కేసులుంటే 'ఎయిర్ గన్'లపై భారీ డిస్కౌంట్
కొట్టాయం(కేరళ):
వీధి కుక్కల నియంత్రణకు కొట్టాయంలోని ఓ కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నడుం బిగించింది. వీధి కుక్కల బెడద నుంచి కాపాడుకోవడానికి ఎయిర్ గన్ల పై డిస్కౌంట్లను ప్రకటించింది. 10 శాతం డిస్కౌంట్ ధరలకు ఎయిర్ గన్లు ఇవ్వనున్నట్టు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జేమ్స్ పంబక్కల్ తెలిపారు. అంతే కాకుండా వీధికక్కులను చంపిన కేసులో నిందితులకు ఎయిర్ గన్లపై 25 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
ఎర్నాకులంకు చెందిన సామాజిక కార్యకర్త జోస్ మవేలీకి తమ తొలి ఎయిర్ గన్ను బహుమానంగా ఇచ్చారు. జోస్ మవేలీ ఆరు వీధికుక్కలను చంపిన కేసులో నిందితుడుగా ఉన్నారు. 'దేవుడా, వీధి కుక్కల నుంచి మమ్మల్ని కాపాడు. ఆ కుక్కలను చంపేలా మాకు ధైర్యాన్ని ఇవ్వు. అన్ని వీధి కుక్కలు ప్రమాదకరం..' అంటూ జోస్ మవేలీ వీధి కుక్కలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.