933కే జెట్ ఎయిర్వేస్ విమాన టికెట్లు | Jet Airways offers all inclusive 933 offer | Sakshi
Sakshi News home page

933కే జెట్ ఎయిర్వేస్ విమాన టికెట్లు

Published Wed, Sep 17 2014 11:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

933కే జెట్ ఎయిర్వేస్ విమాన టికెట్లు

933కే జెట్ ఎయిర్వేస్ విమాన టికెట్లు

విమానాలు నేలకు దిగివస్తున్నాయి. రకరకాల ఆఫర్లతో ఎయిర్లైన్స్ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా జెట్ ఎయిర్వేస్ సంస్థ 933 రూపాయలకే విమానయానం అందిస్తోంది. ఇందులో ఇక పన్నులేమీ లేకపోవడం విశేషం. జెట్ ఎయిర్వేస్, జెట్ కనెక్ట్ సంస్థలు నడిపే స్వదేశీ విమానాల్లో ఎకానమీ క్లాస్ ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీని కింద ఈనెల 18 (గురువారం) వరకు బుక్ చేసుకోవచ్చు. 2015 జనవరి 16వ తేదీ తర్వాతి నుంచి చేసే ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకసారి టికెట్ కొన్న తర్వాత మళ్లీ రద్దుచేయాలనుకున్నా డబ్బులు మాత్రం వెనక్కి రావు.

స్పైస్జెట్ సంస్థ 699 రూపాయలకు టికెట్ అని ప్రకటించినా, అందులో పన్నులు అదనం అని చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో పన్నులన్నింటినీ కలుపుకొని తాము 933కే టికెట్ ఇస్తామని జెట్ ఎయిర్వేస్ ముందుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement