Air conditioned
-
ట్రక్కు క్యాబిన్లలో ఏసీ తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్
సరకు రవాణా చేసే ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్లను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2025 అక్టోబర్ 1, ఆ తర్వాత తయారయ్యే ఎన్2, ఎన్3 కేటగిరి ట్రక్కులలో డ్రైవర్ల కోసం ఏసీ క్యాబిన్లు తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 3.5 టన్నుల నుంచి 12 టన్నులు బరువుండే ట్రక్కులు ఎన్2 కేటగిరీ కిందకు, 12 టన్నులు దాటిన ట్రక్కులు ఎన్3 కేటగిరీ కిందకు వస్తాయి. డ్రైవర్లకు మెరుగైన పని వాతావరణం కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రక్కు క్యాబిన్లలో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను తప్పనిసరి చేసేందుకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ఆమోదం లభించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గత జులైలోనే తెలిపారు. దేశానికి అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటైన రవాణా రంగంలో ట్రక్ డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి పని పరిస్థితులు, మానసిక స్థితికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
ఏసీ వార్డు కోసం రచ్చ.. కయ్యానికి దిగిన వియ్యంకులు
లక్నో: యూపీలోని బారాబంకిలో నెలలు నిండిన తమ బిడ్డ డెలివరీకి ఏసీ వార్డులో చేర్పించలేదని కోపంతో ఓ గర్భవతి తల్లిదండ్రులు ఆమె అత్తమామలను చితక బాదారు. ఈ వీడియోని అక్కడున్నవారిలో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. తమ బిడ్డకు నెలలు నిండడంతో డెలివరీ నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించినట్టు తెలుసుకుని బిడ్డను చూసేందుకు ఆత్రుతతో హాస్పిటల్ కు వెళ్లారు గర్భవతి తల్లిదండ్రులు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఏసీ వార్డులో కాకుండా నాన్ ఏసీ వార్డులో ఉన్న తమ బిడ్డను చూసి వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొదట మాటల యుద్ధానికి తెరతీసిన వారు మెల్లగా ముష్టియుద్ధానికి తెగబడ్డారు. వియ్యంకుడు రామ్ కుమార్ తోపాటు అతని భార్యని ఇద్దరు పిల్లలను పట్టుకుని చితకొట్టేశారు. వారు కూడా తిరగబడటంతో గొడవ మరీ పెద్దదైంది. రోడ్డు మీద నలుగురు చూస్తుండగానే ఈ వీరంగమంతా జరగడంతో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వీడియో ఎక్కడెక్కడో చక్కెర్లు కొడుతోంది. #Barabanki में बहू के लिए अस्पताल में AC रूम न बुक करने पर मायके वालों ने की ससुराल पक्ष के लोगों की पिटाई, विडियो वायरल। pic.twitter.com/bfuKZ5j4uA — Priya singh (@priyarajputlive) July 5, 2023 ఇది కూడా చదవండి: కన్నతల్లిని భుజాన మోస్తూ.. శివభక్తుడి సాహసం.. -
ఎ.సి.తో వచ్చే కష్టాలు!
లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్ నా వయసు 37. చాలాసేపు ఎయిర్ కండిషన్ గదిలోనే గడుపుతుంటాను. ఇటీవల నేను తీవ్రమైన అలసటతో బాధపడుతున్నాను. నా సమస్య ఏసీ వల్లనేనా? నాకు సరైన పరిష్కారం చెప్పండి. – వినయ్‌కుమార్, హైదరాబాద్ ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో చాలా ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి చాలా సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి కొన్ని రకాల అనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల దాదాపు ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి... తీవ్రమైన అలసట: చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పనిముగిసే సమయానికి భరించలేని తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు. పొడి చర్మం: చాలాసేపు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది, పొడిబారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం: కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే ఆర్థరైటిస్, న్యూరైటిస్ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో ఆ సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ. అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం: గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు ఇక ఏమాత్రం వేడిమిని భరించలేరు. వేసవిలో బయటకు రావడమే కష్టంగా అనిపిస్తుంది. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు. శ్వాస సమస్యలు: చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతుండటం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. – డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ ఎక్స్పర్ట్, కిమ్స్, సికింద్రాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మళ్లీ... చెవినొప్పి ! మా పాప వయస్సు ఆరేళ్లు. రెండు నెలల కిందట మా పాపకు జలుబు వస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాం. చికిత్స తర్వాత సమస్య తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? తెలియచేయగలరు.– సుమతి, ఖమ్మం మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్ తరహాలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రిషన్ లేదా ఈఎన్టీ సర్జన్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. – డా. రమేశ్ బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ ... అలా తింటే అనర్థమా! నా వయసు 45 ఏళ్లు. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటాను. మాంసాహారం, ఫాస్ట్ఫుడ్తో గుండెజబ్బులు ఎక్కువగా వస్తాయని ఫ్రెండ్స్ అంటున్నారు. దాంతో ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – భూమేష్, వరంగల్ గుండెజబ్బులకు కొలెస్ట్రాల్ అనేది ఒక ముఖ్యమైన రిస్క్‌ఫ్యాక్టర్. మాంసాహారం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఫాస్ట్ఫుడ్స్లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు. గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్‌ను ఎల్డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రొటీన్) అనీ, మేలు చేసేదాన్ని హెచ్‌డీఎల్ (హై డెన్సీటీ లైపోప్రొటీన్) అని అంటారు. మన రక్తంలో ఎల్డీఎల్ 100 కంటే తక్కువగానూ, హెచ్‌డీఎల్ 40 కంటే ఎక్కువగానూ ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరానికి రెండు రకాలుగా అందుతుంది. మొదటిది ఆహారం ద్వారా, రెండోది కాలేయం పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు శరీరంలో 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు, నరాల వ్యవస్థ ఇలా శిశువు పూర్తిగా ఎదగడానికి రెండేళ్ల వయసు వచ్చే వరకు కొలెస్త్రాల్ ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది. రెండేళ్ల తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే వ్యక్తుల్లోని జన్యుతత్వాన్ని బట్టి కూడా మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి ఎక్కువ/తక్కువగా అవుతుంటుంది. మాంసాహారం మాత్రమేగాక... వేపుళ్లు, బేకరీ పదార్థాలు, నెయ్యి లాంటి వాటిని పరిమితి కంటే మించి ఎక్కువగా తీసుకుంటే ఆహారం కాస్తా కొవ్వుగా మారుతుంది. అది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, దాన్ని పరిమితిలో ఉంచుకోడానికి మందులు వాడుతుంటే, వాటిని మధ్యలో మానేయకూడదు. మీరు మాంసాహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ కొవ్వులు తక్కువగా ఉండే చికెన్ తీసుకోవచ్చు. అయితే చికెన్ కంటే కూడా చేపలు మరీ మేలైనవి. – డాక్టర్ అనూజ్ కపాడియా, కేర్ హాస్పిటల్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్ కాలేయ వ్యాధులు వంశపారంపర్యమా? నా వయసు 23. మా తాతగారి కాలం నుంచి కుటుంబంలో దాదాపు అందరికీ కామెర్ల వ్యాధి వచ్చింది. మా తాతగారు, పెదనాన్న, పెద్ద మేనత్త కాలేయ క్యాన్సర్‌తో చనిపోయారు. నాకూ జాండీస్ వచ్చింది. కామెర్లు వ్యాధి వచ్చిన వాళ్లందరికీ తర్వాత కాలేయ క్యాన్సర్ వస్తుందా? కాలేయ క్యాన్సర్ కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. – రమేశ్, కందుకూరు కామెర్లు వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. కానీ వంశపారంపర్యంగా వచ్చే ఫ్యాటీలివర్ మాత్రం ఒక రకమైన క్యాన్సర్‌కు కారణం కావచ్చు. మితిమిరిన మద్యపానం (నాలుగైదేళ్లకు పైబడి), హెపటైటిస్ ఎ, బి, సి, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ మంది మొదట కామెర్ల వ్యాధికి గురవుతుంటారు. హెపటైటిస్ ఏ, ఈ వైరస్ల వల్ల హఠాత్తుగా కామెర్ల వ్యాధి సోకి మరణించే ప్రమాదం ఉంటుంది. కామెర్ల వ్యాధికి గురై దాన్ని గుర్తించడంలో ఆలస్యం, నాటు మందుల వాడకం కాలేయానికి తీరని నష్టం చేస్తాయి. కాలేయ క్యాన్సర్ అనగానే చాలామంది మితిమీరిన మద్యపానం వల్ల వచ్చే వ్యాధి అనుకుంటారు. కానీ వందరకాల కాలేయ క్యాన్సర్లలో ఒక్కరకం క్యాన్సర్ మాత్రమే అదుపు లేని ఆల్కహాల్ వల్ల వస్తుంది. ప్రధానంగా హెపటైటిస్ వైరస్ల వల్ల వచ్చే కామెర్లు, బిలియరీ ఎట్రిసియా, మెటబాలిక్ డిసీజెస్ వంటివి కాలేయ క్యాన్సర్లకు దారితీస్తుంటాయి. వీటిలో హెపటైటిస్ వైరస్‌లే కామెర్లు, పెద సంఖ్యలో కాలేయ క్యాన్సర్లకు కారణం అవుతుంటాయి. హెపటైటిస్ సోకినా కొంతమంది చాలా ఏళ్ల వరకు దాని వల్ల జరుగుతున్న నష్టం గుర్తించరు. దాంతో 20 – 30 ఏళ్ల తర్వాత అది కాలేయ క్యాన్సర్ రూపంలో బయటపడుతుంది. బహుశా మీ కుటుంబంలో ఎక్కువ మంది యాదృచ్ఛికంగా ఈ విధంగా కాలేయ క్యాన్సర్‌కు గురై ఉండవచ్చు. కామెర్లకు ఇప్పుడు మంచి ఫలితాలు ఇవ్వగల ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. కానీ దీర్ఘకాలం పాటు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం పరిస్థితి విషమించే ప్రమాదం ఉన్నందున కామెర్లు వచ్చినవారు తప్పనిసరిగా డాక్టరుకు చూపించుకొని తగిన చికిత్స తీసుకోవాలి. ఇక కాలేయ క్యాన్సర్ విషయానికి వస్తే కలుషితమైన ఆహారపదార్థాలు తినడంవల్ల, ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, వంశపారంపర్యంగా వచ్చే ఫ్యాటీలివర్ డిసీజ్ వల్ల కాలేయం దెబ్బతిని క్యాన్సర్ వస్తున్నట్లు వెల్లడైంది. శరీరంలో కొంత కొవ్వు ఉండటం సహజమే. కానీ శరీరపు బరువులో అది పది శాతాన్ని మించినప్పుడు ఫ్యాటీ లివర్ వస్తుంది. మధ్య వయసు, ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువ. హీమోక్రొమటోసిస్ (శరీరంలో ఇనుము ధాతువు పెరిగిపోవడం), చాలాకాలంగా తగ్గకుండా ఉన్న హెపటైటిస్ వ్యాధుల వల్ల కూడా కాలేయానికి క్యాన్సర్ సోకవచ్చు. కారణం ఏదైనా సరే కామెర్లు కనిపించగానే తగిన పరీక్షలు చేయించుకొని, డాక్టర్లతో చికిత్స చేయించుకోవడం ద్వారా కాలేయం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో ప్రాణాపాయకరమైన కాలేయ క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు. – డాక్టర్ హరికుమార్ ఆర్ నాయర్, సీనియర్ హెపటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఏసీలు లేకున్నా... 24 గంటలూ ఫుల్ ఏసీ!
