Amber Kishore Jha
-
ఏజెన్సీలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్న చర్ల పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అంబర్కిశోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం ఉదయం ఆయన చర్ల పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. -
ఎస్పీ కార్యాలయ ఏర్పాటుకు ఐటీఐ భవనం పరిశీలన
మహబూబాబాద్ : తాత్కాలిక ఎస్పీ కార్యాలయ ఏర్పాటు కోసం పట్టణ శివారులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ భవనాన్ని బుధవారం రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కార్యాలయ ఏర్పాటుకు భవనం అనుకూలంగానే ఉందన్నారు. ఎస్పీ కార్యాలయం, ఏఆర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆ భవనం చుట్టూ పరిసరాలను కూడా పరిశీలించామన్నారు. ఆ భవనం సమీపంలోనే సబ్‌జైల్ ఉండటం వల్ల భద్రత కూడా బాగానే ఉంటుందన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. క్రైం టీమ్‌లను పెంచి చోరీలను అరికడతామన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని మూడు విభాగాలుగా చేస్తున్నామన్నారు. ఆయన వెంట డీఎస్పీ బి.రాజమహేంద్రనాయక్, సీఐలు నందిరామ్ నాయక్, ఎస్.కృష్ణారెడ్డి ఉన్నారు. -
మేడారం..జనసంద్రం
సమ్మక్క-సారలమ్మ తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో మేడారం మురిసిపోయింది. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి ఆదివారం సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచ్చారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ములుగు గట్టమ్మ, మేడారం వద్ద నార్లాపురం-ఊరట్టం క్రాస్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. నార్లాపురం-ఊరట్టం క్రాస్ మధ్య 5 కిలోమీటర్లు వెళ్లడానికి 30 నిమిషాలు పట్టింది. ట్రాఫిక్ నియంత్రణకు ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి సిబ్బందిని అప్రమత్తం చేశారు. వాహనాలను ఊరట్టం క్రాస్ వద్ద నిలిపివేశారు. హోల్డింగ్ పాయింట్ నుంచి భక్తులను స్థానిక ఆటోల ద్వారా ఆలయం వైపునకు అనుమతి ఇచ్చారు. జంపన్నవాగు వద్ద బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ద్వారా కొన్ని కనెక్షన్లు మాత్రమే ఇవ్వడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటి వరకు ఒక్క మరుగుదొడ్డి కూడా సిద్ధం చేయకపోవడంతో తీవ్రంగా మండిపడ్డారు. ఆలయంలో పనులు జరగుతున్నాయని శనివారం వరకు ఒకవైపు మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చిన అధికారులు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో రావడంతో బారికేడ్లను తొలగించారు.