మన బాక్సర్లను వారే అడ్డుకుంటున్నారా..!
అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటుతున్నా.. స్వదేశంలో అధికారుల వల్లే మన బాక్సర్లు వెనక బడుతున్నారా..? ఆసియా స్థాయిలో పతకాల పంట పండిస్తున్నా.. ప్రపంచ స్థాయి క్రీడల్లో పతకాలు రాక పోవడానికి ఆసోషియేషన్లే కారణమా..? ఈ మాట అంటున్నది కడుపు మండిన బాక్సర్ కాదు.. అంతర్జాతీ బాక్సింగ్ అసోషియేషన్ అధ్యక్షుడు. ఇక్కడ జరుగుతున్న ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నడాక్టర్ చింగ్ కు వూ ఇలా స్పందించారు.
భారత్ కి చెందిన ముగ్గురు బాక్సర్లు సెమీస్ లో ప్రవేశించడం గురించి ప్రస్తావించిన ఆయన భారత బాక్సింగ్ కు మంచి భవిష్యత్ ఉందని అన్నారు. ఆసియా స్ధాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఇండియ్ బాక్సర్లు మరింత కృషి చేస్తే... సెమీ ప్రొఫెషనల్ వాల్డ్ సీరీస్ ఆఫ్ బాక్సింగ్ లో సత్తా చాటగలరని అభిప్రాయపడ్డారు. ఆసియా ఖండంలో మంచి బాక్సింగ్ వాతావరణం ఉందని తెలిపారు. ఆసియా ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నా అయన మీడియాతో మాట్లాడారు. కజకిస్తాన్, ఉబ్జెకిస్తాన్, చైనా, థాయ్ లాండ్, మంగోలియా, బారత్ లు ప్రపంచ స్థాయి బాక్సర్లను తయారు చేస్తున్నారని కితాబిచ్చాడు.
అయితే భారత్ లో అడ్మినిష్ట్రేషన్ ఇబ్బందులు ఉన్నాయని వాటిని తొలగించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. అంతే కాదు.. ఇప్పటి వరకూ దేశంలో చురుకైన ఫెడరేషన్ లేదని తెలిపారు. భారత్ కి అతిపెద్ద మార్కెట్ ఉందని.. ప్రపంచ బాక్సింగ్ సిరీస్ (WSB)లో సత్తా చాటగలదని అన్నారు. ఆసియా, థాయ్ లాండ్ లలో ఫెడరేషన్ లకు తాము ఎంతో సాహాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక ప్రాజక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది క్రీడాకారులు బాక్సింగ్ ని ఎంచుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే ఈవెంట్ లో ముగ్గురు భారతీయ బాక్సర్లు సెమీఫైనల్ కు క్వాలిఫై కావడం తెలిసిందే. ఈ ఈవెంట్ దోహాలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ కు క్వాలిఫైయ్యింగ్ ఈవెంట్ కాగా.. ప్రపంచ ఛాంపియన్ షిప్ రియో ఒలింపిక్స్ కు తొలి క్వాలిఫైయ్యింగ్ ఈవెంట్.