అదొక అధునాతన హాస్టల్ భవనం... బయటి నుంచి ఒక్క యూనిట్ విద్యుత్తూ అందదు... కానీ వెలుగుజిలుగులకేం తీసిపోదు! ఏసీలు, కూలర్లు అసలే ఉండవు... అయినా ఫుల్ ఎయిర్ కండీషన్డ్! కాలం ఏదైనా బేఫికర్... కరెంటు పోతుందన్న భయమే లేదు! ఖర్చు పెరుగుతుందన్న బెంగ అసలే లేదు! ఎలా? ఎక్కడ? తెలుసుకుందాం... విద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది? నీరు, బొగ్గు, గ్యాస్, గాలి, సూర్యరశ్మితో, ఇంకా పలు రకాలుగా. వీటిలో బొగ్గు, గ్యాస్ వంటి సహజ వనరులు ఇంకా ఎంతకాలమని ఊరుతాయి? ఏదోనాటికి తప్పకుండా అయిపోతాయి. అవి అయిపోవడమే కాదు.. ఓజోన్ పొరకు చిల్లు కూడా భారీగానే పడుతుంది. విలువైన నీరు కూడా వృథా అవుతుంటే మానవాళి దాహార్తితో అలమటించి చావాల్సిందే. మరి అప్పుడెలా? ఆ పరిస్థితి రాకముందే ఏం చేయాలి? అందుకు నిలువెత్తు సమాధానమే ‘రిట్రీట్’ హాస్టల్ భవనం. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో గల గ్వాల్ పహాడీ వద్ద దీనిని ‘ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరీ)’ నిర్మించింది. సూర్యర శ్మి, గాలి వంటి ఎప్పటికీ తరగని సుస్థిర వనరులను, వ్యర్థాలనే ఉపయోగించుకుని ఆధునిక టెక్నాలజీలకు దీటుగా అనేక సౌకర్యాలను పొందడంపై పరిశోధనలు నిర్వహించే ఈ సంస్థ తన లక్ష్యాలకు అనుగుణంగా సహజ ఎయిర్ కండీషనింగ్కి మార్గం చూపుతూ ఈ రిట్రీట్‌ని నిర్మించింది. నేచురల్ ఏసీ ఇలా..! రిట్రీట్ను సహజసిద్ధంగా చల్లగా ఉంచేందుకు ప్రత్యేక అండర్‌గ్రౌండ్ ఎర్త్ టన్నెల్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా భవనం వెలుపల ఓ టవర్ నిర్మించారు. దాని కిటికీల గుండా వాతావరణంలోని గాలి టవర్‌లోకి ప్రవేశిస్తుంది. టవర్ నుంచి కింద భూమిలో 4 మీటర్ల లోతులో నిర్మించిన 70 మీటర్ల పొడవాటి సన్నటి టన్నెల్ గుండా గాలి ప్రయాణిస్తుంది. అక్కడ చిన్న మోటార్ల సాయంతో గాలి పైకి ఏర్పాటు చేసిన గొట్టాల్లోకి, అక్కడి నుంచి నేరుగా చిన్న రంధ్రాల ద్వారా వివిధ గదుల్లోకి వెళుతుంది. టన్నెల్ భూమిలో 4 మీటర్ల లోతులో ఉండటం వల్ల అందులో ఉష్ణోగ్రత ఎప్పుడూ దాదాపుగా స్థిరంగా ఉంటుంది. ఏడాది పొడవునా 22 నుంచి 26 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. దాంతో గాలి కూడా చల్లబడి నివాస గదుల్లోకి వస్తుంది. తర్వాత నివాస గదుల్లో వేడెక్కిన గాలి వె ళ్లేందుకు వెంటిలేటర్ల మాదిరిగా ప్రత్యేక గొట్టాలతో కూడిన