‘అల్కబీర్’పై చర్యలు తీసుకోవాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ: రుద్రారంలోని అల్కబీర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ మట్లాడుతూ పరిశ్రమలో వేతన ఒప్పద కాలం ముగిసి 20 నెలలు కావొస్తున్నా యాజమాన్యం నూతన వేతన ఒప్పదం చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు.
డిప్యూటీ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో జరిగిన చర్చలు అసంపూర్తిగా నిలిచాయని, ఈ నెల 4 నుంచి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో ధర్నాకు దిగామన్నారు. అనంతరం డీఆర్వోకు వినతి పత్రం అందజే«శారు. ధర్నాలో పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.