Akshya Patra
-
మా అభివృద్ధి ఆడంబరం మాత్రం కాదు: ప్రధాని మోదీ
వారణాసి: బీజేపీ హయాంలో అభివృద్ధి అనేది కేవలం ఆడంబరం మాత్రమే కాదని.. చేతల్లోనూ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో మహా వంటశాలను గురువారం ప్రధాని మోదీ ప్రారంభించారు. లక్ష మందికి వంట చేయగల సామర్థం ఉన్న మెగా కిచెన్‌ను.. వారణాసిలోని ఎల్టీ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా దృష్టిలో అభివృద్ధి అంటే.. పేదలు, అణగారిన, వెనుకబడిన, గిరిజన, తల్లులు మరియు సోదరీమణుల సాధికారత అని ప్రధాని మోదీ ప్రకటించారు. అర్హులైన వాళ్లకు పక్కా ఇళ్లు, ప్రతీ ఇంటికి మంచి నీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. అక్షయ పాత్ర సంస్థ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ సంస్థ ఈ యంత్ర సహిత వంటశాల ద్వారా 150 పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇలాంటి భారీ సామర్థ్యం ఉన్న కిచెన్ లతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రజల మధ్య ఉండడం తనకెప్పుడూ సంతోషం కలిగిస్తుందని తెలిపారు. Projects being launched in Varanasi will give momentum to the city's development journey, further 'Ease of Living.' https://t.co/mn0liHoPSu — Narendra Modi (@narendramodi) July 7, 2022 -
ఈ అక్షయ పాత్రతో నీళ్లు తాగితే పాము కాటు వేసిన ఏం కాదు!
సాక్షి, జగిత్యాలక్రైం: అక్షయపాత్ర కొనుగోలు చేసి, ఇంట్లో పెట్టుకుంటే కోటీశ్వరులు అవుతారని గ్రామీణ ప్రాంతాల్లో అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న ముఠాను జగిత్యాల పట్టణ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. టౌన్ సీఐ జయేశ్‌రెడ్డి, జగిత్యాలరూరల్ సీఐ కృష్ణకుమార్ల వివరాల ప్రకారం.. జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్‌కు చెందిన కడప శ్రీనివాస్ జగిత్యాల బీట్‌బజార్‌కు చెందిన రాయిల్ల సాయికుమార్‌ను సంప్రదించాడు. అతను హైదరాబాద్‌కు చెందిన దండె కార్తీక్, బవికుమార్, మంచిర్యాలకు చెందిన బోడకుంట మురళీమనోహర్, ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన యాదగిరి అఖిల్కుమార్లను శ్రీనివాస్ వద్దకు తీసుకువచ్చాడు. మహిమ గల అక్షయపాత్ర తమ వద్ద ఉందని, ఇందులో నీరు పోసుకొని ప్రతిరోజూ ఉదయం కుటుంబసభ్యులందరూ తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. పాముకాటు వేసినా ఏం కాదని నమ్మించారు. పూజ గదిలో పెట్టి పూజిస్తే కోటీశ్వరులు అవుతారని పేర్కొన్నారు. రూ.5 లక్షలు ఇస్తే అక్షయపాత్ర ఇస్తామన్నారు. అనుమానం వచ్చిన శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జగిత్యాల టౌన్ సీఐ జయేశ్‌రెడ్డి, జగిత్యాలరూరల్ సీఐ కృష్ణకుమార్ బుధవారం రావుల సాయికుమార్ ఇంటికి వెళ్లారు. అతన్ని అదుపులోకి తీసుకొని, అక్షయపాత్ర స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన మిగతా సభ్యులను సైతం అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. -
‘అన్నపూర్ణ’.. అక్షయ పాత్ర!
సాక్షి, సిటీబ్యూరో: ఆకలిగొన్న అభాగ్యుల పాలిట నగరంలోని అన్నపూర్ణ క్యాంటీన్లు అక్షయ పాత్రగా నిలుస్తున్నాయి. అసహాయుల క్షుద్బాధను తీరుస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్‌తో వర్తక వ్యాపార, పారిశ్రామిక, విద్యాసంస్థలు మూతపడటంతో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదన్న సీఎం కేసీఆర్‌సూచన మేరకు, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పేదలు, వలస కార్మికులు, విద్యార్థులు, చిరుద్యోగుల ఆకలి తీర్చేందుకుజీహెచ్‌ఎంసీ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా రెగ్యులర్ అన్నపూర్ణ కేంద్రాలతో పాటు తాత్కాలిక, మొబైల్ అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్యను కూడా 342కు పెంచింది. వీటి ద్వారా సోమవారం ఒక్కరోజే 1,56,350 మందికి ఆహారాన్ని అందించినట్లు జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 41లక్షల 48వేల మందికి అన్నపూర్ణ భోజనం అందించినట్లు పేర్కొంది. అన్నపూర్ణ క్యాంటీన్లు, దాతలు అందించే భోజనం, నిత్యావసరాల పంపిణీ తదితరాలను నగర మేయర్ బొంతు రామ్మోహన్ రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సెంట్రల్ మానిటరింగ్ వింగ్‌కు 692 మంది దాతలు అందజేసిన 6,44,300 ఆహారం ప్యాకెట్లను మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ చేశారు. దాతల నుంచి ఆహారం, ఇతర నిత్యావసరాలు సేకరించి పంపిణీ చేసేందుకు పది మొబైల్ వాహనాలను వినియోగిస్తున్నారు. దాతల నుంచి భారీ స్పందన రావడంతో అధికారుల సూచన మేరకు 30 మంది వ్యాపారులు తమ టాటా ఏస్ వాహనాలను ఈ సేవల కోసం జీహెచ్ఎంసీకి ఉచితంగా కేటాయించారు. దీంతో దాతలు ఇస్తున్న భో జనం, నిత్యావసరాలను సేకరించి, సులభంగా పంపిణీ చేసే వెసులుబాటు కలిగినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఎందరో దాతలు.. జీహెచ్ఎంసీ సెంట్రల్ మానిటరింగ్ విభాగానికి దాతల ద్వారా ఇప్పటి వరకు 520 మెట్రిక్ టన్నుల బియ్యం, 2,864 రేషన్ కిట్స్, 60వేల బిస్కెట్స్ అండ్ కేక్స్, 4,500 లీటర్ల నూనె ప్యాకెట్లు, 2,500 లీటర్ల ఫ్లోర్ క్లీనర్, 3,100 గ్లౌజ్‌లు, 32,000 మాస్కులు, 4,500 కేజీల గోధుమ పిండి, 5,600 ఓట్స్ ప్యాకెట్లు, 1,364 పీపీఈ కిట్లు, 5,550 శానిటైజర్ బాటిళ్లు, 7,500 లీటర్ల శానిటైజర్ క్యాన్లు, 30 మెట్రిక్ టన్నుల పుచ్చకాయలు అందగా, వాటిని పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపింది. 2,500 లీటర్ల ఫ్లోర్ క్లీనర్‌ను వలస కూలీలు, యాచకుల సంరక్షణకు ఏర్పాటు చేసిన షెల్టర్‌హోంలను శుభ్రం చేసేందుకు వినియోగిస్తున్నారు. -
‘అక్షయపాత్ర’ కోసం సమంత ట్వీట్
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. రోజు తిండిలేక చనిపోయే వారెంతో మంది ఉన్నారు. ఎంతో మంది పిల్లలు సరైన భోజనం లేక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని సంస్థలు పని చేస్తున్నాయి. అనాథలు, స్కూల్ పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తున్నాయి. అక్షయపాత్ర అనే సంస్థ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంస్థకు సమంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఈ ఏడాది తన కుటుంబం వంద మంది స్కూల్ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించామని, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని, మీ వంతుగా కేవలం రూ.950 చెల్లిస్తే సరిపోతుందని, ఈ డబ్బుతో ఏడాది పాటు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందివచ్చని సమంత ట్వీట్ చేశారు. ఈ ఫౌండేషన్‌కు సంబంధించిన లింక్‌ను కూడా షేర్ చేశారు. This year our family is sharing our lunch with 100 schoolchidlren for an entire year! You too can join by just contributing just 950/-. That provides hot, tasty & nutritious lunch to a schoolchild for an entire year!https://t.co/jGi8v2QEap#iShareMyLunch#AkshayaPatra — Samantha Akkineni (@Samanthaprabhu2) June 22, 2018 -
అక్షయపాత్రపై ఆగ్రహం
