‘యెల్ది’ పుస్కకావిష్కరణ
సాక్షి, ముంబై: హైదరాబాద్లోని సారస్వత పరిషత్ హాలులో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం యెల్ది పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో అఖిల భారత పద్మశాలి సంఘం చైర్మన్, ముంబై వాస్తవ్యుడు యెల్డి సుదర్శన్ రచించిన గూఢచారి వదిన (యెల్డి సుదర్శన్ కథలు), యెల్డి మాణిక్యాలు (మినీ కథలు)లను డా. సి. నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
మసన చెన్నప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాంమూర్తి పద్మశాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఐఏఎస్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ వ్యాపావవేత్త చిలువేరు గంగాధర్ పద్మశాలి, ఎస్బీహెచ్ అధికారి నరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.