Allocation of houses
-
ఇళ్ల స్థలాల కేటాయింపుపై మీ విధానం ఏమిటి?
⇔ కేంద్రం సహా అన్ని రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు ⇔ దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉంటే బాగుంటుందన్న జస్టిస్ చలమేశ్వర్ ⇔ ఎమ్మెల్యేలు, ఐఏఎస్, విలేకరుల ఇళ్ల స్థలాల కేసు విచారణ ⇔ మే 2కు విచారణ వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ మూర్తులు, ఎమ్మెల్యేలు, ఐఏ ఎస్, ఐపీఎస్ అధికారులు, జర్నలిస్టులు, ఇతర వర్గాలు, క్రీడాకారులు తదితర వ్యక్తుల కు ఇళ్ల స్థలాల కేటాయిం పునకు సంబంధించి దేశవ్యా ప్తంగా ఏకరీతి విధానం ఉండడం మేలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఆయా వర్గాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొసైటీల పేరిట హైదరాబాద్లో స్థలాలు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు గతంలో తీర్పు ప్రకటిస్తూ ఈ పథకంలో లబ్ధిదారులు, వారి భార్యాపిల్లలపై జంటనగరాల పరిధిలో స్థలాలు, ఇళ్లు కలిగి ఉంటే ప్రభుత్వం స్థలాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం, సొసైటీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిం చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే స్వల్ప మార్పులు కోరుతున్నామని, ఈ దిశగా నూతన విధానం తెస్తామని, ఇందుకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దవే కోరారు. ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపిస్తూ సమాజంలోని పలుకుబడి కలిగిన వర్గాలకు మాత్రమే స్థలాలు కేటాయించి, ఇతరులపై వివక్ష చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని ఆక్షేపించారు. మరో న్యాయవాది నిరంజన్ తన వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ సంస్థలకు కాకుండా ఇతర సంస్థలు, సొసైటీలకు ఇవ్వాల్సి వస్తే ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల కేటాయించాలని ఇచ్చిన జీవోను ఉల్లంఘించి హౌజింగ్ సొసైటీకి ఔటర్ రింగ్ రోడ్డు లోపల స్థలాలు కేటాయించారని పేర్కొన్నారు. ఏకరీతి విధానం ఉండాలి.. నివాసం అనేది ప్రాథమిక అవసరంగా అభిప్రాయం వెలిబుచ్చిన జస్టిస్ చలమేశ్వర్.. ఈ విషయంలో ఏకరీతి విధానం ఉంటే బాగుంటుందని చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉందని, భూములు రాష్ట్ర పరిధిలోని అంశమే అయిన ప్పటికీ.. కేంద్రం ఒక ఉమ్మడి విధానం, ఉమ్మడి మార్గదర్శకాలు రూపొందించ వచ్చన్నారు. రాష్ట్రాలు సొసైటీలు, వ్యక్తులకు స్థలాల కేటాయింపుపై అనుసరిస్తున్న విధానం, దేశవ్యాప్తంగా ఏకరీతి విధానం అనుసరించేందుకు ఉన్న సానుకూలతలపై అభిప్రాయం తెలపాలని కేంద్రం, అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వారంలోగా అభిప్రాయం తెలపాలని ఆదేశించారు. విచారణను మే 2వ తేదీకి వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలాలను సొసైటీలు లబ్ధిదారులకు అందజేయడం ద్వారా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సొసైటీల తరపు న్యాయవాదులు కోరగా.. ఇందుకు జస్టిస్ చలమేశ్వర్ సుముఖత చూపినప్పటికీ.. వారు కేవలం అభివృద్ధి చేసుకునే అవకాశం కోరడం లేదని, ఓనర్షిప్ కోరుతున్నారని ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించి కేసును త్వరగా పరిష్కరిస్తామని ధర్మాసనం పేర్కొంది. -
‘నెట్టింట్లో’ చుట్టేస్తారు
