వ్యాధి మూలాలు గుర్తిస్తాం | traible department secretery agency visit | Sakshi
Sakshi News home page

వ్యాధి మూలాలు గుర్తిస్తాం

Published Sat, Sep 24 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

వ్యాధి మూలాలు గుర్తిస్తాం

వ్యాధి మూలాలు గుర్తిస్తాం

  • గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా
  • చింతూరు, వీఆర్‌పురం: 
    గిరిజనుల మృతికి కారణమైన కాళ్లవాపున వ్యాధి మూలాలను కనుగొంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. శనివారం ఆయన చింతూరులో ఐటీడీఏ కార్యాలయంలో పీవోలు చక్రధరబాబు, వెంకట్రావులతోపాటు వైద్యశాఖ అధికారులతో వ్యాధులపై చర్చించారు. వ్యాధి కారణాలు కనుగొనేందుకు వైద్యబృందాలు రంగంలోకి దిగాయని, కిడ్నీకి సంబంధించిన ప్రత్యేక నిపుణులు రోగుల నుంచి రక ్తనమూనాలు సేకరించి పరిశోధనలకు పంపినట్లు తెలిపారు. వ్యాధుల తీవ్రత తగ్గి ఆరోగ్య పరిస్థితులు నెలకొనే వరకూ ఇంటింటి సర్వే కొనసాగించాలని, కాళ్లవాపు వ్యాధి సోకిన వారందరికీ వెంటనే వైద్యం అందించాలని ఆదేశించారు. నూతనంగా నెలకొల్పిన చింతూరు ఏరియా ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక పరికరాల నిమిత్తం రూ.30 లక్షలు మంజూరు చేశామని, ఇకపై చింతూరు కేంద్రంగా మరిన్ని వైద్యసేవలు అందనున్నాయన్నారు. త్వరలోనే చింతూరు ఐటీడీఏకు పీవోతోపాటు ఇతర సిబ్బందిని నియమిస్తామనిlపేర్కొన్నారు. 
     
    మృతుల కుటుంబాలకు రూ.లక్ష
    వీఆర్‌పురం: వ్యాధిని గుర్తించడానికి స్థానికుల అభిప్రాయాలను కూడా పరిగణనలోలకి తీసుకుంటున్నామని సిసోడియా అన్నారు. మండలంలోని కాళ్లవాపు ప్రభావిత గ్రామాల్లో ఆయన శవివారం పర్యటించారు. తొలిత చినమట్టపల్లి గ్రామంలో మృతిచెందిన కారం రామారావు భార్య కమలను పరామర్శించారు. అక్కడున్న పంచాయతీ సర్పంచ్‌ కారం శివరాజుతో మాట్లాడారు. అనంతరం అన్నవరం గ్రామానికి చేరుకున్నారు. గ్రామాల్లో పారిశుధ్ధ్య కార్యక్రమాలు మెరుగుపరచాలని అధికారులను  ఆదేశించారు. కాళ్ల వాపు బారిన పడి మృతిచెందిన వారికి ప్రభుత్వం రూ.1లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. అక్కడి నుంచి మండల కేంద్రం రేఖపల్లిలోని పీహెచ్‌సీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ  ఎన్‌.పవన్‌కుమార్, తహశీల్దార్‌ జీఈఎస్‌ ప్రసాద్‌ ,ఎంపీడీఓ జి.సరోవర్‌ , జెడ్పీటీసీ ముత్యాల కుసుమాంబ ,ఎంపీపీ కారం శిరమయ్య ,  మెడికల్‌ ఆఫీసర్లు ఏ.రామారావు. ఎం.దుర్గాప్రాసాద్‌ తదితరులు పాల్గొన్నారు.                        
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement