పోటాపోటీగా విమాన ఛార్జీల తగ్గింపు | airlines offer cheap airfares for weak seasons | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా విమాన ఛార్జీల తగ్గింపు

Published Thu, Feb 12 2015 5:29 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

పోటాపోటీగా విమాన ఛార్జీల తగ్గింపు

పోటాపోటీగా విమాన ఛార్జీల తగ్గింపు

భారత విమానయాన సంస్థలు పోటాపోటీగా ధరలను తగ్గిస్తున్నాయి. ఒక సంస్థ తన తగ్గింపు ధరలను ప్రకటించిన వెంటనే.. మిగిలిన సంస్థలు కూడా తాము సైతం తగ్గిస్తున్నామంటూ ప్రకటిస్తున్నాయి. తాజాగా స్పైస్ జెట్ సంస్థ రూ. 599కే టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఇండిగో, జెట్ ఎయిర్వేస్ కూడా ఆ బాటలో పయనించాయి. అన్ని పన్నులతో కలుపుకొని రూ. 1499కే టికెట్ ఇస్తామని ఇండిగో చెబితే, జెట్ ఎయిర్వేస్ సంస్థ ఎకానమీ టికెట్లను రూ. 1933కి ఇస్తామంటోంది. టికెట్ బుక్ చేసుకున్న 90 రోజుల తర్వాత మాత్రమే ఇండిగో ఆఫర్తో ప్రయాణం చేయొచ్చు. జెట్ ఎయిర్ వేస్ కూడా ఇలాగే చెబుతోంది.

అయితే ఈ రెండూ కూడా స్పైస్ జెట్ ప్రకటించిన రూ. 599 ఆఫర్కు దరిదాపుల్లో కూడా లేవు. దాని ఆఫర్లో అయితే జూలై 1 నుంచి అక్టోబర్ 24వ తేదీ మధ్య చేసే ప్రయాణాలకు ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. స్వదేశీ విమానయాన సంస్థలు ఇటీవలి కాలంలో వరుసపెట్టి డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. జనవరి - మార్చి, ఆగస్టు-అక్టోబర్ త్రైమాసికాలకు విపరీతంగా డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement