మస్తు ఫీచర్లతో మడత ఫోన్లు..ఇరగదీస్తున్నాయిగా
సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ దూకుడు పెంచింది. అదిరిపోయే ఫీచర్లతో కాంపీటీటర్ల ఫోన్లకు పోటీగా మడత (ఫోల్డబుల్ ) ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భారత్ మినహాయించి వరల్డ్ వైడ్ గా ఆగస్ట్ 11న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 మడత (ఫోల్డబుల్ ) ఫోన్లతో పాటు గెలాక్సీ బడ్స్ 2, గెలాక్సీ వాచ్ 4 సిరీస్‌లను విడుదల చేయగా.. ఈ ఫోల్డబుల్ ఫోన్లను ఇండియాలో ఆగస్ట్ 20న బాలీవుడ్ హీరోయిన్ ఆలియా బట్ చేతులు మీదిగా మార్కెట్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఫీచర్స్
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఫోన్ బుక్ టైప్ లో ఉంటుంది. అంటే మీరు ఈ ఫోన్ టాబ్లా లేదంటే ఫోన్లా యూజ్ చేసుకోవచ్చు.ఆపరేట్ చేసేందుకు ఎస్ పెన్ స్టైలస్ ఫోన్ తో పాటు వస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ లోని ఫీచర్లు ఇతర స్మార్ట్ ఫోన్ల కంటే భిన్నంగా ఉన్నాయి. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, ఎఫ్ 1/8 వైడ్ యాంగిల్ లెన్స్ తో 12 మెగాఫిక్సెల్ ప్రైమరీ షూటర్, 12 మెగాఫిక్సెల్ ఆల్ట్రావైడ్, 12 మెగా ఫిక్సెల్ టెలీ ఫోటో షూటర్స్ సదుపాయం ఉంది. హై క్వాలిటీ వీడియోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజటిన్ ఫీచర్స్ తో పాటు ఫ్రంట్ ఎండ్ 10 మెగా ఫిక్సెల్ షూటర్, వెనుక భాగంలో 4 మెగా పిక్సెల్ కెమెరాలతో అట్రాక్ట్ చేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3
ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ లో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.1,33,600 గా ఉండగా.. భారత్ లో మాత్రం ఆ ఫోన్ల ధరల్లో మార్పులుండొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫీచర్స్
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 రేర్ కెమెరా సెటప్,12మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్, ఫ్రంట్ ఎండ్ లో ఎఫ్/2.4 లెన్స్ తో 10 మెగాపిక్సెల్‌తో అందుబాటులోకి రానుండగా. ఈ ఫోన్ కి ఎస్ పెన్ స్టైలస్ ను వినియోగించలేము.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 యూఎస్ మార్కెట్ లో రూ.74వేలు ఉండగా.. ఆగస్ట్ 20 న విడుదలయ్యే ఈ ఫోన్ ఖరీదు ఇండియాలో ఎంతుండొచ్చనేది తెలియాల్సి ఉంది.