![ఎంహెచ్ 370 విమానం(ఫైల్) - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71410172682_625x300_0.jpg.webp?itok=zyPnZdDI)
ఎంహెచ్ 370 విమానం(ఫైల్)
కౌలంపూర్: ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతూ గగనతలంలో ఎయిర్ ఏషియా విమానం అదృశ్యం కావడంతో ఆ సంస్థ గురించి తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. మలేసియాకు చెందిన ఎయిర్ ఏసియాకు సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా విమాన సేవలు అందిస్తోంది. 100 గమ్యస్థానాలు విమాన సర్వీసులు నడుపుతోంది. పలు ఆసియా దేశాలకు రాయితీలతో కూడిన విమాన సర్వీసులు అందిస్తోంది.
మలేసియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370 కనిపించకుండాపోయిన 10 నెలలకు ఎయిర్ ఏషియా విమానం అదృశ్యం కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చి 8న అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఈ విమానం కూలిపోయివుంటుందని భావిస్తున్నారు.