రూ.9 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్!
♦ ఆంబియెన్స్ ప్రాజెక్ట్‌లో.. 147 గజాల్లో నిర్మాణం
♦ 200 ఎకరాల్లో గ్రీన్ ఎకర్స్ ఫాం ల్యాండ్ కూడా..
సాక్షి, హైదరాబాద్: సామాన్యుల సొంతింటి కలను సాకారం చేయడమే మా లక్ష్యమంటోంది స్పేస్ విజన్. ఇందు కోసం షాద్‌నగర్‌లో అతిపెద్ద వెంచర్, పోలేపల్లి సెజ్‌కు దగ్గర్లో ఫాం ల్యాండ్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. వివరాలను స్పేస్ విజన్ ఎడిఫైస్ ప్రై.లి. సీఎండీ టీవీ నర్సింహా రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.
⇔ షాద్‌నగర్‌లోని రామేశ్వరం దేవాలయానికి కూతవేటు దూరంలో ఆంబియెన్స్ పేరిట మెగా టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నాం. తొలి దశలో 300 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. 147-1,000 గజాల్లో ఓపెన్ ప్లాట్లున్నాయి. గజం ధర రూ.2,250. రుణ సదుపాయం, సులభ వాయిదాల్లోనూ ప్లాట్లను తీసుకోవచ్చు.
⇔ ఈ ప్రాజెక్ట్‌లో ఇండిపెండెంట్ హౌస్‌లను కూడా నిర్మిస్తాం. 147 గజాల్లో వచ్చే ఒక్కో ఇండిపెండెంట్ హౌస్ ధర రూ.9 లక్షలు. 10 ఎకరాల్లో క్లబ్ హౌజ్ కూడా ఉంటుంది. గోల్ఫ్ కోర్ట్‌తో పాటు స్మిమ్మింగ్ పూల్, స్పా, మెడిటేషన్ సెంటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్ వంటి ఆధునిక వసతులెన్నో ఉంటాయి.
⇔ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పెట్టుబడులు పెట్టేవారి కోసం గ్రీన్ ఎకర్స్ పేరిట మరో ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. పోలేపల్లి ఫార్మా సెజ్‌కు దగ్గర్లో 200 ఎకరాల్లో ఫాంల్యాండ్ను చేస్తున్నాం. గ్రీన్ ఎకర్స్ ప్రత్యేకత ఏంటంటే.. ఎకరం విస్తీర్ణంలో 300 మలబార్, ఐదు రకాల 25 సేంద్రియ పండ్ల మొక్కలను పెంచుతాం. వీటి పర్యవేక్షణ, పెంపకం బాధ్యత కంపెనీదే. 10 గుంటల నుంచి ఎకరం వరకు ఫాం ల్యాండ్లుంటాయి. ధర రూ.4.90 నుంచి 18 లక్షల వరకున్నాయి.
⇔ వీకెండ్స్‌లో ఫాంహౌస్‌లో కొనుగోలుదారులు కుటుంబంతో కలసి ఆనందంగా గడిపేందుకు వీలుగా 5 ఎకరాల్లో క్లబ్ హౌస్, గోశాల వంటి వసతులను కల్పించాం.