ప్రేమలో ఎక్కడున్నారు?
కాలేజీలో ప్రేమికులైన ఓ అమ్మాయి, ఓ అబ్బాయి చదువు పూర్తయ్యాకా వేర్వేరు ప్రదేశాలకు వెళతారు. వీళ్లు ప్రేమలో ఎంత దూరం వెళ్లారు? ఎలా ఒక్కట య్యారనే కథతో రూపొందుతోన్న సినిమా ‘అక్కడ అబ్బాయి–ఇక్కడ అమ్మాయి’.
బొంతు సాయి, సూర్య, చైతన్య, దేవిక, శ్రావణి, తేజా రెడ్డి ముఖ్య తారలుగా రాజేశ్ యడమ దర్శకత్వంలో ఎస్. త్రివిక్రమ్ నిర్మిస్తున్నారు. ‘‘స్నేహం, ప్రేమ ప్రధాన అంశాలుగా తీస్తున్న చిత్రమిది. జూన్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: వీఎస్ఎన్.