యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
మాసబ్‌ట్యాంక్: ప్రధాని నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే మాట్లాడతాడని అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అమరేందర్ సింగ్ రాజ బరార్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద గల కట్టమైసమ్మ దేవాలయం నుంచి ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్‌కుమార్ యాదవ్, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంఘి రెడ్డి పాల్గొన్నారు.