జగన్‌తోనే రాజన్న స్వర్ణయుగం
మేదరమెట్ల, న్యూస్‌లైన్: వైఎస్ జగన్మోహనరెడ్డితోనే రాజన్న కోరుకున్న స్వర్ణయుగం వస్తుందని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని బొడ్డువానిపాలెంలో గతంలో పీఆర్పీ, టీడీపీల్లో ఉన్న 600 మందిని శుక్రవారం పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనికి ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేయాలన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని, రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలపునిచ్చారు. ముందుగా బొడ్డువానిపాలెంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి కార్యకర్తలు, అభిమానులు బైకులపై ర్యాలీగా అద్దంకి రోడ్డులోని సీతారామస్వామి దేవాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పార్టీలో చేరిన వారిలో తిరుమల శెట్టి నాగేశ్వరరావు, చింతం అంజయ్య, నేరెళ్ల వెంకటేశ్వర్లు, నేరెళ్ల జానకీరామయ్య, ధర్మవరపు దుర్గారావు, పీ హనుమంతరావు, మందలపు అంకారావు, నేరెళ్ల సుబ్బయ్య, పెద్దిరెడ్డి శివారెడ్డి, అన్నెం అంజిరెడ్డి, ఎం హనుమారెడ్డిల ఆధ్వర్యంలో 600 మంది కార్యకర్తలు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు
. కార్యక్రమంలో మండల కన్వీనర్ జజ్జర ఆనందరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కోయి అంకారావు, ఎస్సీ సెల్ నాయకులు రంపతోటి సాంబయ్య, ముత్తవరపు రమణయ్య, అన్నెం అంజిరెడ్డి, కోట శ్రీనివాసరావు, శానం చిన్న వెంకటేశ్వర్లు, జంపు ఆదిశేషు, ఈవూరి సోమారెడ్డి, ఆరుమళ్ల సామియేలు, రామిరెడ్డి అంజయ్య, మేకల అంజిరెడ్డి, రామిరెడ్డి వెంకటస్వామి, యర్రబాలెం సుధాకర్, సాదినేని శ్రీనివాసరావు, జ్యోతి రమేష్, స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు.