పాల్వంచలో అఘోరాల సంచారం.. సోషల్ మీడియాలో వైరల్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అఘోరాల సంచారం చర్చానీయంశంగా మారుతుంది. చత్తీస్‌గఢ్ అటవి ప్రాంతం నుంచి కాలీనడకన కొందరు అఘోరాలు పాల్వంచకు వచ్చారు. అయితే కాశీ నుంచి చత్తీస్‌గఢ్‌కు వచ్చి అక్కడి నుంచి తెలంగాణకు వచ్చినట్లు తెలుస్తోంది. పాల్వంచలోని ఆత్మలింగేశ్వరాలయం చేరుకోని స్వామి దర్శనం చేసుకున్న అనంతరం ప్రత్యేక పూజలు కూడా చేశారు. వారు చేసే పద్దతుల్లో పూజలు నిర్వహించడం విశేషం. అఘోరాలు వచ్చారన్న విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చాలామంది వచ్చారు. ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను అఘోరాలకు కోందరు స్థానికులు వివరించినట్లు తెలుస్తోంది.
పాల్వంచలోని ఆత్మలింగేశ్వరాలయం అత్యంత పురాతన ఆలయం. స్థానికంగా ఈ ఆలయానికి ఏంతో ప్రాముఖ్యత కూడా ఉంది. ఇలాంటి ఆత్మలింగేశ్వరరాలయాలు దేశంలోనే చాలా అరుదుగా ఉన్నాయి. స్థానికులతో కొద్దిసేపు వివరాలు తెలుసుకున్న అనంతరం తిరిగి వారు వచ్చిన మార్గంలోనే వెళ్లిపోయారు. అయితే వారు వచ్చి వెళ్లిన విషయం సోషల్ మీడియాలో కోందరు పోస్ట్ చేయడం ద్వారా బయటపడింది. వారు వచ్చి వెళ్లిన విషయం ఏవరికి తెలియదు. ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్న వారికి మాత్రమే తెలుసు.
దీంతో తర్వాత అసలు అఘోరాలు ఆత్మలింగేశ్వరాలయానికి ఏందుకు వచ్చారని పాల్వంచలోనే కాకుండా జిల్లాలో సైతం జోరుగా చర్చ నడుస్తుంది. అంత దూరం నుంచి ఈ ఆలయంకే ఏందుకు వచ్చారని చర్చించుకుంటున్నారు. అయితే దేశంలో ఏ ప్రాంతంలో ఈశ్వరునికి సంబంధించి ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఉన్నాయో అఘోరాలకు సమాచారం ఉంటుందని అందులో భాగంగానే వాళ్లు వస్తువుంటారని కోందరు పూజారులు చెప్పారు.