మార్గం భవనం పై వరకూ ఉంటుంది. దాంతో వేడి గాలి భవనంపై నుంచి వెళ్లిపోవడం, గదిలోకి తిరిగి భవనం కింది నుంచి చల్లని గాలి రావడం జరుగుతుంది. ఇంకేం.. ఏసీలు, కూలర్లు లేకుండానే వాటికి దీటుగా గది అంతా ఫుల్ ఎయిర్ కండీషన్డ్ అయిపోతుంది. అయితే సహజ ఏసీ వ్యవస్థ వల్ల భవనంలో శీతాకాలంలో 20 డిగ్రీలు, ఎండాకాలంలో 28 డిగ్రీలు, వానాకాలంలో 30 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వరకూ ఉండవచ్చు. అవసరాన్ని బట్టి.. గాలిలో తేమను, వేడిని తగ్గించే ఎల్పీజీ, అమ్మోనియా ‘చిల్లర్స్’ పరికరాలను కాసేపు ఉపయోగించుకుంటే సరి.. ఏడాదంతా చౌకగానే ఏసీ అన్నమాట. ప్రకృతి వనరులతో... ‘సుస్థిర’ భవనం! తొమ్మిదేళ్ల క్రితం వరకూ ఎందుకూ పనికిరాని బంజరు భూమి అది. కానీ రిట్రీట్ నిర్మాణంతో ప్రస్తుతం సుస్థిర వనరులను ఎలా ఉపయోగించుకోవాలో తెలియచెప్పేందుకు వేదికగా మారింది. పరిసరాల్లో ప్రత్యేకంగా చెట్ల పెంపకం వల్ల, అండర్‌గ్రౌండ్ ఎయిర్టన్నెల్స్ వల్ల దాదాపు బిల్డింగ్ అంతా చల్లగా ఉంటుంది. ఆకురాలే చెట్లు నాటడం వల్ల వేసవిలో పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. శీతాకాలంలో ఆ చెట్ల ఆకులు రాలిపోవడంతో కాస్త వెచ్చగా కూడా ఉంటుంది. ఇక విద్యుత్తు అవసరాలన్నీ పైకప్పుపై ఏర్పాటుచేసే ఫొటోవోల్టాయిక్ ప్యానెల్స్ ఒడిసిపట్టే సౌరవిద్యుత్ ద్వారానే తీరతాయి. వీటికి అదనంగా వంటచెరుకు, పంటల వ్యర్థాలను కాల్చి, వెలువడే వాయువులతో విద్యుత్‌ను తయారుచేసే గ్యాసిఫైర్ హైబ్రీడ్ ఎలక్ట్రిసిటీ ప్లాంటు కూడా ఉంది. ఒక్క సోలార్ ప్యానెల్స్‌తోనే 10 కిలోవాట్ల వరకూ విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. పగలు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను నిల్వ చేసి రాత్రికి ఉపయోగించుకోవచ్చు. పైకప్పుపై నుంచి నేరుగా సూర్యరశ్మి గదుల్లోకి పడేలా ప్రత్యేక స్కైలైట్స్ ఉంటాయి కాబట్టి... పగలంతా లైట్ల అవసరమే ఉండదు. దీంతోపాటు తక్కువ విద్యుత్ కాలే బల్బులు, ఆటోమేటిక్ వ్యవస్థ కూడా ఉంటుంది. మురుగు నీరూ.. ఉపయోగమే హాస్టల్ గదుల నుంచి విడుదలయ్యే మురుగునీరంతా తొలుత ఓ ట్యాంకులోకి చేరుతుంది. అక్కడ ఘనవ్యర్థాలన్నీ ట్యాంకు అడుగున చేరి నీరు మాత్రమే ముందుకు ప్రవహిస్తుంది. ఘనవ్యర్థాలను సూక్ష్మజీవులు కుళ్లబెట్టి విచ్ఛిన్నం చేస్తాయి. తర్వాత మిగిలే మురికి నీటిని ప్రత్యేకంగా రెల్లుగడ్డి మడిలోకి