విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఏజెన్సీ పర్యటన డిసెంబర్ 10 వ తేదీకి వాయిదాపడింది. ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 2న పర్యటించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
విశాఖ ఏజెన్సీలో టీడీపీ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ జీవో జారీ జేసిన విషయం తెల్సిందే. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఓ భారీ ఉద్యమం లేవనెత్తనుంది. అందులో భాగంగా డిసెంబర్ 10న జగన్ చింతపల్లిలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. అనంతరం లంబసింగిలో గిరిజనులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు.
వైఎస్ జగన్ ఏజెన్సీ పర్యటన డిసెంబర్ 10కి వాయిదా
Published Tue, Nov 24 2015 6:57 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement