పోలీసుల మందుపార్టీ, వీడియో లీక్
నల్గొండ : ఓ వైపు విమర్శలు వస్తున్నా...మరోవైపు పోలీసులు మాత్రం తమ తీరు మార్చుకోవటం లేదు. విధుల్లో ఉన్నామనే విషయాన్ని మర్చిపోతూ ప్రవర్తించటం విమర్శలకు తావిస్తోంది. అసలు విషయానికి వస్తే నల్గొండ జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు మందు పార్టీ చేసుకున్నారు. తప్పతాగి రెస్ట్రూంలో చిందేశారు. గుడుంబా తయారీకి వత్తాసు పలికిన పోలీసులు నల్లబెల్లం వ్యాపారితో కలిసి స్టేషన్ ఆవరణలోనే జల్సా చేశారు. డాన్సులతో ఇరగదీశారు. కాగా సీనియర్ల తీరును నిరసిస్తూ జూనియర్ సిబ్బంది...ఆ జల్సా పార్టీ వీడియోను లీక్ చేశారు. మరోవైపు ఆలేరు పోలీసుల జల్సాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.