విమానాశ్రయంలో ‘వింత’ భోజనప్రియుడు
బీజింగ్: విమాన టికెట్టును ఎవరైనా విమానయానం కోసమే ఉపయోగిస్తారు. కానీ, చైనాలోని ఒక వ్యక్తి మాత్రం విమానాశ్రయంలో దొరికే ఉచిత భోజనం కోసమే టికెట్టు తీసుకున్నాడు. టికెట్టును ఎప్పుడు రద్దుచేసుకున్నా, డబ్బును వాపసు చేసే వెసులుబాటు కల్పించిన ఈస్టర్న్ చైనా ఎయిర్‌లైన్స్‌లో ఫస్ట్‌క్లాస్ టికెట్టు కొని, దాంతో విమానంలో ప్రయాణించకుండా, ప్రయాణాన్ని రద్దుచేసుకుంటూ 300 సార్లు అదే టికెట్టును రీబుకింగ్ చేసుకున్నాడు.
షాంగ్లీ ప్రావిన్స్ జియాన్ విమానాశ్రయానికి వెళ్లిన ప్రతిసారీ సిబ్బందికి తన టికెట్టు చూపి ఉచిత భోజనాన్ని సుష్టుగా ఆరగించేవాడు. తర్వాత టికెట్టును మరుసటి తేదీకి మార్చుకునేవాడు. ఏడాది వ్యవధిలో ఇలా ఏకంగా 300 సార్లు ఉచిత భోజనాన్ని ఆస్వాదించాడు. చివరకు ఇది గమనించిన సిబ్బంది అతడి టికెట్టును రద్దుచేసుకుని, డబ్బును తిరిగి ఇచ్చేసింది.