పంపుతారు. ఇంకేం.. గడ్డివేళ్లను, మట్టిని దాటుకుని అవతలికి చేరేసరికి నీరు దాదాపుగా శుభ్రమైపోతుంది. ఈ నీటిని తాగడానికి పనికిరాకున్నా.. సాగునీటిగా, ఇతర అవసరాలకు మాత్రం ఉపయోగించవచ్చు. నేలలో నీటి శాతమూ పెరుగుతుంది. మానవ వ్యర్థాలతో బయోమీథేన్ కూడా తయారుచేసి వాహనాలకు ఇంధనంగానూ వాడవచ్చు. - హన్మిరెడ్డి యెద్దుల రిట్రీట్ అంటే.. తిరోగమనం! సైనిక పరిభాషలో రిట్రీట్ అంటే వెనక్కి తగ్గడం. ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినప్పుడు లేదా ఓడిపోయినప్పుడు రక్షించుకోవడం కోసం వెన్నుచూపడం. ఇప్పుడు మనిషికి కావల్సింది కూడా తిరోగమనమే. పునరుద్ధరింపలేని సహజ వనరుల విచ్చలవిడి వినియోగం నుంచి వెనక్కి మళ్లి ఎన్నటికీ తరిగిపోని సుస్థిర ఇంధన వనరుల వైపు సాగాల్సిన సమయమిది. అందుకే ఈ సంగతిని తెలియజెప్పేందుకే దీనికి రిట్రీట్ అన్న పేరు పెట్టారన్నమాట. ఇలాంటి పద్ధతులపైనే దృష్టిపెట్టాలి... సౌరశక్తి వినియోగంలో భారత్ నెంబర్ వన్ కావాలి. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాలుష్యాలను తగ్గించేలా ప్రస్తుతం మెరుగుపర్చాలి. తర్వాత దశలవారీగా వాటిని మూసేయాలి. ప్రతి విషయంలోనూ పాశ్చాత్య విధానాలను అనుసరించకుండా భారతీయులు ఇలాంటి పద్ధతులపై దృష్టిపెట్టాలి. అప్పుడే జల వనరులను కాలుష్యమయం చేయకుండా, అడవులను నాశనం చేయకుండానే దేశం అభివృద్ధి సాధిస్తుంది. - ‘టెరీ’ డీజీ రాజేంద్ర కుమార్ పచౌరీ (2007లో నోబెల్ శాంతి బహుమతి పొందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ)కి చైర్మన్‌గా కూడా ఉన్నారు) ఇవీ ప్రత్యేకతలు... సాధారణ నిర్మాణ వ్యయం కంటే 25% అదనంగా ఖర్చు అయినా.. ఇతర భవనాల ఇంధనం ఖర్చుల్లో 50% వరకూ ఆదా అవుతుంది. 24 సోలార్ వాటర్ హీటింగ్ ప్యానెళ్ల ద్వారా రోజూ 2 వేల లీటర్ల నీరు వేడి చేసుకోవచ్చు. రిట్రీట్ లాంటి ఓ భవనానికి వెలుగులు పంచాలంటే సుమారు 28 కిలోవాట్ల విద్యుత్ అవుతుంది. కానీ ప్రస్తుతం రిట్రీట్‌కు 10 కిలోవాట్ల విద్యుత్ మాత్రమే ఖర్చవుతోందట. ఈ పద్ధతి వల్ల పెట్రోలియం, ఇతర వనరుల దిగుమతి తగ్గుతుంది కాబట్టి.. మారకద్రవ్యం రూపేణా విదేశాలకు భారీగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి తప్పుతుంది. రిట్రీట్‌లో ఏర్పాటు చేసుకున్న పర్యావరణ అనుకూల పద్ధతుల వ ల్ల ఏటా వాతావరణంలోకి ఎంత మేరకు సీవోటూ ఉద్గారాలు తగ్గుతాయో తెలుసా? అక్షరాలా 570 టన్నులు!