సాక్షి మెగా ఆటో షో అదుర్స్
విశాఖపట్నం: బైక్‌లు, కారులు, ఆటోలు కొత్త మోడళ్ల గురించి ఆరా తీయడానికి, నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి వచ్చిన సందర్శకులతో సాక్షి మెగా ఆటోషో కళకళలాడింది. కొనుగోలు చేయడానికే కాదు ...వాహనం ఏదైనా ఏ కంపెనీదైనా ఒకే వేదికపై పరిశీలించి బుక్ చేసుకొనే అవకాశం వచ్చింది. 'సాక్షి' ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని వుడా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రెండ్రోజుల ఆటోషో శనివారం ప్రారంభమైంది. రాష్ట్ర విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిని ప్రారంభించారు. వినియోగదారులకు అనుకూలంగా ఒకే వేదికపై ఎన్నో వాహనాలతో మెగా ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
డోంట్ మిస్ ..నేడు కూడా
ఎక్కడ : ఎంవీపీ కాలనీలోని వుడా గ్రౌండ్స్
ప్రవేశం : ఉచితం
వేళలు : ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు
బంపర్ బహుమతి: ఈ ఆటోషోలో ఏ వాహనం బుక్ చేసుకున్న వారికైనా లక్కీ డ్రాలో బజాజ్ ప్లాటినా బైక్‌ను గెలుపొందే అవకాశం