ailing
-
అయ్యో! పెద్దాయనకు ఎంత కష్టం వచ్చింది!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.దీంతో రహదారులు కూడా తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలో ఒక హృదయ విదారకమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గం లేక ఓ పెద్దాయన అల్లాడి పోయాడు. చివరకు తన భుజాలమోసుకొని తీసుకుపోదామని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో 65 ఏళ్ల వృద్ధుడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే నందూర్బార్ అటవీప్రాంతంలో ఉన్న చంద సాయిలి గ్రామంలో నివసిస్తున్న సిధాలిబాయి పద్వి (60) అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ క్రమంలో బుధవారం తీవ్ర కడుపు నొప్పి ఆమెను వేధించింది. దీంతో ఆమె భర్త ఆడ్ల్య పాడ్వి స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. కానీ వర్షాల కారణంగా అది మూసి ఉంది. ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు కొండ చరియలు విరిగిపడటంతో రహదారులు మూతపడ్డాయి. ఇక వేరే మార్గం లేక కొండ మార్గంలో రాజధాని ముంబై నుండి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడానికి పాదరక్షలు లేకుండా తన భుజాలపై ఎత్తుకుని ఆమెను తీసుకెళుతున్నాడు. కానీ మధ్యలోనే ఆమె తుదిశ్వాస విడిచింది. నిస్సహాయుడైన భర్త గుండె పగిలి రోదిస్తున్న తీరు స్థానికులను కదిలింది. సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేకపోవడంతో వృద్ధుడి భుజాలపైనే ఆమె కన్నుమూసిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటన తర్వాత, జిల్లా పరిపాలన అధికారులు, స్థానిక పోలీసులు, విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలానికి చేరుకుని కొండచరియల శిథిలాలను రోడ్డుపై నుండి తొలగించే చర్యలు చేపట్టారు. కాగా మహారాష్ట్రలో గత 24 గంటల్లో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. -
వైరలవుతోన్న రతన్ టాటా ఫోటో
ముంబై: టాటా గ్రూపు అంటేనే విలువలకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు విస్తరించినప్పటికి వీసమెత్తు గర్వం కనపడదు. ఇక ఉద్యోగుల పట్ల టాటా సంస్థలు చూపే శ్రద్ధ గురించి అందులో పని చేసే వారిని అడిగితే తెలుస్తుంది. టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశం పట్ల, సమాజం పట్ల టాటా కుటుంబానికి ఎంతో ప్రేమ, బాధ్యత. ఇక ఏదైనా విపత్తు వచ్చిందంటే చాలు సాయం చేయడంలో టాటా సంస్థలు ముందు వరుసలో ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే గత నాలుగైదు రోజులుగా రతన్ టాటాకు సంబధించిన ఓ వార్త సోషల్ మీడియా తెగ వైరలవుతోంది. తమ కంపెనీలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగిని కలవడం కోసం రతన్ టాటా స్వయంగా ముంబై నుంచి పుణె వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. యోగేష్ దేశాయ్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో రతన్ టాటా సదరు ఉద్యోగి పిల్లలతో మాట్లాడుతున్న ఫోటోని షేర్ చేశారు. (చదవండి: పరిగెత్తండిరా!.. శబ్ధం చేయకండయ్యా!!) Ratan Tata,83, living legend, greatest businessman alive in India visited the friends society in Pune to meet his Ex Emoloyee all the way from Mumbai who is ailing for last 2 years. This is how legends are made of. No media, no bouncers only commitment towards loyal employees. pic.twitter.com/5xktAH2CUX — No Robert Elekes - AnKuVa (@SuspendedAkount) January 4, 2021 ఇక ‘రతన్ టాటా లివింగ్ లెజెండ్.. భారతదేశంలో ఉన్న అతి గొప్ప వ్యాపారవేత్తల్లో ఆయన ఒకరు. తమ సంస్థలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతన్నారని రతన్ టాటాకు తెలిసింది. దాంతో అతడిని పరామర్శించడానికి ముంబై నుంచి పుణె వెళ్లారు. ఆయన వెంట బౌన్సర్లు లేరు.. మీడియా హడావుడి లేదు. నమ్మకంగా పని చేసిన ఉద్యోగి పట్ల ఆయన చూపిన ఈ సానుభూతి ఎంతో గొప్పది. డబ్బు మాత్రమే జీవితం కాదని అందరు వ్యాపారవేత్తలు తెలుసుకోవాలి. గొప్ప మనిషిగా బతకడం అనేది ముఖ్యం. సర్ మీరు చేసిన ఈ పనికి గౌరవంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. లివింగ్ లెజెండ్ రతన్ టాటా.. అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు. -
ఎన్టీఆర్ చొరవ, ఫ్యాన్స్ ఫిదా!
సాక్షి, హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని కోసం పెద్ద మనసు చేసుకున్నారు. గతం కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తన ఫ్యాన్‌ను పలకరించి అతనికి భారీ ఓదార్పునిచ్చారు. దీంతో యంగ్ టైగర్ చూపించిన మానవత్వం, అభిమానంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మస్క్యులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న తన అభిమాని వెంకన్న అనారోగ్యం గురించి తెలుసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైపోయిన తన వీరాభిమాని దీనావస్థ గురించి విని చలించిపోయారు. వీడియో కాల్ ద్వారా ఎన్టీఆర్ వెంకన్నను పలకరించారు. దీంతో ఆశ్చర్యపోవడం అతని వంతైంది. ఎన్టీఆర్‌తో సెల్ఫీ తీసుకోవాలని ఉందనే కోరికను వ్యక్తం చేశాడు. అతని మాటలను ఓపికగా విన్న ఎన్టీఆర్ పరిస్థితులన్నీ చక్కబడిన వెంటనే అతడిని కలవడానికి వస్తానని అప్పుడు తనతో సెల్ఫీ తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. తరువాత వెంకన్న తల్లితో కూడా మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్ ఆందోళన చెందవద్దంటూ ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
అభిమాని వైద్యానికి బిగ్ బీ సహాయం
కోల్ కతా: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేరును తన శరీరమంతా పచ్చబొట్టు పొడిపించుకుని అభిమానాన్ని చాటుకున్న ఓ అభిమానికి బీగ్ బీ అండగా నిలువనున్నారు. 'ఒంటిపై అమితాబ్ అంటూ పేరును రాసుకున్న వ్యక్తి ఏదో సమస్య ఉందనిపించింది. అతని వైద్యానికి కొంత సహాయం అవసరముందని గ్రహించాను. అభిమానులు పోటెత్తడంతో భారీ సెక్యూరిటిని ఏర్పాటు చేశారు. ఆ జనం మధ్య నుంచి నా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. అతని ఆరోగ్యానికి సంబంధించిన వైద్య నివేదికలు నాకు అందాయి. అతనికి సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నాను' అని బిగ్ బీ తన బ్లాగ్ లో వెల్లడించారు. కోల్ కోతాలో జరుగుతున్న ఓ చిత్ర షూటింగ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.