cheap airfares
-
Google Flights: అతి తక్కువ ధరలో విమాన టికెట్లు కావాలా? గూగుల్ కొత్త ఫీచర్ చూడండి!
Google Flights సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునేవారిక గుడ్ న్యూస్ అందించింది.సామాన్యుడికి విమాన టికెట్ కొనుగోలు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నదే. కానీ గూగుల్ ఫీచర్‌ను ఫాలో అయితే మాత్రం తక్కువ ధరలోనే గాల్లో ఎగిరి పోవచ్చు. ఎలా పనిచేస్తుంది చౌక ధరకే విమాన టిక్కెట్లను కొనుగోలు చేసేలా Google Flights అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. . గూగుల్ బ్లాగ్ పోస్ట్ ద్వారా అధికారికంగా ప్రకటించిన Google Flights విమాన ఛార్జీలపై డబ్బు ఆదా చేసే లక్ష్యంతో ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం Google Flightsలో ధరల ట్రాకింగ్ సిస్టమ్‌ను ఆన్ చేసుకోవాలి. కొత్త ఇన్సైట్స్ ద్వారా నమ్మకమైన ట్రెండ్ డేటాతో , మీరు ఎంచుకున్న తేదీలు ,గమ్యస్థానాన్నిటికెట్లు బుక్ చేసుకోవడానికి ధరలు సాధారణంగా ఎప్పుడు తక్కువగా ఉన్నాయో చూడొచ్చు అని తన Google బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ప్రయాణికులు తక్కువ ధరలో విమాన టికెట్లను బుక్ చేసుకోవడానికి ఉత్తమమైన సమయంపై సమాచారాన్నిమ సుమారు రెండు నెలల ముందే అందిస్తుంది. కొత్త ఫీచర్ ఏ సమయంలో లేదా ఏ తేదీలలో బుక్కింగ్ ధరలు తక్కువగా ఉంటాయనే వివరాలను అందిస్తుంది. ఇందుకోసం గూగుల్ విమానాల కోసం ధర హామీ ట్యాగ్‌తో పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా అమలు చేస్తోంది. బయలుదేరే ముందు టిక్కెట్ల ధర తగ్గకుండా చూసుకుంటుంది. అంతేకాదు ప్రైస్ గ్యారంటీని అందిస్తుంది.అంటే ధర తగ్గితే, Google Pay ద్వారా ఓవర్ పెయిడ్ వ్యత్యాసాన్ని గూగుల్ తిరిగి చెల్లిస్తుంది. క్రిస్మస్ ట్రిప్‌కోసం ప్లాన్ చేస్తే..? గూగుల్ లెక్కల ప్రకారం మిడ్ డిసెంబర్లో షురూ అయ్యే క్రిస్మస్ ట్రిప్‌ల కోసం తక్కువ ధరలో టికెట్లను బుక్ చేసుకునే సరైన సమయం అక్టోబర్ ప్రారంభం. 71 రోజుల ముందు తక్కువగా ఉన్నాయి. 2022 నాటి లెక్కల ప్రకారం బయలుదేరడానికి కేవలం 22 రోజుల ముందు సగటు ధరలు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. టేకాఫ్‌కి 54-78 రోజుల ముందు మరింత తక్కువ. అమెరికా నుండి యూరోప్ట్రిప్కు బెస్ట్ టైం సగటున 72 రోజుల ముందు బుక్ చేసుకుంటే అమెరికా నుంచి యూరప్ వెళ్లే విమాన టికెట్ల ఛార్జీలు తక్కువగా ఉన్నాయి.యుఎస్ నుండి యూరప్‌కు సగటు విమాన ఛార్జీలు బయలుదేరి 10 వారాల ముందు అయితే బెటర్.. వీలైనంత త్వరగా మీ విమానాన్ని బుక్ చేసుకోవాలని గూగుల్ తె లిపింది.. -
చైనా ఫోన్లే కాదు.. విమానాలూ చౌకే!
