ఆల్ ఇన్ ఆల్ అళగురాజా
ప్రతి ఏడాదీ దసరా, దీపావళి, సంక్రాంతి పండుగ పర్వదినాల్లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది దీపావళికి ముగ్గురు స్టార్ హీరోల చిత్రాలు బరిలోకి దిగనున్నాయి. వీటిలో అజిత్ ఆరంభం, విశాల్ పాండియనాడు, కార్తీ ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా ఉన్నాయి. ఆరంభంపై భారీ అంచనాలు ఉన్నాయి. అజిత్, నయనతార, ఆర్య, తాప్సీ, తెలుగు నటుడు రానా ఇలా క్రేజీ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం సమర్పణలో శ్రీసాయి ఫిలింస్ సంస్థ నిర్మించింది. బిల్లా తర్వాత అజిత్, విష్ణువర్దన్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
ఈ చిత్రం దీపావళికి రెండు రోజులు ముందు (ఈ నెల 31వ తేదీ) విడుదల కానుంది. ఇప్పటి నుంచే అజిత్ అభిమానులలు కటౌట్లు, పూలమాలలు అంటూ కోలాహలానికి సిద్ధమవుతున్నారు. మరో చిత్రం పాండియనాడు. విశాల్ హీరోగా నటించి విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం పాండియనాడు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లక్కీ హీరోయిన్ లక్ష్మీమీనన్ విశాల్‌తో జతకట్టింది. డి.ఇమాన్ సంగీత స్వరాలందించిన పాండియనాడు షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ చిత్రమూ దీపావళి రేస్‌లో నిలవనుంది. పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన పాండియనాడుపైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక మూడవ చిత్రం ఆల్ ఇన్ ఆల్ అళగురాజా. కార్తీ, కాజల్ అగర్వాల్, రాధికా ఆప్తే, సంతానం, ప్రభు, శరణ్యా పొన్వన్నన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎం.రాజేష్ దర్శకుడు. ఈయన ఇంతకముందు దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు విజయం సాధించడంతో ఆల్ ఇన్ ఆలల్ అళగురాజాపై భారీ అంచనాలు ఉన్నారుు. ఎస్.ఎస్.తమన్ సంగీత బాణీలు కట్టిన పాటలకు మార్కెట్లో మంచి స్పందన వచ్చింది.