airticket
-
వచ్చేవారంలోగా రిఫండ్స్ జరగాలి
న్యూఢిల్లీ: కోవిడ్ లాక్డౌన్ సమయంలో బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లు, సర్వీసుల రద్దుకు సంబంధించిన రిఫండ్లను వచ్చే వారంలోగా (నవంబర్ 3 వారం లోపు) రిఫండ్ చేయాలని ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్‌లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 25 నుండి వివిధ దశాల్లో దేశంలో లాక్డౌన్ అమలయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పలు విమాన సేవలను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే అప్పటి ముందస్తు బుకింగ్‌ల విషయంలో కొందరికి రిఫండ్స్ జరగలేదు. కొన్ని సాంకేతిక, ఆర్థిక అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి. ఈ అంశంపై ఆన్లైన్ ట్రావెల్ అగ్రిగేటర్లతో వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక సమావేశం జరిగింది. వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నవంబర్ మూడవవారంలోపు రిఫండ్స్ జరగాలని అగ్రిగేటర్లకు స్పష్టం చేసినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువరించింది. ప్రకటన ప్రకారం వినియోగదారుల ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ–వినియోగదారుల వ్యవహారాల శాఖ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేసే విషయంలో విధివిధానాలు ఖరారుకు చేయాలని సమావేశం భావించింది. వినియోగదారుల ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారం కోసం ఎయిర్ సేవా పోర్టల్‌తో జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ను ఏకీకృతం చేయడం చర్చల్లో చోటుచేసుకున్న మరొక ప్రతిపాదన. -
Google Flights: అతి తక్కువ ధరలో విమాన టికెట్లు కావాలా? గూగుల్ కొత్త ఫీచర్ చూడండి!
Google Flights సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునేవారిక గుడ్ న్యూస్ అందించింది.సామాన్యుడికి విమాన టికెట్ కొనుగోలు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నదే. కానీ గూగుల్ ఫీచర్‌ను ఫాలో అయితే మాత్రం తక్కువ ధరలోనే గాల్లో ఎగిరి పోవచ్చు. ఎలా పనిచేస్తుంది చౌక ధరకే విమాన టిక్కెట్లను కొనుగోలు చేసేలా Google Flights అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. . గూగుల్ బ్లాగ్ పోస్ట్ ద్వారా అధికారికంగా ప్రకటించిన Google Flights విమాన ఛార్జీలపై డబ్బు ఆదా చేసే లక్ష్యంతో ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం Google Flightsలో ధరల ట్రాకింగ్ సిస్టమ్‌ను ఆన్ చేసుకోవాలి. కొత్త ఇన్సైట్స్ ద్వారా నమ్మకమైన ట్రెండ్ డేటాతో , మీరు ఎంచుకున్న తేదీలు ,గమ్యస్థానాన్నిటికెట్లు బుక్ చేసుకోవడానికి ధరలు సాధారణంగా ఎప్పుడు తక్కువగా ఉన్నాయో చూడొచ్చు అని తన Google బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ప్రయాణికులు తక్కువ ధరలో విమాన టికెట్లను బుక్ చేసుకోవడానికి ఉత్తమమైన సమయంపై సమాచారాన్నిమ సుమారు రెండు నెలల ముందే అందిస్తుంది. కొత్త ఫీచర్ ఏ సమయంలో లేదా ఏ తేదీలలో బుక్కింగ్ ధరలు తక్కువగా ఉంటాయనే వివరాలను అందిస్తుంది. ఇందుకోసం గూగుల్ విమానాల కోసం ధర హామీ ట్యాగ్‌తో పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా అమలు చేస్తోంది. బయలుదేరే ముందు టిక్కెట్ల ధర తగ్గకుండా చూసుకుంటుంది. అంతేకాదు ప్రైస్ గ్యారంటీని అందిస్తుంది.అంటే ధర తగ్గితే, Google Pay ద్వారా ఓవర్ పెయిడ్ వ్యత్యాసాన్ని గూగుల్ తిరిగి చెల్లిస్తుంది. క్రిస్మస్ ట్రిప్‌కోసం ప్లాన్ చేస్తే..? గూగుల్ లెక్కల ప్రకారం మిడ్ డిసెంబర్లో షురూ అయ్యే క్రిస్మస్ ట్రిప్‌ల కోసం తక్కువ ధరలో టికెట్లను బుక్ చేసుకునే సరైన సమయం అక్టోబర్ ప్రారంభం. 71 రోజుల ముందు తక్కువగా ఉన్నాయి. 2022 నాటి లెక్కల ప్రకారం బయలుదేరడానికి కేవలం 22 రోజుల ముందు సగటు ధరలు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. టేకాఫ్‌కి 54-78 రోజుల ముందు మరింత తక్కువ. అమెరికా నుండి యూరోప్ట్రిప్కు బెస్ట్ టైం సగటున 72 రోజుల ముందు బుక్ చేసుకుంటే అమెరికా నుంచి యూరప్ వెళ్లే విమాన టికెట్ల ఛార్జీలు తక్కువగా ఉన్నాయి.యుఎస్ నుండి యూరప్‌కు సగటు విమాన ఛార్జీలు బయలుదేరి 10 వారాల ముందు అయితే బెటర్.. వీలైనంత త్వరగా మీ విమానాన్ని బుక్ చేసుకోవాలని గూగుల్ తె లిపింది.. -
టిక్కెట్ల నుంచి రీఛార్జి దాకా..
- అన్నీ రకాల సేవలకు ఒకే వే దిక అవర్‌ట్రిప్.ఇన్ - రూ.3 కోట్ల నిధుల సమీకరణకు రెడీ - రెండు నెలల్లో విజయవాడ, విశాఖలకూ విస్తరణ - సాక్షి స్టార్టప్ డైరీతో ఫౌండర్ బి.మోహన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ పుణ్యమా అని కాలంతో పరుగెత్తే రోజుల నుంచి కాలం కంటే వేగంగా పరుగెత్తే రోజులొచ్చేశాయి. ఆన్లైన్లో అర క్షణం సమయం వృథా అయినా ఒప్పుకోవట్లేదు నేటి యువత. అందుకే వంటింటి సామగ్రి నుంచి విమాన టికెట్లు వరకూ ప్రతీదీ క్లిక్ దూరంలోనే కానిచ్చేస్తున్నారు. ప్రతి దానికీ ప్రత్యేకంగా వెబ్సైట్లు , మొబైల్ యాప్‌లూ పుట్టుకొచ్చేశాయి కూడా. ఒక్కో దానికీ ఒకో సైట్‌కెళ్లి కొనుగోలు చేయడం కూడా సమయాన్ని వృథా చేయటమే కదా!! అనుకున్నాడు బి.మోహన్. అన్ని సేవలనూ ఒకే వేదికపై అందించ లేమా అని ప్రశ్నించుకున్నాడు. అంతే.. చేస్తున్న ఉద్యోగానిక్కూడా గుడ్‌బై చెప్పేసి... రూ.4 లక్షల పెట్టుబడులతో 2014 ఆగ స్టులో అవర్‌ట్రిప్.ఇన్ను ప్రారంభించాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... మాది ప్రకాశం జిల్లా. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశా. ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఆన్లైన్ వేదికగా వ్యాపారం చేయాలనుకున్నా. కాకపోతే అందరిలా కాకుండా సింగిల్ పాస్వర్డ్లోనే అన్ని సేవలనూ వినియోగించుకునేలా ఉండాలనుకున్నా. ఆ ప్రయత్నంలోనే ‘‘అవర్‌ట్రిప్.ఇన్’’ను ఆరంభించా. విమానం, బస్సు టికెట్లతో పాటు హోటల్ గదుల బుకింగ్, మొబైల్, డీటీహెచ్ రీచార్జ్, డేటా కార్డ్స్, పోస్ట్‌పెయిడ్ బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్ సేవలన్నిటినీ ఒకే వేదికగా అందించడమే అవర్‌ట్రిప్.ఇన్ ప్రత్యేకత. విశాఖ, విజయవాడలకూ.. అవర్‌ట్రిప్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రతీ సేవల వినియోగానికి గాను ఆయా సంస్థలకు ప్రత్యేకంగా సొంతంగా ఒక్కో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిస్తాం. దీన్ని అటు సంస్థలు, ఇటు అవర్‌ట్రిప్ రెండూ వినియోగించుకునే వీలుంటుంది. దీంతో సంబంధిత వ్యాపార సంస్థలకు పని మరింత సులువవుతుంది. నిర్వహణ బాధ్యత కూడా అవర్ట్రిప్దే. ప్రస్తుతం అవర్‌ట్రిప్.ఇన్ సేవలు గోవా, హైదరాబాద్‌లో ఉన్నాయి. మరో రెండు నెలల్లో విజయవాడ, విశాఖపట్నాలకూ విస్తరించనున్నాం. ప్రస్తుతం మా వెబ్సైట్లో సుమారు 2,500 మంది బస్సు ఆపరేటర్లు, 36 వేలకు పైగా హోటళ్లు రిజిస్టరై ఉన్నాయి. నెలకు రూ.3 కోట్లు.. రోజుకు 10-12 వేల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకుంటున్నారు. నెలకు రూ.3 కోట్ల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. మరో రెండు నెలల్లో సినిమా టికెట్లు, రైల్వే టికెట్లు, ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపులు, హాలిడే ప్యాకేజీలు, కార్ రెంటల్స్ సర్వీసులను అందిస్తాం. క్లియర్‌ట్రిప్, మేక్‌మై ట్రిప్ వంటి పోటీ సంస్థలతో పోల్చుకుంటే అవర్ట్రిప్లో ధరలు రూ.30-40 వరకు తక్కువగా ఉంటాయి. లాభాలను తగ్గించుకోవటమే ఇందుకు కారణం. మనీ ట్రాన్స్‌ఫర్‌కు రూ.100కు గాను 45 పైసలు చార్జీ చేస్తాం. దేశీయంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా... ఏ బ్యాంకుకైనా నగదును బదిలీ చేయవచ్చు. మా కంపెనీలో సాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ రూ.2-3 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తాం అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...