విదేశాలకు వెళ్లడానికి చార్జీలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతున్నారా? ప్రముఖ విమానయాన సంస్థలు అప్పుడప్పుడు ఆఫర్లు ప్రకటించినా, అవన్నీ స్వదేశీ విమానయానానికే చాలావరకు పరిమితం అవుతున్నాయి. కొన్ని మాత్రం విదేశాలకు ఆఫర్లు ఇస్తున్నా, అవన్నీ దగ్గర దేశాలకే. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే మాత్రం టికెట్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని బాధపడేవారికి ఇదో అవకాశం. చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ వాళ్లు చాలావరకు చవగ్గా విమానయానాలు అందిస్తున్నారట. ఢిల్లీ నుంచి లాస్ ఏంజెలిస్ వెళ్లడానికి ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ. 65వేలు టికెట్ తీసుకుంటే, చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ (సీఎస్ఏ) టికెట్ 58వేలు మాత్రమే ఉందట. ఒక్క అమెరికాకే కాదు.. భారతదేశం, మధ్యప్రాచ్యం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా చాలా దేశాలకు తక్కువ ధరలకే టికెట్లు ఆఫర్ చేస్తోంది. దాంతో భారతీయ ప్రయాణికులు ఇప్పుడు చైనా ఫోన్లతో పాటు చవగ్గా వస్తున్న చైనా విమానటికెట్ల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. భారత్ నుంచి ఈ విమానాల్లో వెళ్లేవారి సంఖ్య ఇటీవల కొన్నేళ్ల నుంచి బాగా పెరిగిందని థామస్ కుక్ సంస్థ ప్రెసిడెంట్ ఇందీవర్ రస్తోగీ చెప్పారు. చవగ్గా టికెట్లు ఇస్తున్నాం కదాని విమానాలు కూడా చౌకబారుగా ఉంటాయనుకుంటే తప్పే. వాటిలో సౌకర్యాలు కూడా బాగానే ఉంటున్నాయట. దూర ప్రాంతాలకు వెళ్లడానికి టికెట్ల ధరలు సింగపూర్ ఎయిర్‌లైన్స్, థాయ్ ఎయిర్వేస్, మలేసియన్ ఎయిర్‌లైన్స్ కంటే ఇందులో కనీసం 20 నుంచి 25 వేల వరకు ఇందులో తక్కువగా ఉంటున్నాయని రస్తోగీ చెప్పారు. అయితే, భారతీయ మార్కెట్లోకి నేరుగా ప్రవేశించే అవకాశం వీళ్లకు మరీ ఎక్కువగా లేకపోవడంతో ఎయిరిండియా సహా పలు భారతీయ ఎయిర్‌లైన్స్ బతికిపోతున్నాయి. వారానికి 42 విమానాల్లో 10వేల సీట్లు మాత్రమే అమ్ముకోడానికి వీలు కల్పించేలా ఇండియా - చైనాల మధ్య విమానయానానికి సంబంధించి ఒక ద్వైపాక్షిక ఒప్పందం ఉంది. దీన్ని చైనా సంస్థలు పూర్తిగా వాడుకుంటుండగా, భారతదేశం మాత్రం కేవలం 5 విమానాలే నడిపిస్తూ 1280 సీట్లు మాత్రమే అమ్ముకుంటోంది. ధరల్లో తేడాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీ-సిడ్నీ: చైనా సదరన్ (సీఎస్): రూ. 44,500 (వయా గువాంగ్జు) ఎయిరిండియా: రూ. 69వేలు (డైరెక్ట్) ఢిల్లీ-ఆక్లండ్: సీఎస్: రూ. 48,900 (వయా గువాంగ్జు) ఎయిరిండియా: రూ. 68,400 (వయా సిడ్నీ) ఎంఎ: రూ. 70,500 (వయా కౌలాలంపూర్) ఢిల్లీ-టోక్యో సీఎస్: రూ. 34,000 (వయా గువాంగ్జు) ఏఎన్ఏ : రూ. 39,400 థాయ్: రూ. 42,000 (వయా బ్యాంకాక్) ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో: సీఎస్: రూ. 60,300 (వయా గువాంగ్జు) గల్ఫ్ విమానాలు: ప్రారంభం రూ. 72 వేలు -
పోటాపోటీగా విమాన ఛార్జీల తగ్గింపు
భారత విమానయాన సంస్థలు పోటాపోటీగా ధరలను తగ్గిస్తున్నాయి. ఒక సంస్థ తన తగ్గింపు ధరలను ప్రకటించిన వెంటనే.. మిగిలిన సంస్థలు కూడా తాము సైతం తగ్గిస్తున్నామంటూ ప్రకటిస్తున్నాయి. తాజాగా స్పైస్ జెట్ సంస్థ రూ. 599కే టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఇండిగో, జెట్ ఎయిర్వేస్ కూడా ఆ బాటలో పయనించాయి. అన్ని పన్నులతో కలుపుకొని రూ. 1499కే టికెట్ ఇస్తామని ఇండిగో చెబితే, జెట్ ఎయిర్వేస్ సంస్థ ఎకానమీ టికెట్లను రూ. 1933కి ఇస్తామంటోంది. టికెట్ బుక్ చేసుకున్న 90 రోజుల తర్వాత మాత్రమే ఇండిగో ఆఫర్‌తో ప్రయాణం చేయొచ్చు. జెట్ ఎయిర్ వేస్ కూడా ఇలాగే చెబుతోంది. అయితే ఈ రెండూ కూడా స్పైస్ జెట్ ప్రకటించిన రూ. 599 ఆఫర్‌కు దరిదాపుల్లో కూడా లేవు. దాని ఆఫర్లో అయితే జూలై 1 నుంచి అక్టోబర్ 24వ తేదీ మధ్య చేసే ప్రయాణాలకు ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. స్వదేశీ విమానయాన సంస్థలు ఇటీవలి కాలంలో వరుసపెట్టి డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. జనవరి - మార్చి, ఆగస్టు-అక్టోబర్ త్రైమాసికాలకు విపరీతంగా డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయి. -
933కే జెట్ ఎయిర్వేస్ విమాన టికెట్లు
విమానాలు నేలకు దిగివస్తున్నాయి. రకరకాల ఆఫర్లతో ఎయిర్‌లైన్స్ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా జెట్ ఎయిర్వేస్ సంస్థ 933 రూపాయలకే విమానయానం అందిస్తోంది. ఇందులో ఇక పన్నులేమీ లేకపోవడం విశేషం. జెట్ ఎయిర్వేస్, జెట్ కనెక్ట్ సంస్థలు నడిపే స్వదేశీ విమానాల్లో ఎకానమీ క్లాస్ ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీని కింద ఈనెల 18 (గురువారం) వరకు బుక్ చేసుకోవచ్చు. 2015 జనవరి 16వ తేదీ తర్వాతి నుంచి చేసే ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకసారి టికెట్ కొన్న తర్వాత మళ్లీ రద్దుచేయాలనుకున్నా డబ్బులు మాత్రం వెనక్కి రావు. స్పైస్‌జెట్ సంస్థ 699 రూపాయలకు టికెట్ అని ప్రకటించినా, అందులో పన్నులు అదనం అని చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో పన్నులన్నింటినీ కలుపుకొని తాము 933కే టికెట్ ఇస్తామని జెట్ ఎయిర్వేస్ ముందుకొచ్చింది. -
రూ. 1887కే ఇండిగో విమాన టికెట్లు!!
వరుసపెట్టి విమానయాన సంస్థలన్నీ చవక ధరలకే ప్రయాణాలను అందించడం మొదలుపెట్టాయి. ఇప్పుడీ రేసులోకి ఇండిగో కూడా వచ్చేసింది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంత తక్కువ ధరకు.. అంటే, రూ. 1887కే అన్ని పన్నులతో కలుపుకొని టికెట్లు అందిస్తామని ప్రకటించింది. దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా సెప్టెంబర్ 25 నుంచి జనవరి 15వ తేదీ వరకు వెళ్లడానికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది. టికెట్ల బుకింగ్ గురువారం మొదలైంది. ఇలా వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు ప్రకటించడంతో ఇండిగో ప్రత్యర్థి స్సైస్ జెట్ తన ఆఫర్‌ను గురువారం వరకు పొడిగించింది. ఈ ఆఫర్ కింద, దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా సెప్టెంబర్ 25 నుంచి జనవరి 15వ తేదీ వరకు వెళ్లడానికి టికెట్ రూ. 1888 మాత్రమేనని స్పైస్ జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. (మళ్లీ 600కే విమాన టికెట్లు) ఇక ఎయిర్ ఏషియా ఇండియా అయితే 600 నుంచి 1900 వరకు మూడు రకాలుగా ధరలను నిర్ణయించింది. ప్రయాణ కాలాన్ని కూడా ప్రత్యర్థి సంస్థల్లా మూడు నాలుగు నెలలు కాకుండా ఏకంగా ఏడాదికి పైగా ఉంచింది. వీటన్నింటితో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా కూడా చవక ధరలకు దిగింది. ఏకంగా వంద రూపాయలకే పరిమిత కాలానికి టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రకటనతో ఆ సైట్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. (రూ. 100కే ఎయిర్ ఇండియా విమానయానం)