aleru police station
-
ఆలేరు పోలీస్ స్టేషన్లో సిట్ విచారణ
ఆలేరు (నల్లగొండ) : వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం ఏర్పాటైన సిట్ బృందం బుధవారం నల్లగొండ జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించింది. అక్కడి సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. ఉదయం 7 గంటలకు వచ్చిన ఐదుగురు సభ్యుల విచారణ బృందం మధ్యాహ్నం 2.30 గంటల వరకు అక్కడే ఉంది. వికారుద్దీన్‌తోపాటు మరో నలుగురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసిన బస్సును ఆలేరు స్టేషన్లోనే ఉంచారు. ఆ బస్సును విచారణ అధికారులు పరిశీలించారు. గత నెల 7న వికారుద్దీన్, మరో నలుగురు ఉగ్రవాదులను విచారణ కోసం వరంగల్ కేంద్ర కారాగారం నుంచి హైదరాబాద్ కోర్టుకు తీసుకువస్తుండగా... ఆలేరు సమీపంలోకి రాగానే వారు తప్పించుకునేందుకు యత్నించగా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీనిపై ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ స్వయంగా సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సిట్ బృందంలో సందీప్‌శాండిల్య (ఐజీ), రవికుమార్(ఐజీ), షానవాజ్ ఖాసిం (ఖమ్మం ఎస్పీ), రవీందర్ (హుమాయూన్ నగర్ సీఐ)తోపాటు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన రాధా వెంకట్‌రెడ్డి ఉన్నారు. వీరి వెంట భువనగిరి డీఎస్పీ మోహన్‌రెడ్డి కూడా ఆలేరు స్టేషన్‌కు వచ్చారు. -
వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై పీఎస్‌లో ఫిర్యాదు
-
ఆలేరు పీఎస్ లో వికారుద్దీన్ తండ్రి ఫిర్యాదు
నల్లగొండ : వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై ఆలేరు పోలీస్ స్టేషన్లో అతని తల్లిదండ్రులు శనివారం ఫిర్యాదు చేశారు. వికారుద్దీన్ తండ్రి మహ్మమద్ అహ్మద్ తో పాటు ఎన్కౌంటర్లో మృతి చెందిన అనీఫ్ సోదరుడు కూడా పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, పోలీసులతో పాటు ఎస్కార్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వికారుద్దీన్ తండ్రి డిమాండ్ చేశారు. కాగా వరంగల్-నల్లగొండ జిల్లా సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ అయిన విషయం తెలిసిందే. డీజేఎస్ వ్యవస్థాపకుడు, సిమి తీవ్రవాది వికారుద్దీన్ (38) తో పాటు అతని అనుచరులు సయ్యద్ అమ్జద్, ఎండీ జకీర్, ఎండీ హనీఫ్, జొహర్‌ఖాన్‌లు హతమయ్యారు. వరంగల్ జిల్లా సెంట్రల్ జైలునుంచి ఓ కేసు నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.