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను అక్షయపాత్ర సంస్థకు అప్పజెప్పడాన్ని నిరసిస్తూ నాలుగు రోజులుగా మధ్యాహ్న భోజన వర్కర్లు దీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా మిగతా కార్మికులు దీక్ష శిబిరానికి తరలివచ్చారు. వారికి సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు తోడయ్యారు. అందరూ కలిసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకోగా.. గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. అయినా పట్టు వీడలేదు. చివరకు డీఆర్వో బయటకొచ్చి ఆందోళనకారులను శాంతింపజేశారు. చుంచుపల్లి : నియోజక వర్గంలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న వర్కర్లను కాదని కొత్తగా అక్షయపాత్రను ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్న భోజన వర్కర్లు ఆందోళన, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో అక్షయపాత్రను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా దీక్షలు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్ల దీక్షా శిబిరానికి వివిధ ప్రాంతాలకు చెందిన వర్కర్లు భారీగా తరలివచ్చారు. భారీ ఎత్తున అక్కడికి చేరుకున్న భోజన వర్కర్లతో సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాలు, వివిధ పార్టీల నేతలు కలెక్టరేట్ ముట్టడికి కదిలారు. అప్పటికే పరిస్థితులను అంచనా వేసిన పోలీసులు భారీ బలగాలను కలెక్టరేట్ వరకు ఏర్పాటు చేశా రు. దీక్షా శిబిరం నుంచి భారీగా భోజన వర్కర్లు కదంతొక్కడంతో వారిని కలెక్టరేట్ వరకు వెళ్లకుండానే వారించడానికి పోలీసు లు ప్రయత్నించడంతో తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులను, బారీకేడ్లను తొలగించుకొని కలెక్టరేట్ గేటువద్దకు వర్క ర్లు చేరుకున్నారు. గేట్లు నెట్టుకొని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వర్కర్లను పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇవ్వాలని మధ్యాహ్న భోజన వర్కర్లు నినాదాలు చేశారు. పరిస్థితులను గమనిం చిన డీఆర్వో కిరణ్‌కుమార్ బయటకు వచ్చి కార్మికుల సమస్యలను విన్నారు. తమకు న్యాయం జరిగేవరకూ ఇక్కడి నుంచి కదలమని చెప్పడంతో డీఆర్వో కలుగచేసు కొని కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళతానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించుకున్నారు. మధ్యాహ్న భోజన వర్కర్లకు అన్యాయం జరిగితే సహించేది లేదు: నాయకులు మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు అప్పజెప్పి వర్కర్ల పొట్టగొట్టాలని ప్రభుత్వం చూస్తుందని, వారికి అన్యా యం జరిగితే సహించేది లేదని శుక్రవారం మధ్యాహ్న భోజన వర్కర్ల దీక్ష శిబిరానికి హాజరైన పలు పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 17ఏళ్లుగా అనేక వ్యయ ప్రయాసలకు లోనవుతూ పథకాన్ని నిర్విరామంగా నడుపుతున్నా రని అన్నారు. ఎమ్మెల్యే, కలెక్టర్ ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో దాదాపు మూడు వేల మంది మధ్యాహ్న భోజన వర్కర్ల జీవితాలు రోడ్డు పడనున్నా యని అన్నారు. మానుకోని పక్షం లో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మాజీ మంత్రి వనమావెంకటేశ్వరరావు, వనమా రాఘ వ, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, జేఏసీ చైర్మన్ మల్లెల రామనాథం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య మాట్లాడారు. జిల్లా కార్యదర్శి కొండపల్లి శ్రీధర్, బ్రహ్మచారి, తాటిపర్తి అనిల్, భూక్యా రమేష్, జి.రాజు, వీరన్న, వాసం రామకృష్ణ, నలమలపు సత్యనారాయణ, మధ్యాహ్న భోజన వర్కర్లు రాధమ్మ, జైతున్భీ, చిట్టెమ్మ, ధనలక్ష్మి, చిలకమ్మ, రాధమ్మ, భాగ్య, మాళవిక,స్వరూప, మధ్యాహ్న వర్కర్లు పాల్గొన్నారు. -
లాభంలో 2 శాతం సామాజిక కార్యక్రమాలకే
ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి జైపూర్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలకు ప్రతి ఏటా నికర లాభంలో రెండు శాతానికి పైగా ఖర్చు చేయడమే స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఉద్దేశమని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. గతంలో లాభంలో ఒక శాతాన్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగించామని చెప్పారు. సీఎస్ఆర్లో భాగంగా స్కూలు బస్సు, అంబులెన్సు, సోలార్ ప్యానెళ్లను అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ అండ్ జైపూర్ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. సమాజ సేవకు నికర లాభంలో రెండు శాతానికిపైగా ఈ ఏడాది నుంచే ఖర్చు చేస్తామని తెలిపారు.