ALUR
-
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, నలుగురు మృతి
-
హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటి వద్ద రచ్చ రచ్చ
-
రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి : సీఎం వైఎస్ జగన్
-
ఆ గ్రామంలో 30 మందికి పోలీసు ఉద్యోగాలు
సాక్షి, చేవెళ్ల : ఇటీవల విడుదలైన పోలీస్ కానిస్టేబుళ్ల ఫలితాల్లో చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. గ్రామంలో 30 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో పి.సబితా, పూలపల్లి శివరాజు, వడ్డె భువనేశ్వరి, కె శ్రావణి, దాసరి నరేశ్, ఇతరులు ఉన్నారు. -
వీడీసీ తీర్మానం ఉపసంహరణ
ఆర్మూర్ : మండలంలోని ఆలూర్ గ్రామస్తులెవరూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో మాట్లాడొద్దంటూ నాలుగు రోజుల క్రితం వీడీసీ చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఆదివారం గ్రామంలో సమావేశమైన వీడీసీ ప్రతినిధులు జిల్లాలు, మండలాల ఏర్పాటు ప్రక్రియను చర్చించారు. అయితే దసరా రోజు మండలం ఏర్పాటు కాకపోవడంతో, సమాచార లోపంతో ఎమ్మెల్యేతో గ్రామస్తులు మాట్లాదవద్దని తీర్మానం చేశామన్నారు. ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఎంపీ కవిత విదేశీ పర్యటన నుంచి రాగానే ఆలూర్ మండల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో మండలాన్ని సాధించుకుంటామన్నారు. వీడీసీ సభ్యులు లింగారెడ్డి, రాజమల్లు, గంగారెడ్డి, మల్లయ్య, రాజన్న, గంగాధర్, శంకర్, ముత్తెన్న, మల్లేష్, గంగాధర్, గంగారాం, రాజన్న, గంగన్న ఉన్నారు. -
పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన
తాగునీరు, ఎంపీ కవిత, ఆలూర్, ఆర్మూర్ అర్బన్ : మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటిని అందజేయనున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. ఆలూర్‌లో సోమవారం మన ఊరు –మన ఎంపీ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ రాత్రి ఆలూర్‌లో పల్లెనిద్ర చేశారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యేతో కలిసి గ్రామంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామస్తులు తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. గ్రామంలో మొక్కలు నాటారు. గ్రామంలో రూ. కోటి 92 లక్షలతో చేపడుతున్న మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చే శారు. కార్యక్రమంలో సర్పంచ్ కళాశ్రీప్రసాద్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అటెండరే వైద్యుడు..
ఆలూర్(ఆర్మూర్‌రూరల్), న్యూస్‌లైన్ : ఆర్మూర్ మండలం ఆలూర్లోని పశువైద్యశాలలో సమయపాలన కరువైంది. ఇక్కడ పనిచేస్తున్న వైద్యురాలు శైలజ అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆస్పత్రి పరిధిలో ఆలూర్, మిర్ధాపల్లి, రాంపూర్, గగ్గుపల్లి గ్రామాలు వస్తాయి. సుమారు ఐదారు వేల గేదెలు, ఆవులు, మేకలు తదితర పశువులు ఈ గ్రామాలలో ఉంటాయి. రెండేళ్ల క్రితం పశు వైద్యురాలిగా ప్రభుత్వం శైలజను నియమించింది. పశువులకు చికిత్స చేయడానికి వైద్యురాలు గ్రామంలోనే నివాసం ఉండాల్సి ఉండగా, నిజామాబాద్‌లో ఉంటున్నారు. పశు వైద్యశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యురాలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వివిధ గ్రామాల నుంచి వచ్చే పశువులకు వచ్చే సీజనల్, గాలికుంటు వ్యాధులు, కృత్రిమ గర్భాధారణపై రైతులకు ఎలాంటి అవగాహన కల్పించడంలేదనే ఆరోప ణలున్నాయి. అలాగే ప్రతి రోజు వైద్యశాలలో వైద్యురాలు అందుబాటులో ఉండడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల సమాచారం మేరకు విలేకరులు సోమవారం పశువైద్యశాలకు ఉదయం 10 గంటలకు వెళ్లగా, వైద్యురాలు లేకపోవడంతో ఖాళీ కుర్చీ దర్శనమిచ్చింది. వారిని చూసిన అటెండర్ నర్సయ్య వెంటనే వైద్యురాలు శైలజకు ఫోన్ చేసి విలేకరులు వచ్చారని చెప్పాడు. దీంతో సెలవులో ఉన్నట్లు చెప్పమని ఫోన్లో సూచన చేయడంతో అటెండర్, వైద్యురాలు సెలవులో ఉన్నట్లు తెలిపాడు. పశువైద్యురాలు చేయాల్సిన చికిత్స అటెం డర్ నర్సయ్య చేస్తున్నాడని రైతులు పేర్కొన్నారు. పశువులకు వ్యాధులు వస్తే వైద్యురాలు అందుబాటులో ఉండకపోవడంతో ప్రైవేట్ వారితో పశువులకు చికిత్స చేయిస్తున్నామని రైతులు వాపోయారు. విధులకు సక్రమంగా హాజరు కాని వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
సేవ కోసం కలిసి.. రైతన్నకు అండగా నిలిచి..
