ఆయన ముందు మోకరిల్లాడు. తాను దక్షిణదేశ యాత్రలకు వెళుతున్నానని, తాను తిరిగి వచ్చేంత వరకు అలాగే ఉండమని వింధ్యుణ్ణి ఆదేశించాడు. అలా వింధ్యుడిని అణచిన అగస్త్యుడు దక్షిణ భారత దేశంలోని తీర్థక్షేత్రాలన్నింటినీ దర్శించుకున్నాడు. తీర్థయాత్రలు ముగిశాక ఆయన కావేరీ తీరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, భార్యా సమేతంగా తపోజీవనం గడపసాగాడు.దక్షిణ భారత దేశానికి ఆవల సముద్రం నడిబొడ్డున ఉన్న లంకను అప్పట్లో రావణుడు పరిపాలించేవాడు. తన అన్న కుబేరుడిని అలకాపురి వరకు తరిమికొట్టి, అప్పటి వరకు అతడు పాలించిన లంకను, అతడి పుష్పక విమానాన్ని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత రావణుడు దేవతలను జయించాడు. అష్ట దిక్పాలకులను తన ఆజ్ఞలకు లోబడేలా చేసుకున్నాడు. నవగ్రహాలను తన అదుపులోకి తెచ్చుకున్నాడు. అయితే, లంకకు చేరువలో ఉన్న దక్షిణ భారతదేశం మాత్రం అతడికి స్వాధీనం కాలేదు. ఆ ప్రాంతాన్ని కూడా ఎలాగైనా తన వశంలోకి తెచ్చుకోవాలని తలచాడు.దక్షిణ భారతదేశంలో పరిస్థితులు ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకుని రావాలని ముందుగా కొందరు దూతలను, వేగులను పంపాడు. వారు దక్షిణ భారతదేశం నలుమూలలా సంచరించారు. కొండలు, కోనలు, అడవులతో పచ్చని ప్రకృతి సౌందర్యంతో అలరారే దక్షిణ భారతదేశం అత్యంత ప్రశాంతంగా కనిపించింది. అడవుల్లో అక్కడక్కడా చక్కని పొదరిళ్లలాంటి రుషి ఆశ్రమాలు కనిపించాయి. వారు తిరిగి లంకకు చేరుకుని, తాము చూసిన పరిస్థితులను రావణుడికి వివరించారు.అంత ప్రశాంతంగా ఉన్న దక్షిణ భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవడం తేలిక పనేనని అనుకున్నాడు. తాను కూడా ఒకసారి స్వయంగా పరిస్థితులను చూసి, అవసరమైనట్లయితే యుద్ధానికి తగిన ఏర్పాట్లతో తిరిగి వచ్చి, దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు.కొద్దిమంది అనచరులతో కలసి రావణుడు దక్షిణ భారతదేశానికి వచ్చాడు. కావేరీ తీరం మీదుగా సంచరిస్తూ, అగస్త్యుడి ఆశ్రమం వద్దకు చేరుకున్నాడు. ఆశ్రమం ఆవరణలోనే అగస్త్యుడు కూర్చుని ఉండటం చూసి, రావణుడు ‘మునీశ్వరా! ప్రణామాలు’ అంటూ నమస్కరించాడు.అగస్త్యుడు సాదరంగా స్వాగతం పలుకుతూ, ‘రావయ్యా లంకేశ్వరా! రా! లోపలికి పద’ అంటూ ఆశ్రమం లోనికి తీసుకుపోయి, ఉచితాసనంపై కూర్చోబెట్టాడు. కుశల ప్రశ్నలయ్యాక, ‘ఏం పని మీద ఇక్కడకు వచ్చావు?’ అని నేరుగా అడిగాడు అగస్త్యుడు.