All India industrial exhibition
-
జనవరి 1నుంచి నుమాయిష్: ఈటల
గన్‌ఫౌండ్రీ: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు నుమాయిష్ వివరాలను మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. జనవరి 1 నుంచి 46 రోజులపాటు జరిగే 80వ నుమాయిష్‌ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్‌లు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బి.ప్రభాశంకర్, ఉపాధ్యక్షుడు ఎన్.సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రండి.. రండి.. దయచేయండి!
హైదరాబాద్: 79వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన–2019 (నుమాయిష్)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 1న ఈ నుమాయిష్ ప్రారంభం అవుతుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షత వహించే నుమాయిష్‌ను రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 15తో ప్రదర్శన ముగుస్తుంది. నిజాం స్టేట్‌లో ప్రారంభమైన ఎగ్జిబిషన్ సొసైటీ 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వివరాలను శనివారం ఈటల ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులతో కలసి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక వాతావరణం నెలకొల్పేందుకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీని స్థాపించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉత్పత్తి అయ్యే కళాఖండాలను ఇక్కడ ప్రదర్శించేందుకు వీలు కల్పించారు. ఈ ఏడాది 2,500 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రైవేట్ సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాళ్లను కేటాయించారు. ఈ సంస్థలు ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాయి. మెట్రో రైలు కళ... ఈ ఏడాది నుమాయిష్‌కు మెట్రో రైలు కళ సంతరించుకోనుంది. మియాపూర్ నుంచి నాంపల్లి, ఎల్బీ నగర్ నుంచి నాంపల్లికి మెట్రో రైలు సౌకర్యం ఉంది. సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ రాత్రి 11.30 గంటల వరకు మెట్రో సర్వీసులను అదనంగా నడిపేందుకు అధికారులు అంగీకరించారు. మెట్రో టికెట్లు కొనేందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని మూడు గేట్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉచిత పార్కింగ్... రాష్ట్ర ప్రభుత్వ చొరవతో నుమాయిష్‌కు ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల్లో ఇదొకటి. నుమాయిష్ చుట్టుప్రక్కల ఉండే ప్రభుత్వ శాఖల భవన సముదాయాల్లో పార్కింగ్ ఉచితంగా చేసుకోవచ్చు. గగన్ విహార్, చంద్రవిహార్, భీంరావ్ బాడా, గృహకల్ప, మనోరంజన్ కాంప్లెక్స్, అబ్కారీ భవన్ ఎదుట ఉచిత పార్కింగ్ స్థలాలుగా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వీటితో పాటుగా తాజ్ ఐల్యాండ్ నుంచి చంద్రవిహార్ వరకు ఉన్న రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో సందర్శకుల నుంచి కాంట్రాక్టర్లు ఇష్టానుసారం ధరలు నిర్ణయించి దోచుకునేవారు. లాభాపేక్షలేని సంస్థ ఇదిః ఈటల రాజేందర్ పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించడానికి ఎగ్జిబిషన్ సొసైటీని ప్రారంభించారని ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఎగ్జిబిషన్ నిర్వహణతో వచ్చే ఆదాయాన్ని 18 విద్యా సంస్థలకు వినియోగిస్తున్నామని చెప్పారు. గత 78 సంవత్సరాలుగా వచ్చిన ఆదాయంతో పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. కేసీఆర్ చొరవతో ఎగ్జిబిషన్‌ను మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా సరికొత్త సంస్కరణలను తీసుకువస్తున్నామన్నారు. కొనసాగనున్న రోజులు: 45 ప్రవేశ రుసుం: రూ.30 ఏర్పాటు చేసే మొత్తం స్టాల్స్: 2,500 మెట్రో రైలు సర్వీసులు: రాత్రి 11.30 వరకు పాల్గొననున్న వలంటీర్లు: 1,500 మంది -
ఎక్కడి శ్రీనగర్.. ఎక్కడి నాంపల్లి!
