వీడని విమానం అదృశ్యం మిస్టరీ.. భారత్ సాయం
న్యూఢిల్లీ: ఇండోనేసియా విమాన అదృశ్య ఘటనపై సాయం చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అండమాన్ సముద్రంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నౌకలను సిద్ధంగా ఉంచింది. విమానం ఆచూకీ కనుగొనేందుకు భారత్ మూడు నౌకలు, ఒక విమానాన్ని సిద్ధంగా ఉంచింది.
కాగా ఇండోనేసియా విమానం అదృశ్యమై పది గంటలు దాటుతున్నా ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. తూర్పు బెలితుంగ్ వద్ద సముద్రంలో కూలినట్టు అనధికార సమాచారం. ఆదివారం ఉదయం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం-క్యూజెడ్ 8501 గగన తలం నుంచి అదృశ్యమైంది. విమానంలో మొత్తం 162 మంది ఉన్నారు.