ఆ చిత్రంతో మంచి అనుభవం
ఆ చిత్రం నన్ను అయోమయంలో పడేసింది అంటోంది నటి మియాజార్జ్. అమరకావ్యం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి ఈ మలయాళీ బ్యూటీ. ఆ చిత్రం ఆమెను నిరాశ పరచింది. ఇంతకీ మియాజార్జ్ను అయోమయానికి గురి చేసిన చిత్రం ఏది? చిన్న గ్యాప్ తరువాత ఈ అమ్మడు నటిస్తున్న తమిళ చిత్రం ఇండ్రు, నేట్రు, నాళై శ్రీ కుమరన్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సి.వి.కుమార్ స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజాతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది.
విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం హీరోయిన్గా నటించిన అనుభవం గురించి మియాజార్జ్ తెలుపుతూ చిత్ర కథను దర్శకుడు కేరళలో ఉన్న తనకు ఫోన్ ద్వారానే చెప్పారంది. అది విన్న తాను చాలా అయోమయానికి గురయ్యానని చెప్పింది. వర్తమాన, భూత, భవిష్యత్ కథలను టైమ్‌మిషన్ ద్వారా ఎలా ఏకకాలంలో చూపించగలరనే పలు సందేహాలు కలిగాయని తెలిపింది. అయితే ఆ సందేహాలన్నీ చెన్నై వచ్చిన తరువాత దర్శకుడిని అడిగి నివృత్తి చేసుకునే చిత్రంలో నటించడానికి అంగీకరించానని పేర్కొంది. మొత్తం మీద ఈ చిత్రంలో నటించడం చాలామంచి అనుభవం అని అంది. చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని మియాజార్జ్ అంటోంది.