‘మునీశ్వరా! ఇప్పటికే నేను స్వర్గాన్ని కూడా నా అధీనంలోకి తెచ్చుకున్నాను. ఈ ప్రాంతం మాత్రం ఇంకా నా స్వాధీనంలో లేదు. దీనిని కూడా నా స్వాధీనంలోకి తెచ్చుకుందామనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను’ అని అసలు విషయాన్ని చెప్పేశాడు రావణుడు.‘అది సరే, నువ్వు రుద్రవీణ గొప్పగా వాయిస్తావుటగా! నువ్వు నాతో రుద్రవీణ వాయించి జయించావనుకో, నీ కోరిక నెరవేరుతుంది’ అన్నాడు అగస్త్యుడు.‘సరే, మునీశ్వరా!’ అంటూ అగస్త్యుడితో వీణా వాదన పోటీకి సిద్ధపడ్డాడు రావణుడు.అగస్త్యుడితో రావణుడు వీణా వాదన పోటీకి సిద్ధపడిన వార్త ముల్లోకాలకూ పాకింది. వారి పోటీని తిలకించడానికి దేవ గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ తరలి వచ్చారు. ఇద్దరికీ పోటీ ప్రారంభమైంది. మొదట మంద్రగతిలో ప్రారంభించారు. మధ్యమంలోకి వెళ్లాక పోటా పోటీగా అపురూపమైన రాగాలను పలికించారు. తారస్థాయిలో రావణుడు అగస్త్యుడి ధాటిని, వేగాన్ని అందుకోవడానికి నానా తంటాలు పడసాగాడు. అగస్త్యుడి వీణా వాదనకు చుట్టుపక్కల కొండలు నీరై ప్రవహించసాగాయి. వీణ వాయించడంలో అగస్త్యుడి నైపుణ్యానికి రావణుడు నిరుత్తరుడయ్యాడు. మారు మాట్లాడకుండా ఓటమిని అంగీకరించాడు.‘మహర్షీ! నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీరు సంచరిస్తున్న ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించను’ అని చెప్పి లంకకు వెనుదిరిగాడు.∙సాంఖ్యాయన -
వింధ్యపర్వతాన్ని అణచిన అగస్త్యుడు..
బ్రహ్మదేవుడి ఆదేశంతో సూర్యుడు మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ లోకానికి వెలుగు పంచుతూ వస్తున్నాడు. సూర్యుడు ప్రదక్షిణ చేసే పర్వతం కావడంతో మిగిలిన దేవతలందరూ మేరువును గౌరవించసాగారు. మేరువు వైభవం వింధ్యపర్వతానికి అక్కసు కలిగించింది. సూర్యుడు మేరువు చుట్టూనే తిరుగుతుండటం, దేవతలు సైతం మేరువునే గౌరవిస్తుండటం, మేరువును గౌరవించే వారెవరూ తనను పట్టించుకోకపోవడం వింధ్యుడి అహాన్ని దెబ్బతీసింది.నారద మహర్షి ఒకనాడు ఆకాశమార్గాన వింధ్యను దాటుకుని కాశీనగరం వైపు వెళుతుండగా, వింధ్యుడు ఆయనను పలకరించి, ‘మహర్షీ! మా పర్వతాల్లో మేరువు గొప్పా? నేను గొప్పా?’ అని అడిగాడు. ‘ఇద్దరూ ఉన్నతులే! ఎవరి గొప్ప వారిదే!’ అని పలికి, నారద మహర్షి నారాయణ నామజపం చేస్తూ ముందుకు సాగిపోయాడు. నారదుడి సమాధానం వింధ్యుడికి రుచించలేదు.ఒకనాడు వింధ్యుడు ఉండబట్టలేక సూర్యుడిని అడ్డగించి, ‘ఓ కర్మసాక్షీ! ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నాను. నువ్వు ఆ మేరుపర్వతం చుట్టూనే ప్రదక్షిణగా తిరుగుతున్నావు. నా వంక చూసీ చూడనట్లు సాగిపోతావేం? నీకిది ఏమైనా మర్యాదగా ఉందా?’ అని నిలదీశాడు. ‘సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకే నేను మేరువు చుట్టూ పరిభ్రమిస్తున్నాను. నేను ఆయన ఆజ్ఞ మీరి లోకరీతిని తప్పితే, జీవులకు మనుగడ అసాధ్యం’ అన్నాడు సూర్యుడు.సూర్యుడి మాటలు వినే స్థితిలో లేని వింధ్యుడు ‘లోకరీతి ప్రకారం నాలాంటి ఉన్నతుల మాట కూడా నెగ్గాలి. రేపటి నుంచి నువ్వు నా చుట్టూ కూడా తిరుగు’ అని హుకుం జారీ చేశాడు.‘అయ్యా! నేనేమీ చేయలేను. మేరుపర్వతం మహోన్నతమైనదే కాదు, సృష్టికర్త ఆదేశం కూడా తనకే అనుకూలంగా ఉంది’ అంటూ సూర్యుడు చక్కా పోయాడు.అహం దెబ్బతిన్న వింధ్యుడు ఎలాగైనా మేరువుకు గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తనను తాను అంతకంతకూ పెంచుకుని, ఆకాశానికి అడ్డుగా నిలిచాడు. ఆ దెబ్బకు సూర్యచంద్రుల గతులు తప్పి లోకం అంధకారంలో మునిగిపోయింది. వింధ్యుడి విశ్వరూపం చూసి, దేవతలకు దిక్కు తోచలేదు. వారంతా వెంటనే ఇంద్రుడి వద్దకు పరుగు పరుగున వెళ్లి, జరుగుతున్న ఉత్పాతాన్ని వివరించారు.లోకానికి తలెత్తిన ఈ విపత్తును తప్పించగల సమర్థుడు అగస్త్యుడు మాత్రమేనని తలచాడు ఇంద్రుడు. వెంటనే దేవతలను వెంటపెట్టుకుని, అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్లాడు. వింధ్యుడి ఆగడాన్ని ఆయనకు చెప్పి, ‘మహర్షీ! ఎలాగైనా నువ్వే ఈ ఆపదను తప్పించాలి’ అని ప్రార్థించాడు. ‘మరేమీ భయం లేదు. వింధ్యుడి సంగతి నేను చూసుకుంటాను’ అని చెప్పి అగస్త్యుడు ఇంద్రాది దేవతలను సాగనంపాడు. ఇంద్రాదులు తిరిగి స్వర్గానికి వెళ్లిపోయాక, అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి వింధ్యపర్వతం దిశగా బయలుదేరాడు. దేవతలు, మహర్షులు పట్టించుకోవడం మానేసిన తనవైపు అగస్త్యుడు సతీ సమేతంగా వస్తుండటం చూసి, వింధ్యుడి ఆనందానికి అవధులు లేకపోయాయి.‘మహర్షీ! నా జన్మ ధన్యమైంది. నేను తమ వద్దకు రాలేనని ఎరిగి, నా జన్మ పావనం చేయడానికే మీరిలా తరలి వచ్చినట్లున్నారు. మీకు ఏవిధంగా సేవ చేయగలనో ఆదేశించండి’ అంటూ అగస్త్యుడి ముందు మోకరిల్లాడు వింధ్యుడు.‘ఓ పర్వతరాజా! నేను అత్యవసరమైన పని మీద దక్షిణ దిశగా వెళుతున్నాను. నువ్వేమో దారికి అడ్డుగా ఇంత ఎత్తుగా ఉన్నావు. అసలే పొట్టివాణ్ణి. నువ్వు కాస్త తలవంచి తగ్గావంటే, ఏదోలా నిన్ను దాటుకుని దక్షిణాపథం వైపు వెళతాను’ అని పలికాడు అగస్త్యుడు.‘ఓస్! అదెంత పని!’ అంటూ వింధ్యుడు తలవంచి, పూర్తిగా మోకరిల్లాడు.