Airbag
-
మోకాలికి ఏఐ కవచం.. ఎందుకో తెలుసా?
పరుగులు తీసేటప్పుడు, ఒక్కోసారి నడిచేటప్పుడు జారిపడే సందర్భాల్లో.. కేవలం 60 మిల్లీ సెకండ్లలోనే మోకాలి చిప్పకు, దాని లిగమెంట్లకు గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి లండన్‌కు చెందిన ‘హిప్పోస్’ అనే స్టార్టప్ కంపెనీ మోకాలికి ఏఐ కవచాన్ని తాజాగా రూపొందించింది.ఈ ఏఐ కవచాన్ని ధరించిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడుతున్నట్లయితే.. ఏఐ ఎయిర్‌బ్యాగ్ 30 మిల్లీ సెకండ్లలోనే తెరుచుకుని, గాయాలను నివారిస్తుంది. మోకాలికి ధరించే ఈ ఏఐ ఎయిర్ బ్యాగ్ పనితీరును ‘హిప్పోస్’ కంపెనీ నిర్వాహకులు లండన్‌లోని పలు ఫుట్‌బాల్ క్లబ్బులకు చెందిన క్రీడాకారులపై ప్రయోగించి, సంతృప్తికరమైన ఫలితాలను సాధించారు.ఇదీ చదవండి: పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియోఏఐ కవచాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ‘హిప్పోస్’ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అందువల్ల క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం 6.42 లక్షల డాలర్లు (రూ.5.43 కోట్లు) వరకు నిధులు సమకూరాయని ‘హిప్పోస్’ సంస్థ తెలిపింది. ఈ మోకాలి కవచాల ధర ఒక్కో జత 129 డాలర్లు (రూ.10,929) అవుతుందని, ప్రీఆర్డర్ల ద్వారా నిధులు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ‘హిప్పోస్’ వ్యవస్థాపకులు కైలిన్ షా, భావీ మెటాకర్ చెబుతున్నారు. -
ప్రపంచవ్యాప్తంగా 4,60,000 కార్లను రీకాల్ చేసిన వోల్వో
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ వోల్వో ప్రపంచవ్యాప్తంగా 4,60,000కు పైగా కార్లను రీకాల్ చేసింది. ఎయిర్ బ్యాగ్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కార్లను రీకాల్ చేసినట్లు వోల్వో తెలిపింది. స్వీడిష్ కార్ల తయారీ సంస్థ ప్రతినిధి యు.ఎస్. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడుతూ.. ఎయిర్ బ్యాగ్స్‌లో చిన్న సాంకేతిక సమస్య వల్ల వాహన చోదకుడీకి, ప్రయాణికులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రీకాల్ చేసినట్లు తెలిపారు. ఎన్ హెచ్ టిఎస్ఏకు సమర్పించిన సేఫ్టీ రీకాల్ నివేదికలో వోల్వో ఈ పరిస్థితికి సంబంధించి పూర్తిగా వివరించింది. అయితే, దీని ఫలితంగా మరణం సంభవించిందని తెలిపింది. ఈ లోపం టకాటా ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 మిలియన్ల భాగాలు రీకాల్ చేశారు. ఇలా వోల్వో మాత్రమే రీకాల్ చేయలేదు, అనేక ఇతర కంపెనీలు కూడా వాటి వాహనాలను చాలా సార్లు వాటి వాహనాలను రీకాల్ చేశాయి.(చదవండి: చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలికిన హాలీవుడ్..!) -
ఇక ఆ వాహనాలకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి
న్యూఢిల్లీ: అన్ని కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలలో ఫ్రంట్ ప్యాసింజర్ కు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న ఈ ఉత్తర్వులను కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. “వాహనం ముందు సీటులో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి చేస్తూ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఒక ముఖ్యమైన రక్షణ చర్యగా పేర్కొంది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సూచనల ఆధారంగా ఈ నిబంధనలు తీసుకురావడం జరిగినట్లు" కేంద్రం పేర్కొంది. 2021 ఏప్రిల్ 1న నుంచి కొనుగోలు చేసే ప్రతి కొత్త వాహనంలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఇక ఇప్పటికే కొన్న వాహనాలకు ఆ వాహనదారులు ఆగస్టు 31లోపు తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్స్ అమర్చుకోవాల్సి ఉంటుంది. గతంలో డిసెంబర్ 29, 2020న ఈ నిబంధనలు తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రతి వాహనంలోనూ ముందు సీట్ల కోసం డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. కొత్త వాహనాలకు ఏప్రిల్ 1, పాత వాహనాలకు జూన్ 1లోపు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. డ్రైవర్ సీట్ లో ఎయిర్ బ్యాగ్ తప్పనిసరిగా ఉండాలని 2019 నుంచే నిబంధన ఉండగా.. ప్రస్తుతం డ్రైవర్ పక్క సీటుకు కూడా దీన్ని కొనసాగించారు. ఈ నిబంధన అన్ని ఎం1 కేటగిరి వాహనాలకు వర్తిస్తుంది. ఎనిమిది సీట్ల కంటే తక్కువ సైజున్న ప్యాసెంజర్ వెహికిల్స్ అన్నీ ఈ కేటగిరిలోకి చేరతాయి. ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలోని రోడ్ ప్రమాద బాధితుల్లో 10 శాతం మంది భారతదేశం నుంచి ఉన్నారు. డ్రైవర్ పక్క సీటుకు కూడా ఎయిర్‌బ్యాగ్ ఉండటం వల్ల ప్రమాదం వల్ల కలిగే తీవ్రతను కొంచెం తగ్గించవచ్చు. దీనివల్ల డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు అదనపు రక్షణ లభిస్తుంది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నాలుగు చక్రాల వాహన ధరలు రూ.5,000 నుంచి 8,000 పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్ వ్యక్తి ప్రాణాలను కాపాడే ఆస్కారం ఎక్కువ కాబట్టి ఇది అంత పెద్ద ధర కాకపోవచ్చు. చదవండి: ఆరు నెలలు నీటి అడుగున ఐఫోన్ 11, అయినా కూడా.. రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్! -
6758 కార్లను రీకాల్ చేయనున్న ఆడీ కంపెనీ
న్యూఢిల్లీ: భారత్ లోని 6758 ఏ4 సెడాన్ కార్లను రీకాల్ చేయాలని లగ్జరీ కార్ల ఉత్పత్తి సంస్థ ఆడి నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2011 నుంచి అక్టోబర్ 2014 సంవత్సరాల మధ్య ఉత్పత్తి చేసిన కార్లను మాత్రమే రీకాల్ చేస్తున్నట్టు ఆడీ కంపెనీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేయడం కోసమే తప్ప.. ఎలాంటి పరికరాలను మార్చబోమని ఆడి తెలిపింది. ఆడీ ఏ4 కార్ల వినియోగదారులకు డీలర్లు అందుబాటులో ఉంటారని, సాఫ్ట్ వేర్ అప్ డేట్ కోసం అపాయింట్ మెంట్ తీసుకుంటారని ఆడి తెలిపింది.