aisf demands
-
5న విద్యాసంస్థల బంద్‌కు సహకరించాలి
ఖమ్మంసహకారనగర్ : పాఠశాలల్లో, ఇంటర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 5న నిర్వహిస్తున్న విద్యాసంస్థల బంద్‌కు అన్ని వర్గాలవారు సహకరించి జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జాగర్లమూడి రంజిత్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం గిరిప్రసాద్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయం అని చెప్పిన ప్రభుత్వం వాటిని మూసి వేసేందుకు కంకణం కట్టుకుందని ఆరోపించారు. సరైన తరగతి గదులు లేకపోవడంతో పాటు కనీసం మరుగుదొడ్లు కూడా అనేక పాఠశాలల్లో లేవన్నారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఇటికాల రామకృష్ణ, నాయకులు లక్ష్మణ్, గోపి, ఖాసీం తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు వర్సిటీలు వద్దు
మంత్రి గంటా పర్యటనను అడ్డుకొనేందుకు ఏఐఎస్ఎఫ్ విఫలయత్నం ఎస్కేయూ: ప్రైవేటు వర్సిటీలను అనుమతించవద్దని ఏఐఎస్ఎఫ్ విద్యార్థినాయకులు మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యటనను అడ్డుకొనేందుకు విఫల యత్నం చేశారు. ఎస్కేయూ పాలక భవనం ఎదురుగా శనివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. వర్సిటీల్లోని ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులను జాన్సన్‌బాబు, మధు, మనోహర్, రామాంజినేయులును అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు భౌతిక దాడులు చేశారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జాన్సన్‌బాబు ఆరోపించారు. ఇటుకలపల్లి పోలీసులు తమను దుర్భాషలాడి , కొట్టారన్నారు. ఇందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఇటుకలపల్లి పోలీస్‌స్టేçÙన్ ముందు ఆదివారం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.