agency visit
-
ఏపీ: మంత్రి గుడివాడకు బులెట్ ప్రూఫ్ వాహనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు బులెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది ప్రభుత్వం. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడివాడ ఎక్కువగా పర్యటించాల్సి ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. -
వ్యాధి మూలాలు గుర్తిస్తాం
గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా చింతూరు, వీఆర్‌పురం: గిరిజనుల మృతికి కారణమైన కాళ్లవాపున వ్యాధి మూలాలను కనుగొంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. శనివారం ఆయన చింతూరులో ఐటీడీఏ కార్యాలయంలో పీవోలు చక్రధరబాబు, వెంకట్రావులతోపాటు వైద్యశాఖ అధికారులతో వ్యాధులపై చర్చించారు. వ్యాధి కారణాలు కనుగొనేందుకు వైద్యబృందాలు రంగంలోకి దిగాయని, కిడ్నీకి సంబంధించిన ప్రత్యేక నిపుణులు రోగుల నుంచి రక ్తనమూనాలు సేకరించి పరిశోధనలకు పంపినట్లు తెలిపారు. వ్యాధుల తీవ్రత తగ్గి ఆరోగ్య పరిస్థితులు నెలకొనే వరకూ ఇంటింటి సర్వే కొనసాగించాలని, కాళ్లవాపు వ్యాధి సోకిన వారందరికీ వెంటనే వైద్యం అందించాలని ఆదేశించారు. నూతనంగా నెలకొల్పిన చింతూరు ఏరియా ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక పరికరాల నిమిత్తం రూ.30 లక్షలు మంజూరు చేశామని, ఇకపై చింతూరు కేంద్రంగా మరిన్ని వైద్యసేవలు అందనున్నాయన్నారు. త్వరలోనే చింతూరు ఐటీడీఏకు పీవోతోపాటు ఇతర సిబ్బందిని నియమిస్తామనిlపేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష వీఆర్‌పురం: వ్యాధిని గుర్తించడానికి స్థానికుల అభిప్రాయాలను కూడా పరిగణనలోలకి తీసుకుంటున్నామని సిసోడియా అన్నారు. మండలంలోని కాళ్లవాపు ప్రభావిత గ్రామాల్లో ఆయన శవివారం పర్యటించారు. తొలిత చినమట్టపల్లి గ్రామంలో మృతిచెందిన కారం రామారావు భార్య కమలను పరామర్శించారు. అక్కడున్న పంచాయతీ సర్పంచ్ కారం శివరాజుతో మాట్లాడారు. అనంతరం అన్నవరం గ్రామానికి చేరుకున్నారు. గ్రామాల్లో పారిశుధ్ధ్య కార్యక్రమాలు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. కాళ్ల వాపు బారిన పడి మృతిచెందిన వారికి ప్రభుత్వం రూ.1లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. అక్కడి నుంచి మండల కేంద్రం రేఖపల్లిలోని పీహెచ్‌సీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ కేవీఎన్ చక్రధర్‌బాబు, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎన్.పవన్‌కుమార్, తహశీల్దార్ జీఈఎస్ ప్రసాద్ ,ఎంపీడీఓ జి.సరోవర్ , జెడ్పీటీసీ ముత్యాల కుసుమాంబ ,ఎంపీపీ కారం శిరమయ్య , మెడికల్ ఆఫీసర్లు ఏ.రామారావు. ఎం.దుర్గాప్రాసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ఏజెన్సీ పర్యటన డిసెంబర్ 10కి వాయిదా
విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఏజెన్సీ పర్యటన డిసెంబర్ 10 వ తేదీకి వాయిదాపడింది. ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 2న పర్యటించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ ఏజెన్సీలో టీడీపీ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ జీవో జారీ జేసిన విషయం తెల్సిందే. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఓ భారీ ఉద్యమం లేవనెత్తనుంది. అందులో భాగంగా డిసెంబర్ 10న జగన్ చింతపల్లిలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. అనంతరం లంబసింగిలో గిరిజనులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
ఏజెన్సీలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పర్యటన
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కె.వెంకటరమణ మంగళవారం తన నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనుల సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు. వారి సమస్యలను సాధ్యమైనంత త్వరగా తీర్చుతానని ఆయన గిరిజనులకు హామీ ఇచ్చారు. గతంలో తమ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరు తమ సమస్యలు పట్టించుకోలేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి...తమ సమస్యలు... తెలుసుకుని..వాటిని నెరవేరుస్తానని హామీ ఇచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్యే వెంకటరమణ అని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.