Ajay piramal
-
రెట్టింపు ఏయూఎంపై పిరమల్ ఎంటర్ప్రైజెస్ దృష్టి
ముంబై: ఇన్వెస్టర్ డే సందర్భంగా పిరమల్ ఎంటర్ప్రైజెస్ (పీఈఎల్) తమ దీర్ఘకాలిక వృద్ధి, లాభదాయకత ప్రణాళికలను ఆవిష్కరించింది. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణాన్ని (ఏయూఎం) రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని నిర్దేశించుకుంది. అప్పటికల్లా ఏయూఎంను రూ. 1.2–1.3 లక్షల కోట్లకు చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. తమ రిటైల్ వ్యాపారంలో హోల్‌సేల్ విభాగం వాటాను 33 శాతానికి, రిటైల్ విభాగం వాటాను 67 శాతానికి పెంచుకోవడం ద్వారా దీన్ని సాధించే యోచనలో ఉన్నట్లు వివరించింది. అటు 2024 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి మరో 100 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చైర్మన్ అజయ్ పిరమల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పీఈఎల్ రిటైల్ రుణాల వ్యాపారం 57 శాతం పెరిగి రూ. 34,891 కోట్లకు చేరింది. జూన్ ఆఖరు నాటికి కంపెనీకి 423 శాఖలు, 33 లక్షల పైచిలుకు కస్టమర్లు, సుమారు 13 రకాల రుణ సాధనాలు ఉన్నాయి. -
అజయ్ పిరమళ్ చేయి వేస్తే...
ముంబై: అజయ్ పిరమల్‌కు... పెట్టుబడులపై భారీ లాభాలు ఆర్జిస్తారనే పేరు ఉంది. దీనిని ఆయన మరోసారి నిజం చేశారు. ఆరేళ్ల క్రితం (2013లో) ఆయన శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీలో 9.96 శాతం వాటాను రూ.1,652 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ వాటాను రూ.653 కోట్ల లాభంతో రూ.2,305 కోట్లకు అమ్మేశారు. ఒక్కో షేర్‌ను ఎంత ధరకు అమ్మారన్న వివరాలు లభించనప్పటికీ, సగటు విక్రయ ధర రూ.1,000–1,015 రేంజ్లో ఉండొచ్చని సమాచారం. మొత్తం మీ ఈ డీల్‌లో ఆయనకు ఆరేళ్లలో 40 శాతం రాబడులు వచ్చినట్లయింది. అజయ్ పిరమళ్‌కు చెందిన పిరమళ్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇతర శ్రీరామ్ గ్రూప్ కంపెనీల్లో కూడా వాటాలున్నాయి. శ్రీరామ్ సిటీ యూనియన్‌లో 10 శాతం, శ్రీరామ్ క్యాపిటల్‌లో 20 శాతం చొప్పున ఆయనకు వాటాలున్నాయి. ఈ వాటాల కోసం ఆయన ఐదేళ్ల క్రితం రూ.4,600 కోట్లు వెచ్చించగా, ఇప్పుడు వాటా విలువ రూ.9,000 కోట్లకు చేరింది. టెలికం దిగ్గజం వొడాఫోన్‌లో కూడా ఆయన భారీగానే ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలతో బైటపడ్డారు. గత పదేళ్లలో ఆయన పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యాలో, కొనుగోళ్ల లావాదేవీలో జరిపారు. మెర్క్, ఎలిలిల్లీ, ఫైజర్, అబాట్, బయో–సింటెక్, బేయర్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. -
ఫోర్బ్స్ దానకర్ణుల జాబితాలో నలుగురు భారతీయులు
సింగపూర్: ఆసియా పసిఫిక్‌లోని కుబేరులు, వ్యాపారవేత్తల్లో దాతృత్వగుణం కలిగినవారితో ఫోర్బ్స్ రూపొందించిన తాజా వార్షిక జాబితాలో రోహిణీ నిలేకని, అజయ్ పిరమల్ సహా నలుగురు భారతీయులకు చోటు లభించింది. ఈ జాబితాలో మొత్తం 48 మంది ఉండగా, ఆస్ట్రేలియా, చైనా, హాంకాంగ్, ఇండోనేసియా, జపాన్, మలేసియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, దక్షిణకొరియా, తైవాన్, థాయిలాండ్‌లకు చెందిన వారు నలుగురు చొప్పున ఉన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని భార్య రోహిణీ నీలేకని (55) గత కొన్నేళ్లలో నాలుగు కోట్ల డాలర్లను (సుమారు రూ.240 కోట్లు) సమాజసేవకు ఖర్చు చేశారని ఫోర్బ్స్ తెలిపింది. ఆర్ఘ్యం పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, భారత్‌లో భూగర్భ జల పరిరక్షణకు, పారిశుధ్యం మెరుగుకు పాటుపడే ప్రాజెక్టులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని పేర్కొంది. ఫార్మా ప్రముఖుడు అజయ్ పిరమల్ (58) గత నాలుగేళ్లలో పిరమల్ ఫౌండేషన్‌కు 60 లక్షల డాలర్లు (సుమారు రూ.36 కోట్లు) విరాళమిచ్చారని ఫోర్బ్స్ వివరించింది. ఈ జాబితాలో చోటు దక్కిన భారతీయుల్లో లుపిన్ సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ దేశ్ బంధు గుప్తా (75), సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆశిశ్ ధావన్ కూడా ఉన్నారు. -
ఐదు పబ్లిక్ ఇష్యూలకు సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా మరో పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకుంది. శ్రీరాం క్యాపిటల్‌లో 20% వాటాను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 2,014 కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించిం ది. తద్వారా ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో విస్తరించేందుకు వీలు చిక్కుతుందని కంపెనీ చైర్మన్ అజయ్ పిరమల్ చెప్పారు. శ్రీరాం క్యాపిటల్‌తో భాగస్వామ్యం ద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందన్నారు. గత నాలుగు దశాబ్దాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారానే కంపెనీ వృద్ధి బాటలో సాగిందని శ్రీరాం గ్రూప్ వ్యవస్థాపకులు ఆర్.త్యాగరాజన్ పేర్కొన్నారు. దీంతో తమ ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ భారీ వృద్ధిని అందుకుంటుందని తెలిపారు. గ్రూప్‌లోని శ్రీరాం ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, శ్రీరాం సిటీ యూని యన్ ఫైనాన్స్ సంస్థలకు హోల్డింగ్ కంపెనీగా శ్రీరాం క్యాపిటల్ వ్యవహరిస్తోంది. గతేడాదిలో కూడా పిరమల్ శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌లో 9.9% వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 1,636 కోట్లను చెల్లించింది. కాగా, ఈ నెల మొదట్లో వొడాఫోన్ ఇండియాలోగల 11% వాటాను యూకే మాతృ సంస్థ వొడాఫోన్‌కు రూ. 8,900 కోట్లకు విక్రయించింది. బీఎస్ఈలో పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేరు 1% లాభంతో రూ. 602 వద్ద నిలవగా, శ్రీరాం సిటీ యూనియన్ 1% బలపడి రూ. 1,215 వద్ద, శ్రీరాం ట్రాన్స్పోర్ట్ షేరు 3% ఎగసి రూ. 747 వద్ద ముగిశాయి.