ఆలూర్(ఆర్మూర్‌రూరల్), న్యూస్‌లైన్ : గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి పదేళ్ల క్రితం ముక్కెర విజయ్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేశ్, ముత్యం, మోహన్, వెల్మ గంగారెడ్డి, సంతోష్, మునిపల్లి భాస్కర్, గంగమల్లు, వినోద్, గుండేటి భాస్కర్, బాల్‌రెడ్డి, విఠల్, తిరుపతి, తోట శ్రీనివాస్‌రెడ్డి, నితిన్‌లు కలిసి కర్షక్ గ్రూప్‌గా ఏర్పడ్డారు. గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కండె రాయుడి ఆలయం వద్ద స్వాగత ద్వారం నిర్మించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2010లో జిల్లాలో ఉత్తమ సంఘంగా కర్షక్ గ్రూప్ ఎంపికైంది. అప్పటి ఎంపీ మధు యాష్కీ గౌడ్ చేతుల మీదుగా నగదు బహుమతితోపాటు అవార్డును అందుకున్నారు. వ్యవ‘సాయం’ చేయాలని.. గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తూన్న సమయంలోనే రైతులకోసం ఏదైనా చేయాలన్న సంఘం సభ్యులకు వచ్చింది. మార్కెట్లో ఎక్కువ ధరకు విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోతున్నారని గ్రహించిన సభ్యులు.. ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పి తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు అందించాలని నిర్ణయించుకున్నారు. ఏడీఏ రామారావును కలిశారు. సీడ్ విలేజ్ పోగ్రాం(ఎస్వీపీ) గ్రూప్ కింద వరి విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ. 4 లక్షల 80 వేల విలువ గల ఈ యూనిట్‌ను ప్రభుత్వం 90 శాతం రాయితీపై రూ. 48 వేలకే అందించింది. గతేడాది ఖరీఫ్‌లో ఈ యంత్రం ద్వారా విత్తనాల ప్రాసెసింగ్‌ను ప్రారంభించారు. ఆ సీజన్లో 130 క్వింటాళ్ల ధాన్యాన్ని శుద్ధి చేశారు. వాటిని 30 కిలోల బస్తాల్లో నింపి రైతులకు విక్రయించారు. ఒక్కో బస్తాను రూ. 600లకే అందించారు. ఇలా 400 బస్తాలను విక్రయించారు. మార్కెట్లో 30 కిలోల వరి విత్తనాల బస్తా ధర రూ. 700 నుంచి రూ. 750 ఉంది. అయితే నాణ్యమైన విత్తనాలను వీరు తక్కువ ధరకే అందించారు. ఖరీఫ్ సీజన్లో 1.82 లక్షల విలువగల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, వీటిని శుద్ధి చేయడానికి రూ. 18 వేలు ఖర్చయ్యాయని గ్రూప్ సభ్యులు తెలిపారు. విత్తనాలను విక్రయించగా రూ. 40 వేలు లాభం వచ్చిందన్నారు. సోయాలను కూడా శుద్ధి చేసి, రైతులకు తక్కువ ధరకు విత్తనాలను అందించాలన్న ఆలోచన ఉందని పేర్కొన్నారు. మళ్లీ ఖరీఫ్ కోసం విత్తనాలను శుద్ధి చేస్తామని తెలిపారు. ఈ సంఘ సభ్యులను స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలోని యువకులు కొందరు ఆంజనేయ గ్రూప్‌గా ఏర్పడి రాయితీపై ప్రాసెసింగ్ యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.