amalapuram rural
-
టీడీపీకి గుడ్‌బై.. వైఎస్సార్ సీపీలో చేరిక
సాక్షి, అమలాపురం రూరల్ : అమలాపురం పట్టణంలోని టీడీపీకి చెందిన 25 వార్డు మాజీ కౌన్సిలర్ బండారు సత్యనారాయణ, అంబాజీపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారు లోవరాజు(చిన్ని) ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సమక్షంలో శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన బండారు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారు లోవరాజులు వెఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. వీరితో పాటు కామన కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ మోగిలి పోతురాజు, బండారు ప్రశాంత్ కుమార్ కోసూరి వీరన్న తదితరులు పార్టీలో చేరారు. వీరికి మంత్రి విశ్వరూప్ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు దొమ్మేటి రాము, వంటెద్దు వెంకన్న నాయుడు, గొవ్వాల రాజేష్ నాగవరపు వెంకటేశ్వరరావు, మద్దింశెట్టి ప్రసాద్, భరకానిబాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ స్తూపం ఆవిష్కరించిన మంత్రి విశ్వరూప్ పట్టణంలో 27 వార్డులో ఏఎంజీ కాలనీలో వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ స్తూపాన్ని, పార్టీ జెండాను మంత్రి పినిపే విశ్వరూప్ ఆవిష్కరించారు. 27 వార్డు బూత్ కమిటీ కన్వీనర్ బండారు గోవిందు, రంపవలస శ్రీనివాస్‌రావు, పాలెపు చినగంగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ కాలనీలో వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షుడు అర్థాని నాగయ్య, అర్ధాని ముత్యాలు, బండారు ఏడుకొండలు, హక్కుల సంఘం అధ్యక్షుడు యండమూరి శ్రీను, పి.గణపతి, చప్పిడి సతీష్, ఓలేటి శ్రీను, తాళ్లరాజు, భావిశెట్టి సురేష్, పి.గణపతి తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదం: రూ.10 లక్షల నష్టం
సాక్షి, అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక శివాలయం వద్ద పది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదం జరగడానికి కారణం తెలియరాలేదు. పది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. -
పంచాంగాలను ఏకీకృతం చేయాలి
దేవాదాయశాఖ మంత్రికి భీమేశ్వర సిద్ధాంతి వినతి అమలాపురం రూరల్ : పంచాంగాలను ఏకీకృతం చేయాలని కోరుతూ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావుకు బండార్లంక గ్రామానికి చెందిన ప్రముఖ పంచాంగకర్త కాలేపు భీమేశ్వర సిద్ధాంతి వినతి పత్రం అందించారు. జిల్లాకు వచ్చిన మంత్రిని భీమేశ్వర సిద్ధాంతి కలసి ఈ విషయమై కొద్దిసేపు చర్చించారు. పూజలు, వ్రతాలు, పండుగలు, పుష్కరాలతో పాటు మానవుడు జన్మంచిన లగాయితు మరణ పర్యంతం ఆచరించే అన్ని కార్యక్రమాలకు పంచాగమే ప్రధాన ఆధారమని భీమేశ్వర సిద్ధాంతి గుర్తు చేశారు. అటువంటి పంచాం గాలను పూర్వ పద్ధతిలో కొందరు.. మరో పద్ధతిలో కొందరు గుణించడం వల్ల పండుగలు భిన్న తేదీల్లో వస్తున్నాయన్నారు. ఏ పంచాంగాన్ని అనుసరించాలో తెలియక ప్రజలు ఆయోమయంలో పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది ప్రజల నమ్మకాలను.. విశ్వాసాలను.. భారతీయ సం స్కృతి.. వాటి విలువలను పెంపొందించడానికి ప్రభుత్వాలు కల్పించుకుని పంచాంగాలను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ విధానాన్ని శాసనం ద్వారా అమలు చేయాలని ఆయన కోరారు. -
ఏసీబీలో వలలో హెచ్‌సీ, హోంగార్డు
రూ.15 వేల లంచం తీసుకుంటూ చిక్కిన వైనం కేసు నమోదు అమలాపురం రూరల్ : ఏసీబీ వలలో రెండు ఖాకీ చేపలు పడ్డాయి. అమలాపురం తాలూకా పోలీసు స్టేష¯ŒSలో వరకట్నం కేసులో బాధితుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ జక్కి నాగేశ్వరరావు, హోంగార్డు గంటి శ్రీనివాసరావు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికి పోయారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ సుధాకరరావు ఆధ్వర్యంలో సీఐలు సూర్యమోహనరావు, విల్స¯ŒS గురువారం రాత్రి ముందస్తు సమాచారంతో స్టేష¯ŒSపై దాడి చేసి లంచం తీసుకుంటున్న ఇద్దరినీ పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుధాకరావు స్థానిక పోలీసుస్టేçÙ¯ŒSలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను విలేకర్లకు వెల్లడించారు. అమలాపురం రూరల్ మండలం బండార్లంక గ్రామానికి చెందిన అవనిగడ్డ టెంపోరావుపై అతని భార్య సునీత అదనపు వర కట్నం వేధింపులు, రెండో పెళ్లి చేసుకుంటున్నాడని గత జూ¯ŒS ఐదున ఈ పోలీసు స్టేష¯ŒS ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇందులో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేయగా ఇంకా ఏడుగురిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ‘ఈ కేసును నేనే డీల్ చేస్తున్నాను.. రూ.15 వేలు ఇచ్చుకుంటే మిగిలిన ఏడుగురినీ అరెస్టు చేయకుండా చూస్తాను. నీకు న్యాయం చేస్తాను.. కేసు నుంచి నిన్ను కాపాడతా’నని హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావు టెంపోరావుకు పదే పదే ఫోన్లు చేసి డిమాండు చేశాడు. దీంతో విసిగిపోయిన టెంపోరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథక రచన చేశారు. గురువారం రాత్రి టెంపోరావు హెడ్ కానిస్టేబుల్‌కు రూ.15 వేలు ఇవ్వగా, ఆ సొమ్ములను అక్కడే ఉన్న హోంగార్డు శ్రీనివాసరావుకు ఇమ్మని చెప్పాడు. దీంతో హోంగార్డుకు డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కొత్త నోట్లు రూ.500, రూ.2000 నోట్లతో రూ. 15 వేల నగదు, వారి ఇద్దరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ సుధాకరరావు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామని, శుక్రవారం ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. ట్రాప్ సమయంలో స్టేష¯ŒSలోనే ఎస్సై గజేంద్రరావు ఉన్నప్పటికీ ఈ కేసులో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని డీఎస్పీ పేర్కొన్నారు. -
సత్తెన్న దర్శనానికి వెళుతూ...
