పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన | The foundation of pipeline work | Sakshi
Sakshi News home page

పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన

Published Tue, Aug 16 2016 10:52 PM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన - Sakshi

పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన

తాగునీరు, ఎంపీ కవిత, ఆలూర్,
ఆర్మూర్‌ అర్బన్‌ : మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటిని అందజేయనున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. ఆలూర్‌లో సోమవారం మన ఊరు –మన ఎంపీ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ రాత్రి ఆలూర్‌లో పల్లెనిద్ర చేశారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యేతో కలిసి గ్రామంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామస్తులు తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. గ్రామంలో మొక్కలు నాటారు. గ్రామంలో రూ. కోటి 92 లక్షలతో చేపడుతున్న మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చే శారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కళాశ్రీప్రసాద్, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement