akupamula
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఆకుపాముల(మునగాల): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన 65వ నంబర్ జాతీయ రహాదారిపై మునగాల మండలం కుపాముల శివారులో గంగమ్మ గుడి ఎదురుగా మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన షేక్ షరీఫ్(53) నడిగూడెం మండల కేంద్రంలో వైన్‌షాపులో క్యాషియర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగ మంగళవారం రాత్రి 11గంటలకు తన విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై నడిగూడెం నుంచి కోదాడకు వెళుతూ మార్గమధ్యలో ఆకుపాముల శివారులో ఆగ ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో షరీఫ్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు షేక్ ఖరీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆకుపాముల సర్పంచ్ ఉప ఎన్నిక ఏకగ్రీవం?
మునగాల: మండలంలోని ఆకుపాముల సర్పంచ్ లిక్కి నాగేశ్వరరావు గత యేడాది గండెపోటుతో అకాల మృతి చెందడంతో ఏర్పడిన ఖాళీని పూరించేందుకు జిల్లా కలెక్టర్ ఇటీవల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఉప ఎన్నికకు ఎంపీడీఓ సర్వం సిద్ధం చేశారు. ఈనెల 26నుంచి ఉప ఎన్నికకు నామినేషన్లు స్వీకరించండం ప్రారంభించారు. ఈ ఉప ఎన్నికకు అదేరోజు గ్రామానికి చెందిన సుంకి జయచంద్రారెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. నేటి వరకు ఇంకెవరు నామినేషన్ దాఖలు చేయలేదు. ఇదిలా ఉండగా సర్పంచ్ పదవిలో ఉండి మృతి చెందిన టీఆర్ఎస్ నాయకుడు లిక్కి నాగేశ్వరరావు స్థానంలో ఆయన కుటుంబసభ్యులకు అవకాశం ఇవ్వాలని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కోదాటి అరుణ కోరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆదివారం సమావేశమై ఉప ఎన్నికల్లో పోటీపెట్టకుండా ఉండాలని తీర్మానం చేసింది. దీంతో ఉప ఎన్నికను ఏకగ్రీవంగా చేసేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ముందుకు వచ్చాయి. ఈసందర్భంగా ఏకగ్రీవం చేసుకునేందుకు ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మండల పార్టీ అధ్యక్షురాలు అరుణ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్, నాయకులు వి.రామరాజు, పి.వెంకటేశ్వర్లు, పి.నాగేశ్వరరావు, కేసగాని వెంకటేశ్వర్లు, వి.రామిరెడ్డి, జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఈ చలివేంద్రానికి 30 ఏళ్లు!
ఒకటికాదు రెండు కాదు.. గత 30 ఏళ్లుగా స్వగ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటుచేస్తూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.. ఆకుపాముల గ్రామ సర్పంచ్ లిక్కి నాగేశ్వరరావు! తన తల్లిదండ్రులు లిక్కి వెంకయ్య, మదారమ్మల ఙ్ఞాపకార్ధం ప్రతియేటా బస్టాండ్ సెంటర్లో వేసవిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మునగాల జడ్పీటీసీ సభ్యుడు కోల ఉపేందర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా 30ఏళ్లుగా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చుతున్న నాగేశ్వరరావును పలువురు కొనియాడారు. -
కారు, లారీ ఢీ ఇద్దరికి తీవ్ర గాయాలు
మునగాల: నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అదే దారిలో వెళ్తున్న లారీని శనివారం మద్యాహ్నం ఢికొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన వాళ్లు హైదరాబాద్ సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన మహేష్ బాబు, ఆయన భార్య గీతగా గుర్తించారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సుర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న వాళ్ల కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. గత నెలలో ఇదే ప్రాంతంలో నందమూరి జానకి రామ్ కారు ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే.