Airlines serial
-
ఇక ఫ్లయిట్‌లోనూ మొబైల్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఇకపై విమాన ప్రయాణాలు, నౌకా ప్రయాణాల్లో కూడా మొబైల్ కాల్స్‌కు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశ విదేశ ఎయిర్‌లైన్స్, షిప్పింగ్ కంపెనీలు ఇక నుంచి ఇన్–ఫ్లయిట్, మారిటైమ్ వాయిస్.. డేటా సర్వీసులు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం అవి దేశీ టెలికం సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇన్–ఫ్లయిట్ అండ్ మారిటైమ్ కనెక్టివిటీ (ఐఎఫ్‌ఎంసీ) రూల్స్ 2018గా ఈ మార్గదర్శకాలను వ్యవహరించనున్నట్లు, అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు డిసెంబర్ 14న విడుదల చేసిన నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం భారత గగనతలంలో ఎగిరే విమానం కనీసం 3,000 మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత ఐఎఫ్‌ఎంసీ సర్వీసులు యాక్టివేట్ అవుతాయి. వార్షికంగా రూ. 1 ఫీజుతో పదేళ్ల పాటు ఐఎఫ్‌ఎంసీ లైసెన్సులు జారీ అవుతాయి. అందించే సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి పర్మిట్ హోల్డరు.. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. -
ఆకాశమంత విశ్వాసం ఆమెది!
వంటింటిని దాటి మహిళ అడుగు బయటపెట్టి చాలా కాలమే అయినా... ఇప్పటికీ కొన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లడం ఆమెకు కష్టంగానే ఉంది. మహిళలు బలహీనులని, వారు అన్ని రకాల పరిస్థితులకూ ఎదురొడ్డలేరని మగవాళ్లు భావించడం వల్లే జరుగుతోంది. ఆ భావన తప్పు అని నిరూపించేందుకు చేసిన ప్రయత్నమే ‘ఎయిర్‌లైన్స్’ సీరియల్! ఎయిర్ హోస్టెస్ అనగానే ఆడపిల్లలే కరెక్ట్ అంటారు. పెలైట్ అనగానే మగవాళ్ల ఉద్యోగం అనుకుంటారు. విమానంలో సేవలు చేయగల మహిళలు విమానాన్ని నడపలేరా? ఈ ప్రశ్నే అడుగుతుంది హీరోయిన్ అనన్య. పెలైట్‌గా విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రతి సమస్యనూ సమర్థంగా ఎదుర్కొంటుంది. మరోపక్క పురుషాధిక్యతతో ప్రతిక్షణం ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అయినా బెదరకుండా ఆకాశమంత విశ్వాసంతో అడుగులు వేస్తూ ఉంటుంది. నేటి మహిళకు ప్రతిరూపంగా తీర్చిదిద్దిన అనన్య పాత్ర చాలా బాగుంది. ఆ రోల్ పోషిస్తోన్న తులిప్ జోషి కళ్లలోనే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఆడపిల్లలు ఇలానే ఉండాలి అన్నంతగా పాత్రలో జీవిస్తోందామె. ఇంత మంచి సీరియల్‌ని ఇస్తున్నందుకు స్టార్ ప్లస్ చానెల్ వారిని అభినందించాల్సిందే!