ఏడాదంతా వేచిచూసి.. ఆశలతో వచ్చినా కొనేవారు కరువు 'నుమాయిష్'ను కుదుపుతున్న నోట్ల రద్దు! ఎక్కడో జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి.. ఎన్నో ఆశలతో నగరానికి వచ్చాడు ఇంతియాజ్ అలీ. నాంపల్లిలో కొనసాగుతున్న 77వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)లో 'కశ్మీరీ ఎంబ్రాయిడరీ సెంటర్' పేరిట స్టాల్ ఏర్పాటుచేశాడు. ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం కోసం ఏడాది మొత్తం ఎదురుచూసి.. ఏర్పాట్లు చేసుకొని మరీ వచ్చాడు. కానీ, ఈసారి ఆయన స్టాల్‌ను చూసి.. అందులోని అద్భుతమైన ఎంబ్రాయిడీ ఉత్పత్తులను చూసి మురిసిపోయే వారే కానీ.. కొనేవారు మాత్రం కరువయ్యారు. కారణం పెద్దనోట్లరద్దు. డిమానిటైజేషన్ ఎఫెక్ట్‌తో ఇంతియాజ్ ఆశలు అడియాసలు అయ్యాయి. ఏడాదంతా వేచిచూసి.. మంచి గిరాకీ ఉంటుందన్న ఆశతో వస్తే.. నోట్లు రద్దు దెబ్బకు కొనేవాళ్లు కనిపించడం లేదు. 'ఈ ఎగ్జిబిషన్ కోసం మేం ఏడాదంతా వేచిచూస్తాం. గత 40 ఏళ్లుగా మా కుటుంబం ఇక్కడ స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నది. కానీ ఈ సంవత్సరం వ్యాపారం దారుణంగా పడిపోయింది. నిజానికి మేం కూడా పేటీఎంను వాడుతున్నాం. అయినా ఎవరూ ముందుకు రావడం లేదు' అని ఇంతియాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లిలో జరిగే నుమాయిష్‌తో ఇంతియాజ్ కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన తండ్రి, తాత ఈ ఎగ్జిబిషన్‌కు వచ్చి తమ ఉత్పత్తులను అమ్మారు. కానీ, ఈ ఏడాది 70శాతం వరకు వ్యాపారం పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఆయన చెప్తున్నారు. 'గత ఏడాది రోజుకు రూ. 25వేల వ్యాపారం చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు కేవలం తొమ్మిది వేలు అది వారాంతపు రోజుల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి' అని ఇంతియాజ్ తెలిపారు. నోట్లరద్దు ప్రభావంతో ఈసారి నుమాయిష్ తీవ్రంగా నష్టపోతున్నదని ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నారు. కార్డు వినియోగించేందుకు ఉద్దేశించిన వెండింగ్ మెషిన్లు ఉంటే ఎంతోకొంత వ్యాపారం జరుగుతున్నదని, అంతేకానీ పీటీఎం వంటి డిజిటల్ సౌకర్యాలు ఉన్నా జనాలు ముందుకురావడం లేదని అంటున్నారు. నిజానికి ఇది ఒక్క ఇంతియాజ్ పరిస్థితి మాత్రమే కాదు. దేశం నలుమూలల నుంచి నుమాయిష్‌కు తరలివచ్చే వ్యాపారులంతా ఈ ఏడాది నోట్లరద్దు ప్రభావంతో చితికిపోతున్నారు. ఇంత పెద్ద పారిశ్రామిక ప్రదర్శనలోనూ ఆశించినంత గిరాకీ, కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు సతమతమవుతున్నారు. -
నుమాయిష్.. లేడీస్ స్పెషల్
= మహిళలతో కిక్కిరిసిన ఎగ్జిబిషన్ = సందర్శించిన కేసీఆర్ సతీమణి, కుటుంబ సభ్యులు = అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు గన్ఫౌండ్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన 77వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) సందర్శకులతో కిటకిటలాడుతోంది. శుక్రవారం నుమాయిష్‌లో ప్రత్యేకంగా మహిళలకే ప్రవేశం కల్పించి మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి కె.శోభ, మనవడు, మనవరాలు ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఎగ్జిబిషన్‌ను సందర్శించి సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఇక ఆడ శిశువుల సంరక్షణకు విస్తృత ప్రచార, అవగాహన కార్యక్రమాలు కల్పించే విధంగా తగు ఏర్పాట్లు చేసినట్లు ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. ఎగ్జిబిషన్లో ఆరోగ్య ప్రదర్శన శాల స్టాల్‌ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంతో పాటు ఆడపిల్లల సంరక్షణకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ వై.లలితకుమారి, డిప్యూటీ డైరెక్టర్ నరహరి, అధికారులు జూపల్లి రాజేందర్, రామాంజనేయులు, మన్మథమ్మ, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జైళ్ల శాఖ స్టాల్ ప్రారంభం.. నుమాయిష్‌లో ఏర్పాటు చేసిన జైళ్ల శాఖ స్టాల్‌ను జైళ్ల శాఖ డీజీ వి.కె.సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీఐజీ నర్సింహారావు, చర్లపల్లి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి, చంచల్‌గూడ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్యామార్గం, వైస్ ప్రెసిడెంట్ బి.రాంచందర్‌రావు, సభ్యులు సుఖేష్‌రెడ్డి తదితరులు పోలీస్ సంక్షేమనిధికై రూ.10,52,500 చెక్కును సీపీకి అందచేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.