విద్య వ్యాపారం కాకూడదు
స్వర్గీయ శ్రీహరి బావమరిది జయరాం కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘అగ్గిరవ్వ’. ఎ.ఎల్.రాజా దర్శకుడు. నిర్మాత ఎస్.భూపతి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘తారతమ్యాలు లేకుండా విద్య అందరికీ లభిస్తే... దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలిపే కథాంశమిది. విద్య వ్యాపారం కాకూడదని ఇందులో చెప్పాం. ఈ కథను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విని అభినందించారు. ఈ నెల 23న పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. యాక్షన్తో కూడిన కుటుంబ కథాచిత్రమిదని, స్విట్జర్లాండ్, ముంబయ్లలో పాటల్ని చిత్రీకరించామని, జూలైలో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. భానుప్రియ, బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవా, కెమెరా: శివరాం.