AK Sharma
-
యూపీ ఎన్నికలు.. మోదీ కీలక నిర్ణయం!
లక్నో: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు మొదలయ్యాయా?. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా తన ఆప్తుడు, మాజీ ఐఏఎస్ అధికారి, ఏకే శర్మను సిఫార్సు చేశారు. దీంతో శర్మ నియామకాన్ని పార్టీ అధిష్టానం ధృవీకరిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ శనివారం కీలక పదవులకు సంబంధించిన నేతల పేర్లను ప్రకటించారు. శర్మతో పాటు రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా లక్నోకు చెందిన అర్చనా మిశ్రా, బులంద్ షహర్‌కు చెందిన అమిత్ వాల్మీకిని నియమిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్లో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఏకే శర్మ.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కాగా, ఏకే శర్మ స్వస్థలం యూపీలోని మావ్. వైబ్రంట్ గుజరాత్ తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి చేరువయ్యాడు శర్మ. ఆమధ్య తన నియోజకవర్గం వారణాసిలో కరోనా సమీక్ష కోసం శర్మనే, నరేంద్ర మోదీ పంపడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈమధ్య యూపీ కేబినేట్ విస్తరణ ఊహాగానాల్లో ఏకే శర్మకు స్థానం దక్కుతుందని అంతా భావించారు కూడా. ఇక తన నియామకంపై ఏకే శర్మ ప్రధానికి, పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. పార్టీని పటిష్టం చేయడంపై చర్చించామన్నారు. కాగా, వీరిది మర్యాదపూర్వక భేటీ అని అధికార వర్గాలు తెలిపాయి. యోగి హయాంలో యూపీ పాలనపై, కరోనా కట్టడిలో విఫలమయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం మార్పులు చేయబోతోందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అదంతా మీడియా సృష్టేనని బీజేపీ నేతలు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తేల్చేశారు. చదవండి: యోగికి బెదిరింపు కాల్ -
త్వరలో మంత్రివర్గ విస్తరణ.. డిప్యూటీ సీఎంగా ప్రధాని సన్నిహితుడు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో వేడి మొదలైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మాజీ ఐఎఎస్, ప్రస్తుత ఎమ్మెల్సీ... ప్రధాని మోదీకి సన్నిహితుడైన ఏకె శర్మను యూపీ డిప్యూటీ సీఎంగా చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే ఇటీవల పూర్వాంచల్, వారణాసి ప్రాంతాల్లో శర్మ చేసిన కోవిడ్ నిర్వహణను మోదీ స్వయంగా ప్రశంసించారు. మంత్రివర్గ విస్తరణలో ఐదుగురు కొత్తవారికి అవకాశం ఇవ్వనుండగా, ఏడుగురు మంత్రులను తొలగించే అవకాశాలున్నాయి. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లోని ముగ్గురు మంత్రులు చేతన్ చౌహాన్, కమలా రాణి, విజయ్ కశ్యప్ ఇటీవల కరోనా బారినపడి మరణించారు. అటువంటి పరిస్థితిలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, రాబోయే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి సహాయపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కేబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రులతో కలిసి మొత్తం 60 మంది మంత్రులు ఉండవచ్చు. యోగి కేబినెట్లో 56 మంది మంత్రులు ఉండగా.. అందులో ముగ్గురి మరణంతో ఇప్పుడు మంత్రివర్గంలో 7 ఖాళీలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సామాజిక సమీకరణాలను చక్కదిద్దేందుకు కమలదళం సిద్ధమైందని సమాచారం. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంలోని ఏడుగురు మంత్రులపై ఫిర్యాదులు ప్రధాని కార్యాలయానికి చేరుకున్నాయి. ఆ శాఖల్లోని అవినీతి, ఇతర లోపాల గురించి సమాచారం వెలుగులోకి వచి్చంది. అటువంటి పరిస్థితిలో త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కొంతమంది మంత్రులను తొలగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. -
కోర్టులో ఓ మూలన కూర్చోండి
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ఓ అధికారిని బదిలీ చేసిన ఘటనలో కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే ఒక మూలన కూర్చోవాలంటూ ఆదేశించింది. అంతేకాదు సాయంత్రం కోర్టు సమయం ముగియక ముందే మరోసారి వెళ్లేందుకు అనుమతి అడగ్గా.. రేపటి వరకూ కోర్టులోనే ఉంటారా.. అంటూ ఆగ్రహించింది. బిహార్‌లోని వసతిగృహాల్లో బాలికలపై లైంగిక దాడికి సంబంధించిన ఘటనలపై విచారణ జరుపుతున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మను అప్పటి సీబీఐ డైరెక్టర్ అయిన ఎం.