వింధ్యుడు శిరసు వంచడమే తరువాయిగా అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి పర్వతానికి అటువైపు చేరుకున్నాడు. ‘పర్వతరాజా! నాది మరో విన్నపం. పని పూర్తయ్యాక నేను ఏ క్షణాన అయినా ఇటు తిరిగి రావచ్చు. నేను మళ్లీ తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉన్నావంటే, నేను సులువుగా నా ప్రయాణాన్ని పూర్తి చేసుకోగలను’ అన్నాడు. మాట నిలబెట్టుకోవడానికి వింధ్యుడు తలవంచుకుని అలాగే ఉండిపోయాడు. అగస్త్యుడు ఇప్పటికీ అటువైపుగా మళ్లీ రాలేదు. వింధ్యుడి గర్వాన్ని అగస్త్యుడు చాకచక్యంగా అణచాడు. – సాంఖ్యాయన -
National Siddha Day: ద్రవిడుల ప్రాచీన శాస్త్రీయ వైద్యం
భారతీయ వైద్యవిధానాలలో ‘సిద్ధ’ ఒకటి. ఇది ప్రభుత్వ ఆయుష్ వైద్య శాఖలో ఒక భాగం. దాదాపు 4,000 సంవత్సరాల పురాతనమైనది. దీనికి ప్రాచుర్యం కల్పించిన వారిని ‘సిద్ధార్దులు’ లేక శైవ భక్తులైన ఋషులు అంటారు. వీరు 18 మంది. వీరిలో అగస్త్యుడు ముఖ్యమైనవాడు. ఆయన రాసిన వైద్య గ్రంథాలు ప్రామాణికం. అందుకే అగస్త్య మహర్షిని సిద్ధ వైద్య పితామహుడిగా పరిగ ణిస్తున్నారు. ఈ సిద్ధ విజ్ఞానాన్ని మెుట్టమెుదట శివుడు, పార్వతిదేవికి ఉపదేశించాడనీ, ఆమె దీనిని నందిదేవునికి అందించిందనీ, నందికేశుడు దీనిని సిద్ధులకు అందజేశాడనీ తమిళ గ్రంథాలు చెబుతాయి. ‘అగస్తియార్’ రాసిన గ్రంథాలు సిద్ధవైద్యంలో అనేక చికిత్స పద్ధతులైన వరమమ్ (ప్రెజర్ చికిత్స), తక్కానమ్ (మసాజ్ చికిత్స), నాటి (నాడీ పరీక్ష), శస్త్ర చికిత్స, రస వైద్యం, ఆవిరి చికిత్స, యోగ, ముద్ర, ప్రాణాయామం వంటి 99 రకాల పద్ధతులు ఉన్నట్లు తెలియ చేస్తున్నాయి. నేటికీ ఇవి సిద్ధ వైద్యులకు మార్గదర్శకం అవుతున్నాయి. ప్రాచీన గ్రంథం ‘తొలకప్పియం’ అనేక సిద్ధ వైద్య విషయాలను అందిస్తుంది. క్రీ.పూ 2వ శతాబ్దపు ‘తిరుక్కురై’ సిద్ధ విలువల గురించి చెబుతుంది. ‘మణిమేఖలై’ త్రిదోషాల గురించి చెబుతుంది. 13వ శతాబ్దంలో రాణి ‘కుందవై నాచియార్’ తన తండ్రి ‘కుంత్రకోజన్’ పేరు మీద ఉచిత వైద్యశాల నిర్వహించిందని తెలుస్తోంది. ఈ విధానంలోని సూత్రాలు, సిద్ధాంతాలు ఆయుర్వేదంతో సారూప్యతను కలిగి ఉంటాయి. క్రీ.పూ. 2వ శతాబ్దంలోనే వాలి (వాత), అజల్ (పిత్త), అయమ్ (కఫ) దోషాలుగా ఉంటాయనీ, వీటిని బట్టే ఔషధాలు నిర్ణయిస్తారనీ రాశారు. సిద్ధ వైద్య విధానంలో రస ఔషధాలు ప్రాముఖ్యత వహిస్తాయి. మెుక్కల వేర్లు, బెరడులు, ఆకులు, రత్నాలు, పశు ఉత్పత్తులతో ఔషధాల తయారీ ఉంటుందని ‘ఆయుష్’ ప్రచురించిన ‘హాలిస్టిక్ హెల్త్’ పుస్తకం ద్వారా తెలుస్తుంది. ఈ విధానం శ్రీలంక, సింగపూర్, మలేషియా, చైనా, తైవాన్ వంటి అనేక దేశాలలోనూ ఆదరణ కలిగివుంది. కరోనా సమయంలో కబాసురనీర్ ఔషధం తమిళనాడులో అనేక కేసులను తగ్గించడం వలన ప్రత్యేక ప్రజాదరణ పొందింది. – డాక్టర్ బాలాజీ దీక్షితులు పి.వి. (జనవరి 9 అగస్త్య మహర్షి జయంతి, జాతీయ సిద్ధ దినోత్సవం) -