కాకినాడ క్రైం :అన్నవరం సత్యన్నారాయణ స్వామి దర్శనానికి బయల్దేరిన ఆ కుటుంబాల్లో ఓ మృత్యుశకటం విషాదాన్ని నింపింది. ఆటో డ్రైవర్‌తో పాటు మరో బాలిక ప్రాణాలను బలితీసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గున్నేపల్లికి చెందిన తాడికొండ సత్యనారాయణ మూర్తి తోపుడు బండి మీద గాజులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి తమ్ముడు తాడికొండ వెంకటేశ్వరరావు కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. సత్యనారాయణ మూర్తి భార్య సుబ్బలక్ష్మి, పెద్ద కుమార్తె సుభద్ర, చిన్న కుమార్తె కళ్యాణి (13), అతడి తమ్ముడు వెంకటేశ్వరరావు, భార్య శ్రీదేవి, కుమారుడు మణికంఠ, ప్రవల్లిక అంతా కలసి ముమ్మిడివరం మండలం చింతలమెరకకు చెందిన ఆటో డ్రైవర్ మట్టపర్తి త్రిమూర్తులు (35) ఆటోలో ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి బయల్దేరారు. తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో సామర్లకోట రూరల్ మండలం పవర సెంటర్లోకి వచ్చే సరికి విశాఖపట్నం నుంచి కాకినాడ ఇండియన్ గ్యాస్ సిలిండర్ల లోడుతో వస్తున్న లారీ వారి ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ త్రిమూర్తులు, సత్యనారాయణమూర్తి చిన్న కుమార్తె కళ్యాణి అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న ఏడుగురు గాయాలపాలయ్యారు. స్థానికులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం వారు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. విషయం తెలుసుకున్న తిమ్మాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల లోడుతో వస్తున్న లారీ డ్రైవర్‌కు కునుకు పడడంతోనే ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆటోలో ఉన్న తాము పెద్దగా కేకలు వేసినా లారీ డ్రైవర్‌కు వినిపించుకోలేదని సత్యనారాయణ మూర్తి వాపోయాడు. భయానకంగా సంఘటన స్థలం ఆటోను లారీ ఢీ కొట్టిన సంఘటన భయానకంగా ఉంది. ఆటో డ్రైవర్ త్రిమూర్తులు ఆటోలో చిక్కుకుని మృతి చెందడం, కళ్యాణి ఆ పక్కనే పడి మరణించడం చూపరులను కలచివేసింది. ఆటోలో డ్రైవర్‌తో పాటు తొమ్మిది మంది ప్రయాణిస్తుండగా ఇద్దరు మాత్రమే మృతి చెందారు. కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు తమ చిన్న కుమార్తె కళ్యాణి కళ్లెదుటే మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు, అక్క కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న ఆటో డ్రైవర్ త్రిమూర్తులు బంధువులు కాకినాడ జీజీహెచ్‌కు చేరుకుని రోదించిన తీరు కలచివేసింది. హోం మంత్రి పరామర్శ ఆటోను లారీ ఢీకొట్టడంతో మృతి చెందిన ఆటో డ్రైవర్ త్రిమూర్తులు, బాలిక కళ్యాణిల కుటుంబ సభ్యులను హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించారు. సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఫోన్లో ఆయన వైద్యులకు సూచించారు. సాకుర్రు గున్నేపల్లిలో విషాదం అమలాపురం రూరల్ : కాకినాడ రూరల్ మండలం పవర జంక్షన్ సమీపలో జరిగిన రోడ్డుప్రమాదంలో కళ్యాణి(13) అనే బాలిక మృతిచెందడంతో ఆమె స్వగ్రామం అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గున్నేపల్లిలో విషాదం అలుముకుంది. అమలాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న కళ్యాణి మృత్యువాతతో ఆమె కుటుంబసభ్యులు గుండెలవిసేలా విలపించారు. ఆ కుటుంబం రోడ్డున పడింది ముమ్మిడివరం : కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం శివారున జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన ఆటోడ్రైవర్ మట్టపర్తి త్రిమూర్తులు కుటుంబం జీవనాధారం కోల్పోయి రోడ్డున పడింది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకొనే త్రిమూర్తులు ఆకస్మిక మృతి ఆ కుటుంబాన్ని కలచివేసింది. ముమ్మిడివరం నగర పంచాయతీ చింతలమెరకు చెందిన త్రిమూర్తులకు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు హరిసూర్య చరణ్, కుమార్తె సౌజన్య ఉన్నారు. రోజులాగే ఆటోతో బయలుదేరిన త్రిమూర్తులు అమలాపురం రూరల్ మండలం సాకుర్రు నుంచి అన్నవరం ప్రయాణికులను తీసుకుని ఆదివారం ఉదయం బయల్దేరాడు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం వద్ద అతడి ఆటోను గ్యాస్ సిలిండర్ల లోడు లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నడుపుతున్న త్రిమూర్తులు మృతి చెందాడు.