- రూ.15 వేల లంచం తీసుకుంటూ చిక్కిన వైనం
- కేసు నమోదు
ఏసీబీలో వలలో హెచ్‌సీ, హోంగార్డు
Published Fri, Dec 16 2016 12:07 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
అమలాపురం రూరల్ :
ఏసీబీ వలలో రెండు ఖాకీ చేపలు పడ్డాయి. అమలాపురం తాలూకా పోలీసు స్టేష¯ŒSలో వరకట్నం కేసులో బాధితుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ జక్కి నాగేశ్వరరావు, హోంగార్డు గంటి శ్రీనివాసరావు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికి పోయారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ సుధాకరరావు ఆధ్వర్యంలో సీఐలు సూర్యమోహనరావు, విల్స¯ŒS గురువారం రాత్రి ముందస్తు సమాచారంతో స్టేష¯ŒSపై దాడి చేసి లంచం తీసుకుంటున్న ఇద్దరినీ పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుధాకరావు స్థానిక పోలీసుస్టేçÙ¯ŒSలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను విలేకర్లకు వెల్లడించారు. అమలాపురం రూరల్ మండలం బండార్లంక గ్రామానికి చెందిన అవనిగడ్డ టెంపోరావుపై అతని భార్య సునీత అదనపు వర కట్నం వేధింపులు, రెండో పెళ్లి చేసుకుంటున్నాడని గత జూ¯ŒS ఐదున ఈ పోలీసు స్టేష¯ŒS ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇందులో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేయగా ఇంకా ఏడుగురిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ‘ఈ కేసును నేనే డీల్ చేస్తున్నాను.. రూ.15 వేలు ఇచ్చుకుంటే మిగిలిన ఏడుగురినీ అరెస్టు చేయకుండా చూస్తాను. నీకు న్యాయం చేస్తాను.. కేసు నుంచి నిన్ను కాపాడతా’నని హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావు టెంపోరావుకు పదే పదే ఫోన్లు చేసి డిమాండు చేశాడు. దీంతో విసిగిపోయిన టెంపోరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథక రచన చేశారు. గురువారం రాత్రి టెంపోరావు హెడ్ కానిస్టేబుల్‌కు రూ.15 వేలు ఇవ్వగా, ఆ సొమ్ములను అక్కడే ఉన్న హోంగార్డు శ్రీనివాసరావుకు ఇమ్మని చెప్పాడు. దీంతో హోంగార్డుకు డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కొత్త నోట్లు రూ.500, రూ.2000 నోట్లతో రూ. 15 వేల నగదు, వారి ఇద్దరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ సుధాకరరావు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామని, శుక్రవారం ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. ట్రాప్ సమయంలో స్టేష¯ŒSలోనే ఎస్సై గజేంద్రరావు ఉన్నప్పటికీ ఈ కేసులో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని డీఎస్పీ పేర్కొన్నారు.
Advertisement