తల కొరివి - పాద కొరివి
‘‘దీన్ని ‘యసిరొ ఫోబియా’ అంటారు. ఇంగ్లీషులో పేరుందిగాని, నీకది అనవసరం. మాదేం లేదు. పేపర్లకి, టీవీలకి, ఇతర భోగట్టా వ్యవస్థలకి దూరంగా ఉండు. కొన్నాళ్లు ప్రవచనాలు మాత్రం సేవించు’’ అంటూ సాగనంపాడు. చిత్రం! అప్పుడు నా మైండ్‌లో తిరునామం హైవోల్టేజీ కరెంటు బల్బులతో వెలిగింది. అక్షర తూణీరం అగస్త్య మహర్షికి ఆ రో జుల్లో పెద్ద పేరు. సము ద్రాలన్నిటినీ ఆపోశన పట్టే శాడని చెబుతారు. ఆయనకో తమ్ముడు న్నాడు. అందరూ ఆయ నని అగస్త్య భ్రాత అని పిలిచేవారు. అంటే అగ స్త్యులవారి తమ్ముడని. తనకంటూ ఒక పేరూ ప్రతిష్ట లేనందుకు ఆ తమ్ముడు చాలా బాధపడుతూ ఉండేవాడు. అగస్త్య భ్రాత- తద్దినం పెట్టేవాడి తమ్ముడు. ఇదొక సామెతలాగా ప్రచారంలోకి వచ్చింది. ఇలాగే మా ఊళ్లో ఇద్దరు బ్రదర్స్ గొడవపడ్డారు. తల్లి చనిపోతే తలకొరివి పెట్టడానికి అన్న ప్రదక్షిణలు చేస్తున్నాడు. తమ్ముడు కూడా ఎదురు ప్రదక్షిణలు మొదలు పెట్టి పాద కొరివి పెట్టడానికి సిద్ధపడ్డాడు. పెద్దలు వారించారు. ఇది ఊరికి అరిష్టం, పాద కొరివి మన సంప్రదాయంలో లేదన్నారు. పాపం, ఏ కళనున్నాడో ఆ ప్రయత్నాన్ని విరమించుకు న్నాడు. అస్థికలలో మాత్రం తన వాటా తనకి వేరే పిడతలో ఇవ్వాలని తల్లి కపాల మోక్షానికి ముందే పెద్దలతో మాట తీసుకున్నాడు. నాలుగో రోజు, ‘‘అస్తమానం వాడి చేతి కింద నేను చెయ్యి పెట్టాల్సివస్తోంది. నాకొద్దు. నా దినం నేనే చేసుకుం టా! నా తద్దినం నేనే పెట్టుకుంటా! వాడి తద్దినం వాడే!’’ అంటూ వేర్లు పడ్డారు. ఔనూ... ఇది ఎప్పు డో నా చిన్నప్పుడు మా ఊళ్లో జరిగిన ఘటన. నాకి ప్పుడెందుకు గుర్తొచ్చింది? ఏమో, గుర్తురావడం లేదు. ఈ మధ్య ఇలాగే అసంబద్ధంగా, అసం దర్భంగా ఏవేవో బుర్రలోకి వచ్చి గట్టిగా నిలబ డుతున్నాయి. అడ్రసు, సెల్ నంబర్ లాంటి వాటికి చోటు మిగలడం లేదు. పోనీ, ఓసారి డిలీట్ చేస్తారేమోనని సైకాలజీ తెలిసిన డాక్టరు మిత్రుణ్ణి సంప్రదించాను. ‘‘వస్తుంది, అలాగే వస్తుంది. అరవై దాటాక చాలా సహజం’’ అంటూ ఓదార్చాడు. ‘‘అందరి కీనా?’’ అని అడిగాను. అప్పటికే ల్యాప్‌టాప్ ఆన్ చేసి అందులో ఉన్నాడు. అందరికీనా అని అడిగితే చెప్పలేను కానీ, నీలాంటి పనికిమాలిన ప్రొఫె షన్లో ఉన్నవాళ్లకి సహజం. ఎంతమాట! ‘‘ నా భావోద్రేకాలను కించపరచవద్దు. ప్లీజ్!’’ అన్నాను. ఆ డాక్టరు కనీసం నా వైపన్నా చూడకుండా, ఉద్రే కాలు కాదు, ఉద్వేగాలు... చూడండి, అంటూ ల్యాప్ టాప్‌లో ఊడలమర్రి బొమ్మని చూపించాడు. దీన్ని చూస్తే మీకేం గుర్తొస్తుంది? అన్నాడు. ‘‘గుమ్మడి కాయ’’ అన్నాను. చూశారా! అదే మానవ మేధ యొక్క మిస్టరీ అని నవ్వాడు. చిన్నప్పుడు మర్రి నీడన విశ్రమించిన బాటసారి మర్రికాయలు ఇంత చిన్నవేమిటి? తీగెకి కాసే గుమ్మడికాయలంత పెద్దవే మిటని దేవుణ్ణి చూసి నవ్వుకున్న కథ మీకిప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఔను డాక్టర్! కరెక్ట్‌గా చెప్పారు. నాకు టీవీలో మహా పాత సినిమా చూసేప్పుడు నల్లులు గుర్తుకువస్తాయి. అనగానే, ఆయన అందు కుని, ‘‘ఎందుకంటే మీరా సినిమాని మీ చిన్నప్పుడు మీ ఊరి టెంట్ హాల్లో చూశారు. అప్పుడు మీరు నల్లులతో కలసి చూశారు’’ అంజనం వేసినట్టు నా మైండ్‌ని చూసేస్తున్నాడు. అయినా‘‘నువ్వు నా వృత్తిని గాయపరిచే విధంగా కామెంట్ చేశావ్!’’ అనడానికి నేను వెనుకాడలేదు. ల్యాప్‌టాప్‌లోంచి వ్యంగ్య ధోరణితో నా వంక చూశాడు. ‘‘ఒక టీచర్లా విద్యాబుద్ధులు గరప లేరు. డాక్టరులా రోగాలు బాపలేరు. లాయ ర్లా న్యాయాన్యాయాలకు వకాల్తా పుచ్చుకోలేరు. ఇంజ నీరులా ప్లాను వెయ్యలేరు. ఆడిటర్లా అస్సలు చెయ్యలేరు. పొలిటీషియన్‌లా అరచే తిలో హరివి ల్లుని ఆవిష్కరించలేరు. సినిమా స్టార్లా జన బాహుళ్యాన్ని వినోద పరచలేరు. మైకు ముందు కొచ్చి ఆఖరికి వందన సమర్పణ కూడా సరిగ్గా అఘోరించలేరు. పోనీ గృహస్తులా సకాలంలో ఇంటికెళ్లి సంసార జీవితం గడప గలిగారా అంటే, అదీ లేదు. కోడిలా గుడ్డు పెట్ట లేరు. గొర్రెలా బొచ్చు ఇవ్వలేరు. ఏమిటండీ గోం గూరు... ఉన్నమాటంటే నీకంత రోషం!’’ మొత్తం ఒక్క గుక్కలో అనేసి చక్కా ఊరుకున్నాడు. పైగా బహువచనం. అంటే మొత్తం నా జాతిని సం బోధించాడన్నమాట. అసలు సమస్యకు, ఈ పనికి మాలిన స్టేట్మెంట్కి ఏ మాత్రం సంబంధం లేదు. ఇదొక మానసిక వైక్లబ్యం అనుకుని సరి పెట్టుకున్నాను. ఇంతకూ నాకు తద్దినం పెట్టేవాడి తమ్ముడు ఎందుకు గుర్తొస్తున్నాడో, దానికి మందేమిటో చెప్పా వు కాదు అన్నాను. ‘‘దీన్ని ‘యసిరొ ఫోబియా’ అం టారు. ఇంగ్లీషులో పేరుందిగాని, నీకది అనవసరం. మాదేం లేదు. పేపర్లకి, టీవీలకి, ఇతర భోగట్టా వ్యవస్థలకి దూరంగా ఉండు. కొన్నాళ్లు ప్రవచనాలు మాత్రం సేవించు’’ అంటూ సాగనంపాడు. చిత్రం! అప్పుడు నా మైండ్‌లో తిరునామం హైవోల్టేజీ కరెం టు బల్బులతో వెలిగింది. (వ్యాసకర్త ప్రముఖ రచయిత)