* ప్రభుత్వ సాయంతో కట్టే ఇళ్లకు జియో టాగింగ్ * అక్రమాలను అరికట్టే దిశగా గృహ నిర్మాణ శాఖ అడుగులు ఏలూరు (టూ టౌన్) : ఒకే స్థలంపై రెండు మూడు రుణాలు.. ఒకే వ్యక్తి పేరుతో అదే స్థాయిలో బిల్లుల మంజూరు.. ఒకే ఇంటిపై ఇద్దరు లేదా ముగ్గురికి వేర్వేరు పథకాల్లో ఇళ్ల కేటాయింపు.. గృహ నిర్మాణ శాఖలో ఇలాంటి అక్రమాలు అన్నీఇన్నీ కావు. ఇకపై వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఆ శాఖ సమాయత్తమైంది. ఇందుకు జియో టాగింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా మన జిల్లాలో పెలైట్ ప్రాజెక్టు కింద లక్ష ఇళ్లను జియో టాగింగ్ విధానం ద్వారా ఆన్లైన్ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంజూరు చేసిన ఇళ్లలో 98 వేల ఇళ్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ ఇళ్లన్నీ నెట్టింట్లోకే.. ప్రభుత్వం ఐఏవై, ఇందిరమ్మ, ఆర్పీహెచ్, అర్బన్ పథకాల కింద జిల్లాలోని పేదలకు సబ్సిడీతో కూడిన గృహ రుణాలను మంజూరు చేసింది. వీటిలో చాలా యూనిట్లు అక్రమార్కులు దక్కించుకున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురికి ఇళ్లు కేటాయించిన సందర్భాలు అనేకం ఉన్నారుు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ గృహ నిర్మాణ శాఖ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు తీసుకున్న లబ్ధిదారుల వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడంతోపాటు ప్రతి ఇంటిని జియో టాగింగ్ పద్ధతిలో ఆన్లైన్ చేయూలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందారుు. పని మొదలుపెట్టాం గృహ నిర్మాణ శాఖ ద్వారా లబ్ధిపొందిన వారి ఆధార్ నంబర్లను అనుసంధానం చేయడంతోపాటు జియో టాగింగ్ విధానానికి శ్రీకారం చుట్టామని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో మొత్తం 2 లక్షల 37వేల 770 ఇళ్లను నిర్మించగా, 2 లక్షల 34వేల 500 ఇళ్లకు సంబంధించి ఆధార్ సీడింగ్, ఆన్లైన్ ప్రక్రియల్ని పూర్తి చేశామని చెప్పారు. లబ్ధిదారుల ఇళ్లను హౌసింగ్ ఏఈలో ఫొటోలు తీసి సిద్ధంగా ఉంచారన్నారు. ఈ వివరాలన్నిటితో లక్ష ఇళ్లకు జియో టాగింగ్ చేయనున్నామని వివరించారు. ఇది పూర్తి కాగానే మిగిలిన అన్ని ఇళ్ల వివరాలను, ఫొటోలను జియో టాగింగ్లో పొందుపరుస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఎవరెవరు సబ్సిడీతో కూడిన ఇంటి రుణాలు పొందారు, ఏ పేర్లతో తీసుకున్నారు, ఎక్కడ, ఎప్పుడు తీసుకున్నారనే వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తామని వివరించారు. తద్వారా అదే వ్యక్తులు భవిష్యత్లో ఎక్కడైనా అక్రమ పద్ధతుల్లో గృహ రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తే అడ్డుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. జియో టాగింగ్ విధానమంటే.. ఒక లబ్ధిదారుడు సబ్సిడీతో కూడిన రుణం తీసుకుని ఇల్లు కడితే అతని ఫొటోతోపాటు అతని ఇంటి ఫొటోను కూడా తీసుకుంటారు. ఆధార్ నంబర్, రేషన్ కార్డు వివరాలను అనుసంధానం చేస్తారు. ఇల్లు కట్టిన ప్రదేశం, సర్వే నంబర్, గ్రామం, మండలం తదితర వివరాలను సవివరంగా నమోదు చేస్తారు. ఇల్లు, లబ్ధిదారుడి ఫొటోలను అందులో పొందుపరుస్త్తారు. ఇవన్నీ ఆన్లైన్లో భద్రపరు స్తారు. భవిష్యత్లో గృహ రుణం తీసుకునేందుకు ఎవరు దరఖాస్తు చేసిన తక్షణమే ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. సదరు వ్యక్తి గతంలో సబ్సిడీతో కూడిన రుణం తీసుకుని ఉంటే ఆ వివరాలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతారుు. అలాంటి వారికి రుణాలు మంజూరు చేయకుండా జాగ్రత్త వహిస్తారు.