Google Flights సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునేవారిక గుడ్ న్యూస్ అందించింది.సామాన్యుడికి విమాన టికెట్ కొనుగోలు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నదే. కానీ గూగుల్ ఫీచర్‌ను ఫాలో అయితే మాత్రం తక్కువ ధరలోనే గాల్లో ఎగిరి పోవచ్చు.
ఎలా పనిచేస్తుంది
చౌక ధరకే విమాన టిక్కెట్లను కొనుగోలు చేసేలా Google Flights అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. . గూగుల్ బ్లాగ్ పోస్ట్ ద్వారా అధికారికంగా ప్రకటించిన Google Flights విమాన ఛార్జీలపై డబ్బు ఆదా చేసే లక్ష్యంతో ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం Google Flightsలో ధరల ట్రాకింగ్ సిస్టమ్‌ను ఆన్ చేసుకోవాలి. కొత్త ఇన్‌సైట్స్ ద్వారా నమ్మకమైన ట్రెండ్ డేటాతో , మీరు ఎంచుకున్న తేదీలు ,గమ్యస్థానాన్నిటికెట్లు బుక్ చేసుకోవడానికి ధరలు సాధారణంగా ఎప్పుడు తక్కువగా ఉన్నాయో చూడొచ్చు అని తన Google బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
ప్రయాణికులు తక్కువ ధరలో విమాన టికెట్లను బుక్ చేసుకోవడానికి ఉత్తమమైన సమయంపై సమాచారాన్నిమ సుమారు రెండు నెలల ముందే అందిస్తుంది. కొత్త ఫీచర్ ఏ సమయంలో లేదా ఏ తేదీలలో బుక్కింగ్ ధరలు తక్కువగా ఉంటాయనే వివరాలను అందిస్తుంది. ఇందుకోసం గూగుల్ విమానాల కోసం ధర హామీ ట్యాగ్‌తో పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా అమలు చేస్తోంది. బయలుదేరే ముందు టిక్కెట్‌ల ధర తగ్గకుండా చూసుకుంటుంది. అంతేకాదు ప్రైస్ గ్యారంటీని అందిస్తుంది.అంటే ధర తగ్గితే, Google Pay ద్వారా ఓవర్ పెయిడ్ వ్యత్యాసాన్ని గూగుల్ తిరిగి చెల్లిస్తుంది.
క్రిస్మస్ ట్రిప్‌కోసం ప్లాన్ చేస్తే..?
గూగుల్ లెక్కల ప్రకారం మిడ్ డిసెంబర్‌లో షురూ అయ్యే క్రిస్మస్ ట్రిప్‌ల కోసం తక్కువ ధరలో టికెట్లను బుక్ చేసుకునే సరైన సమయం అక్టోబర్ ప్రారంభం. 71 రోజుల ముందు తక్కువగా ఉన్నాయి. 2022 నాటి లెక్కల ప్రకారం బయలుదేరడానికి కేవలం 22 రోజుల ముందు సగటు ధరలు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. టేకాఫ్‌కి 54-78 రోజుల ముందు మరింత తక్కువ.
అమెరికా నుండి యూరోప్‌ట్రిప్‌కు బెస్ట్ టైం
సగటున 72 రోజుల ముందు బుక్ చేసుకుంటే అమెరికా నుంచి యూరప్ వెళ్లే విమాన టికెట్ల ఛార్జీలు తక్కువగా ఉన్నాయి.యుఎస్ నుండి యూరప్‌కు సగటు విమాన ఛార్జీలు బయలుదేరి 10 వారాల ముందు అయితే బెటర్.. వీలైనంత త్వరగా మీ విమానాన్ని బుక్ చేసుకోవాలని గూగుల్ తె లిపింది..
Comments
Please login to add a commentAdd a comment