డెల్టా ఎడారే..!
Published Sun, Dec 1 2013 1:35 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
తాడేపల్లి/మంగళగిరి, న్యూస్‌లైన్ :కృష్ణా జలాల వివాదంపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆ పార్టీ శ్రేణులు, రైతులు ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. గంటకు పైగా జరిగిన ఈ ధర్నా సందర్భంగా బ్యారేజికి ఇరువైపులా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కృష్ణా డెల్టాను పరిరక్షించుకోవాలని డిమాండ్ చేస్తూ నాయకులు, రైతులు రోడ్డుపై బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బ్రిజేశ్‌కుమార్ తీర్పుతో డెల్టా ఏడారి కాబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరి వల్లే నేడు డెల్టా ఏడారి కాబోతుందన్నారు. చంద్రబాబు తన హయాంలో ఎక్కడా నూతన ప్రాజెక్ట్‌లు చేపట్టాలేదని,
దీంతో నేడు కృష్ణా మిగులు జలాలు వాడుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతు తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు కృష్ణా మిగులు జలాలు వినియోగించుకోవడంపై దృష్టి పెట్టలేదన్నారు. ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి తీవ్ర న ష్టం కలిగించేదిగా ఉందని అవేదన వ్యక్తం చేశారు. తమ వాదనలను బలంగా వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచితే అన్నదాతకు అన్యా యం జరుగుతుందని తెలిసినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిద్రపోయారని దీని వల్ల ఇప్పుడు కృష్ణా డెల్టా ఏడారిగా మారే పరిస్థితి దాపురించిందన్నారు. కృష్ణా డెల్టా రైతాంగం బాగుపడాలంటే సుప్రీం కోర్టులో న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం రాష్ర్ట కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, కృష్ణా జిల్లా నేత పూనూరు గౌతమ్‌రెడ్డి, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్ నాయుడు, పార్టీ సమన్వయకర్తలు రావి వెంకట రమణ, కోన రఘపతి, బొల్లా బ్రహ్మనాయుడు, షౌకత్, నసీర్ అహ్మద్, ఈపూరి అనూప్, నూతలపాటి హనుమయ్య, ఎస్సీ సెల్ కన్వీనర్ బండారు సాయిబాబు, తాడేపల్లి పట్టణ, రూరల్ ఎస్సీ సెల్ కన్వీనర్లు ముదిగొండ ప్రకాష్, సంకూరి మరియబాబు, తాడేపల్లి రూరల్ ,పట్టణ కన్వీనర్లు పాటిబండ్ల కృష్ణమూర్తి, భీమవరపు సాంబిరెడ్డి, మంగళగిరి పట్టణ, రూరల్ కన్వీనర్లు ఎండీ ఇక్బాల్ అహ్మద్, తోట శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ మహిళా కన్వీనర్ గుంటక ఝాన్సీ,
మంగళగిరి రూరల్ మహిళా కన్వీనర్ అల్లం నారాయణమ్మ, పెదకాకాని మండల కన్వీనర్ గోళ్ల శ్యామ్ ముఖర్జీ, తాడేపల్లి మాజీ ఎంపీపీ ప్రాతూరి లలితకుమారి, యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా ప్రతాపరెడ్డి,మహంకాళి వెంకటరావు, బొమ్మారెడ్డి సునీత, యేళ్ల జయలక్ష్మి, చీడిపూడి జయలక్ష్మి, ఈదూలమూడి డేవిడ్ రాజ్, జెక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కసుకుర్తి గోవిందరావు, మునగాల మల్లేశ్వరరావు, కాండ్రు శివమల్లేశ్వరరావు, తమ్మా రామిరెడ్డి, వంగా దేవా, ముస్తాఫా, తాతినేని పద్మ పాల్గొన్నారు.
Advertisement