Alluru village
-
సీఎం కేసీఆర్కు గుడి
-నిర్మాణానికి పూనుకున్న అల్లూరు గ్రామస్తులు యైటింక్లయిన్కాలనీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరులో సీఎం కేసీఆర్కు గుడి నిర్మించేందుకు గ్రామస్తులు పూనుకున్నారు. గ్రామ రైస్ మిల్లుల సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో గుడి నిర్మించేందుకు శనివారం పూజలు నిర్వహించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వచ్చేనెల 29న పనులను ప్రారంభించనున్నట్లు గుడి నిర్మాణ కమిటీ చెర్మైన్ దుర్గం రాజేశం తెలిపారు. 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన రోజున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా గుడి నిర్మాణానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు దాసరి బాలరాజు, పులి రాకేష్, బాదె చినశ్రీనివాస్, దుర్గం ఆనంద్, జాగటి మల్లేష్, జాగటి నీలిమ, బాదె పద్మ, కంక మల్లేష్ పాల్గొన్నారు. -
ఎండ తీవ్రతకు ఇద్దరు కూలీలు మృతి
కృష్ణా జిల్లా : ఎండ తీవ్రతకు మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో మిర్చి కోతకు వెళ్లిన ఓ మహిళ ఎండ తీవ్రతకు తాళలేక చనిపోయింది. గ్రామానికి చెందిన మరియమ్మ(35) శనివారం స్థానిక రైతు చేనులో మిర్చి కోతకు వెళ్లింది. ఎండ తీవ్రతకు తాళలేక ఆమె మధ్యాహ్నంకల్లా నీరసించి అక్కడికక్కడే పడిపోయింది. ప్రథమ చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు విడిచింది. అలాగే శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం దూగనపుటుగ గ్రామానికి చెందిన రాజులమ్మ(60) శనివారం జీడి పిక్కలు తీసే పనికి వెళ్లింది. ఎండలో మధ్యాహ్నం వరకు పనిచేసిన ఆమె తీవ్ర నీరసం కారణంగా ఇంటికి చేరుకుంది. పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ప్రాథమిక చికిత్సకు తరలించారు. వైద్యం చేస్తుండగానే పరిస్థితి విషమించి రాజులమ్మ చనిపోయింది.