AirAsia flight missing
-
విమానం అదృశ్యమైన ప్రాంతంలో భారీ వర్షం
న్యూఢిల్లీ: గల్లంతయిన ఇండోనేసియా విమానం ఆచూకీ కనుగొనేందుకు కోసం చేపట్టిన సహాయక కార్యక్రమాలను ఆపివేశారు. విమానం గల్లంతయిన ప్రాంతంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో సహాయాక కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆదివారం ఉదయం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం-క్యూజెడ్ 8501 గగన తలంలో అదృశ్యమైంది. విమానంలో మొత్తం 162 మంది ఉన్నారు. దీని ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. తూర్పు బెలితుంగ్ వద్ద సముద్రంలో కూలిపోయినట్టు అనధికార సమాచారం. అదృశ్య ఘటనపై సాయం చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. విమానం ఆచూకీ కనుగొనేందుకు భారత్ మూడు నౌకలు, ఒక విమానాన్ని సిద్ధంగా ఉంచింది. -
వీడని విమానం అదృశ్యం మిస్టరీ.. భారత్ సాయం
న్యూఢిల్లీ: ఇండోనేసియా విమాన అదృశ్య ఘటనపై సాయం చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అండమాన్ సముద్రంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నౌకలను సిద్ధంగా ఉంచింది. విమానం ఆచూకీ కనుగొనేందుకు భారత్ మూడు నౌకలు, ఒక విమానాన్ని సిద్ధంగా ఉంచింది. కాగా ఇండోనేసియా విమానం అదృశ్యమై పది గంటలు దాటుతున్నా ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. తూర్పు బెలితుంగ్ వద్ద సముద్రంలో కూలినట్టు అనధికార సమాచారం. ఆదివారం ఉదయం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం-క్యూజెడ్ 8501 గగన తలం నుంచి అదృశ్యమైంది. విమానంలో మొత్తం 162 మంది ఉన్నారు. -
'ఎంహెచ్ 370' అదృశ్యమైన 10 నెలలకు..
కౌలంపూర్: ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతూ గగనతలంలో ఎయిర్ ఏషియా విమానం అదృశ్యం కావడంతో ఆ సంస్థ గురించి తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. మలేసియాకు చెందిన ఎయిర్ ఏసియాకు సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా విమాన సేవలు అందిస్తోంది. 100 గమ్యస్థానాలు విమాన సర్వీసులు నడుపుతోంది. పలు ఆసియా దేశాలకు రాయితీలతో కూడిన విమాన సర్వీసులు అందిస్తోంది. మలేసియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370 కనిపించకుండాపోయిన 10 నెలలకు ఎయిర్ ఏషియా విమానం అదృశ్యం కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చి 8న అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఈ విమానం కూలిపోయివుంటుందని భావిస్తున్నారు. -
'అదశ్యమైన విమానంలో భారతీయులు లేరు'
జకర్తా: గగన తలంలో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానంలో భారతీయులు ఎవరూ లేరని ఇండోనేసియా టీవీ వెల్లడించింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది తమ దేశానికి చెందిన వారే ఉన్నారని తెలిపింది. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 149 మంది ఇండోనేసియా, ముగ్గురు కొరియా దేశాలకు చెందిన వారున్నారని పేర్కొంది. సింగపూర్, బ్రిటన్, మలేసియా దేశాలకు చెందిన పౌరులు ఒక్కొక్కరు ఉన్నట్టు తెలిపింది. ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతూ ఏషియా విమానం-క్యూజెడ్8501 ఈ ఉదయం అదృశ్యమైంది. ఇందులో మొత్తం 162 మంది ఉన్నారు. -
'అక్కడే విమానం అదృశ్యమై ఉండొచ్చు'
జకర్తా: ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతూ గగన తలంలో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం-క్యూజెడ్8501లో ఏడుగురు సిబ్బంది, 155 మంది ప్రయాణికులున్నారని ఇండోనేసియా రవాణా శాఖ అధికారి హాది ముస్తోఫా వెల్లడించారు. కాలిమాంటన్- బెలిటుండ్ ఐలాండ్ మధ్య విమానం అదృశ్యమై ఉండొచ్చని తెలిపారు. ఏటీసీతో సంబంధాలు తెగిపోవడానికి ముందు అసాధారణమైన దారిలో(అన్యూజ్వల్ రూట్) ప్రయాణించడానికి పైలట్లు అనుమతి కోరారని వెల్లడించారు. అదృశ్యమైన విమానాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.