నాగేశ్వరరావు బదిలీ చేశారు. అయితే ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమి తులైన సమయంలోనే ఎటువంటి బదిలీలు చేయడానికి వీల్లేదని కోర్టు అప్పట్లో పేర్కొంది. అయితే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఆయన బదిలీ చేశారు. దీనికి సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టులో సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు తమ ఉత్తర్వులను ధిక్కరించారని, ఇందుకు గాను ఆయనకు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. నాగేశ్వరరావుతోపాటు సీబీఐ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరాం కూడా దోషేనని పేర్కొంటూ ఆయనకూ జరిమానా విధించింది. అలాగే కోర్టు సమయం పూర్తయ్యే వరకు కోర్టు ప్రాంగణంలోనే ఓ మూలన కూర్చోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎల్ఎన్ రావు, సంజీవ్ కన్నాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు వారిరువురు సుప్రీం కోర్టుకు చెప్పిన క్షమాపణలను సైతం న్యాయస్ధానం తోసిపుచ్చింది. కోర్టుకు ఏదైనా చెప్పుకునే అవకాశం ఇస్తామని, అయితే దీనికోసం వారు 30 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చని అని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ఏమైనా చెబుతారా అంటూ వారిద్దరిని ప్రశ్నించింది. ఈ సమయంలో సీబీఐ తరఫున వాదిస్తున్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయలేదని, ఇందుకు ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పినట్లు ఆయన న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కోర్టు అనుమతి లేకుండా విచారణ అధికారిని బదిలీ చేయకూడదని నాగేశ్వరరావుకి తెలుసని, తాను ఏది అనుకున్నానో అదే చేశాను అనేలా ఆయన ధోరణి ఉందని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సాయంత్రం వరకూ కోర్టులోనే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అదనపు డైరెక్టర్ నాగేశ్వరరావు, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరామ్‌లు సాయంత్రం కోర్టు వేళలు ముగిసే వరకు కోర్టులోనే గడిపారు. అనంతరం కోర్టు నుంచి వెళ్లి పోయారు. -
మాల్యా కేసు : టాప్ సీబీఐ ఆఫీసర్‌పై ఆరోపణలు
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారంలో ఒక్కొక్కరూ బుక్కవుతున్నారు. తాను దేశం విడిచి పారిపోవడం అరుణ్ జైట్లీకి తెలుసని మూడు రోజుల క్రితం విజయ్ మాల్యా వెల్లడించగా.. సీబీఐ అధికారుల అలసత్వం ప్రదర్శించడంతోనే మాల్యా పరారైనట్టు నిన్న సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దావే ఆరోపించారు. తాజాగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ వల్లే విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోగలిగాడని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. మాల్యా కోసం ఇచ్చిన లుక్ ఔట్ నోటీసులను ఆయన బలహీనపరిచే పారిపోయేందుకు కారణమయ్యారని రాహుల్ శనివారం ట్వీట్ చేశారు.ఇదే అధికారి నీరవ్ మోదీ, మెహుల్ చోస్కీల పరారీ ప్రణాళికల కోసం పని చేశారని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీ ఎంతో ప్రత్యేకంగా చూసే శర్మ గుజరాత్ కేడర్ అధికారని విపక్ష నేత విమర్శించారు. వూప్సూ... ఇన్వెస్టిగేషన్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. CBI Jt. Director, A K Sharma, weakened Mallya’s “Look Out” notice, allowing Mallya to escape. Mr Sharma, a Gujarat cadre officer, is the PM’s blue-eyed-boy in the CBI. The same officer was in charge of Nirav Modi & Mehul Choksi’s escape plans. Ooops... investigation! — Rahul Gandhi (@RahulGandhi) September 15, 2018 అయితే ఈ ఆరోపణలను సీబీఐ కొట్టిపారేసింది. అవన్నీ నిరాధారమని పేర్కొంది. ‘సీబీఐ సీనియర్ అధికారులపై కొంతమంది వ్యక్తులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి లేదా అదుపులోకి తీసుకోవడానికి అప్పటికీ సీబీఐ వద్ద అవసరమైన ఆధారాలు లేవు. ఆ కారణంతోనే మాల్యాకు వ్యతిరేకంగా జారీ చేసిన లుక్ అవుట్ నోటీసును మార్చాలని నిర్ణయం తీసుకున్నాం’ అని సీబీఐ అధికార ప్రతినిధి చెప్పారు. హై ప్రొఫైల్, వివాదాస్పదమైన కేసులో ప్రధాని ఆమోదం లేకుండా లుక్ ఔట్ నోటీసులను సీబీఐ మార్చడం ఎలా సాధ్యమని రాహుల్ సంధించిన ప్రశ్నలపై సీబీఐ అధికారి ఈ విధంగా స్పందించారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి వ్యవహారంపై కూడా స్పందించిన సీబీఐ అధికార ప్రతినిధి... ‘వారు దేశం విడిచి పారిపోయిన నెల తర్వాత సీబీఐకు నీరవ్, చోక్సిల విషయంపై పీఎన్బీ నుంచి ఫిర్యాదు పొందింది. వారు దేశం విడిచి పారిపోవడానికి సీబీఐ అధికారి కారణం అనడానికి ఎలాంటి ఆధారం లేదు. బ్యాంక్ నుంచి ఫిర్యాదు పొందిన వెంటనే, సీబీఐ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది’ అని తెలిపారు. ఏకే శర్మ ప్రస్తుతం అదనపు డైరెక్టర్ విభాగం, అవినీతి నిరోధక యూనిట్లలో పనిచేస్తున్నారు. ఎంతో కీలకమైన కేసుల మాత్రమే ఆయన చూసుకుంటారు. శర్మ, గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. -
హవాలా వ్యాపారులపైకి సీబీఐ అస్త్రం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో హవాలా వ్యాపారం పెరగడంతో ప్రభుత్వం సీబీఐని రంగంలోకి దింపింది. నవంబరు 8 అనంతరం భారీగా నగదు జమ అయిన బ్యాంకు ఖాతాలను పరిశీలించి అక్రమార్కులను గుర్తించే బాధ్యతను సీబీఐకి అప్పగించింది. ఇందుకోసం గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఏకే అరుణ్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ)కి వచ్చే ఫిర్యాదులనూ ఈ బృందమే స్వీకరిస్తుంది. ప్రస్తుతం శర్మ సీబీఐలో ‘బ్యాంకింగ్ సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్స్ సెల్’విభాగాధిపతిగా ఉన్నారు.