agitatian
-
గర్జించిన ఉద్యోగలోకం
పాడేరు రూరల్: మన్యంలో ఉద్యోగ లోకం గర్జించింది. సీపీఎస్ విధానం రద్దు కోరుతూ ఏజెన్సీ 11 మండలాల ఉద్యోగులు కదం తొక్కారు. ఇందుకు పాడేరు వేదికైంది. ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం పాడేరులో మన్యం ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని తలారిసింగ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమాహాల్ సెంటర్, పాతబస్టాండ్ మీదుగా మోదకొండమ్మ ఆలయం వరకూ సాగింది. ఈ సందర్భంగా సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇంతకు ముందు తలారిసింగ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. మోదకొండమ్మ ఆలయం ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజీ పట్టాన్ మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి అమలవుతున్న లోపభూయిష్టమైన సీపీఎస్ విధానంతో ఉద్యోగులకు సామాజిక, ఆర్థిక భద్రత కరువైందన్నారు. రాష్ట్రంలో లక్షా 86 వేల మంది ఉద్యోగులు సీపీఎస్ పథకం వల్ల రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ కోల్పోతున్నారన్నారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామని ప్రకటించిన టీడీపీ.. ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక మోసగించిందన్నారు. సీపీఎస్ రద్దు కోసం అసెంబ్లీ, పార్లమెంట్లలో తీర్మానం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతు ఉంటుందన్నారు. తలారిసింగ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న ఉద్యోగులు ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన టీడీపీ రాష్ట్ర కోశాధికారి రొంగలి అప్పలరాజు మాట్లాడుతూ టీడీపీ తమది సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటూ సీపీఎస్ ఉద్యోగుల సంక్షేమాన్ని మాత్రం పూర్తిగా గాలికొదిలేసిందన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే, ఎంపీ అయిన వారికి జీవితాంతం పెన్షన్ ఇస్తున్నారని, కానీ తాము 30 ఏళ్లపాటు ప్రజలకు సేవ చేస్తే మాత్రం పెన్షన్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర కోశాధికారి కోడా సింహాద్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 280 మంది ఉద్యోగులు మరణిస్తే వారికి సీపీఎస్ కారణంగా పెన్షన్ రాలేదన్నారు. దీంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఇప్పటికే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే తప్పనిసరిగా సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగిస్తారన్నారు. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుడుముల కాంతారావు మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వాలు తమ పెన్షన్, పీఎఫ్ నిధులను షేర్మార్కెట్లో పెడుతున్నాయన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయకపోతే పెన్‌డౌన్ చేసి ఆమరణ నిరాహారదీక్షలకైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకొండ సతీష్, పీఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోపీనా«థ్, గిరిజన ఉద్యోగుల సంఘం అర్బన్ అధ్యక్షుడు ఓలేసు రామలింగం, పీజీహెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు రీమలి జాన్, ఏపీఎన్జీఓ పాడేరు తాలూకా అధ్యక్షుడు బుక్కా చిట్టిబాబు, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.గంగన్న పడాల్, ఏపీటీఎఫ్ ఉపాధ్యక్షుడు కె.శ్యాంసుందర్, ఏపీసీపీఎస్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మళ్ళ ఉమ, ఏపీసీపీఎస్ పాడేరు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రాంబాబు, ఈశ్వర్, కన్వీనర్ తెల్లబాబు, కోశాధికారి వెంకటరమణ, కో కన్వీనర్ పరమేశ్వర్‌తోపాటు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
డెల్టా ఎడారే..!
తాడేపల్లి/మంగళగిరి, న్యూస్‌లైన్ :కృష్ణా జలాల వివాదంపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆ పార్టీ శ్రేణులు, రైతులు ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. గంటకు పైగా జరిగిన ఈ ధర్నా సందర్భంగా బ్యారేజికి ఇరువైపులా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కృష్ణా డెల్టాను పరిరక్షించుకోవాలని డిమాండ్ చేస్తూ నాయకులు, రైతులు రోడ్డుపై బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బ్రిజేశ్‌కుమార్ తీర్పుతో డెల్టా ఏడారి కాబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరి వల్లే నేడు డెల్టా ఏడారి కాబోతుందన్నారు. చంద్రబాబు తన హయాంలో ఎక్కడా నూతన ప్రాజెక్ట్‌లు చేపట్టాలేదని, దీంతో నేడు కృష్ణా మిగులు జలాలు వాడుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతు తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు కృష్ణా మిగులు జలాలు వినియోగించుకోవడంపై దృష్టి పెట్టలేదన్నారు. ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి తీవ్ర న ష్టం కలిగించేదిగా ఉందని అవేదన వ్యక్తం చేశారు. తమ వాదనలను బలంగా వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచితే అన్నదాతకు అన్యా యం జరుగుతుందని తెలిసినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిద్రపోయారని దీని వల్ల ఇప్పుడు కృష్ణా డెల్టా ఏడారిగా మారే పరిస్థితి దాపురించిందన్నారు. కృష్ణా డెల్టా రైతాంగం బాగుపడాలంటే సుప్రీం కోర్టులో న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం రాష్ర్ట కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, కృష్ణా జిల్లా నేత పూనూరు గౌతమ్‌రెడ్డి, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్ నాయుడు, పార్టీ సమన్వయకర్తలు రావి వెంకట రమణ, కోన రఘపతి, బొల్లా బ్రహ్మనాయుడు, షౌకత్, నసీర్ అహ్మద్, ఈపూరి అనూప్, నూతలపాటి హనుమయ్య, ఎస్సీ సెల్ కన్వీనర్ బండారు సాయిబాబు, తాడేపల్లి పట్టణ, రూరల్ ఎస్సీ సెల్ కన్వీనర్లు ముదిగొండ ప్రకాష్, సంకూరి మరియబాబు, తాడేపల్లి రూరల్ ,పట్టణ కన్వీనర్లు పాటిబండ్ల కృష్ణమూర్తి, భీమవరపు సాంబిరెడ్డి, మంగళగిరి పట్టణ, రూరల్ కన్వీనర్లు ఎండీ ఇక్బాల్ అహ్మద్, తోట శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ మహిళా కన్వీనర్ గుంటక ఝాన్సీ, మంగళగిరి రూరల్ మహిళా కన్వీనర్ అల్లం నారాయణమ్మ, పెదకాకాని మండల కన్వీనర్ గోళ్ల శ్యామ్ ముఖర్జీ, తాడేపల్లి మాజీ ఎంపీపీ ప్రాతూరి లలితకుమారి, యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా ప్రతాపరెడ్డి,మహంకాళి వెంకటరావు, బొమ్మారెడ్డి సునీత, యేళ్ల జయలక్ష్మి, చీడిపూడి జయలక్ష్మి, ఈదూలమూడి డేవిడ్ రాజ్, జెక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కసుకుర్తి గోవిందరావు, మునగాల మల్లేశ్వరరావు, కాండ్రు శివమల్లేశ్వరరావు, తమ్మా రామిరెడ్డి, వంగా దేవా, ముస్తాఫా, తాతినేని పద్మ పాల్గొన్నారు.