'అఖిల్ మృతిపై అనుమానాలున్నాయి'
కృష్ణా జిల్లా నిడమనూరులోని నారాయణ కళాశాల విద్యార్థి అఖిల్‌రెడ్డి ఆత్మహత్యపై అతడి తండ్రి సందేహాలు వ్యక్తం చేశారు. తన కుమారుడు మృతిపై అనుమానాలున్నాయని, ఎలాంటి అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కూడా లేవన్నారు. నారాయణ కాలేజీ యాజమాన్యం రకరకాల కథలు చెప్పుతోందని ఆయన అన్నారు. అఖిల్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మంత్రి నారాయణకు చెందిన కాబట్టి తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని అన్నారు. కాగా అఖిల్ రెడ్డి మృతదేహానికి శనివారం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయింది. నిన్న సాయంత్రం అఖిల్ కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.